జగపతి పిక్చర్స్ వారు అన్నపూర్ణ , ఆరాధన తరువాత తీసిన చిత్రం "ఆత్మబలం". అక్కినేని, జగ్గయ్య, సరోజా దేవి నటించారు. ఈ చిత్రం 09-01-1964 లో విడుదలైంది. దర్సకత్వం శ్రీ వి.మధుసూదన్ రావు గారు, సంగీతం శ్రీ కే.వీ. మహదేవన్ సమకూర్చారు. మంచి సంగీతం, కథా బలం ఉన్న చిత్రం కాబట్టే విజయం సాధించింది. ఇందులోని ఒక పాట కోసం, ఆత్రేయ గారిని నిర్మాత శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు బెంగలూరు తీసుకెల్లారట. వారం గడిచినా, ఆత్రేయ గారు పాట రాయలేదట. రాసి ప్రేక్షకులను,వ్రాయక నిర్మాతలను ఏడిపిస్తారని ఆత్రేయ గారిని గురించి చెప్పుతారు. ఇక రేపు బయలు దేరుదాము అని నిర్మాత చెప్పారట. ఆ రోజు ఆత్రేయ గారు బెంగలూరు లోని కబ్బన్ పార్క్ కు వెళ్లారట. ఈయనకు సమీపంలో ఒక జంట కూర్చొందట. ఒక్క సారిగా ఆకాశం మేఘా వ్రతం బై చిటపట చినుకులు పడటం, ఆ జంట, దగ్గరలో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళటం, చూసి, ఆత్రేయ మస్తిష్కంలో చట్టుకున ఆలోచన వచ్చి పాట అంత ఒక వెల్లువలా వచ్చేసింది. ఆ పాటే "చిటపట చినుకులు పడుతూ ఉంటె చెలికాడే సరసన ఉంటె". ఒక అద్భుతమైన పాట మనకు దక్కింది. వాన పాటలకు శ్రీ కారం చుట్టిన పాట, వాన పాటలకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన పాట. ఏ వయసు వారినన్నా ఉర్రుతలూగించే పాట గా నిలిచిపోయింది. మామ మహదేవన్ అద్భుతంగా బాణీ కట్టి ఈ పాటను సూపర్ డూపర్ హిట్ చేసారు. పాట చిత్రీకరణ కూడా అంత బాగా తీసారు దర్శకులు శ్రీ మధుసూదన్ రావు గారు. ఆ పాట విందాము.
No comments:
Post a Comment