Thursday, June 28, 2012

" బడిలో ఏముంది బాబు గుడిలోనే ఉంది"


                                                 
 శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ 
(28-06-1931........23-02-2011)

ఈ రోజు అనగా 28 జూన్ శ్రీ ముల్లపూడి వెంకటరమణ గారి జయంతి. ఆయన ఎన్నో చిత్రాలకు కథ -మాటలు వ్రాసారు. శ్రీ బాపు గారితో కలిసి పలు చిత్రాలకు పనిచేసారు. అందులో ఒకటి "బుద్ధిమంతుడు". ఈ చిత్రం 20-09-1969 లో (శ్రీ నాగేశ్వర రావు జన్మదినం) విడుదల అయ్యింది. అక్కినేని ద్విపాత్రాభినయం, విజయనిర్మల, కృష్ణం రాజు, నాగభూషణం, శాంతకుమారి మొదలగు వారు నటించగా, శ్రీ మామ మహదేవన్ సంగీతం సమకూర్చారు. ఘంటసాల బృందం గానం చేసిన " బడిలో ఏముంది బాబు గుడిలోనే ఉంది" ఓ చక్కటి పాట. మానవ సేవే మాధవ సేవ అని నిరూపించిన చిత్రం. ఆ పాట విందాం.


No comments:

Post a Comment