అన్నపూర్ణ పిక్చర్స్ రెండవ చిత్రం
"తోడికోడళ్ళు". ఈ చిత్రం, శరత్ నవల "నిష్కృతి" ని ఆధారంగా చేసుకొని తీసినది. ఈ చిత్రం 11-01-1957 లో విడుదలై బహుళ ప్రజాదరణ పొందింది. ఈ
చిత్రానికి శ్రీ ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించగా, శ్రీ మాస్టర్ వేణు
సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలోని పాటలు ఈనాటికి సజీవంగా ఉన్నాయంటే, ఆ
కీర్తి మాస్టర్ వేణు గారికే దక్కుతుంది. మాస్టర్ వేణు గారిది ఒక ప్రత్యెక
శైలి అని చెప్పుతారు. ఆయన పాటలను ట్యూన్ చేసేటప్పుడు, అందరిలా హార్మోనియం వాడకుండా,
సందర్భానుబట్టి, పియానో, వేణువు లేక సితార్ మీద కంపోస్ చేస్తారట. శ్రీ కొసరాజు వ్రాసిన
"టౌన్ పక్క కెల్లోద్దు రా డింగరి" ఒక సందేశం ఉన్న పాట. గ్రామాలూ వదిలి పట్టణానికి వలస వెళితే, అక్కడ ఎదురయ్యే ఇబ్బందులు ఎలా ఉంటాయో తెలియ చెప్పే పాట. ఘంటసాల, జిక్కి
శ్రావ్యంగా పాడారు. ఆ పాట విందాము. ఈ పాటలో నృత్యం చేసిన ఈ.వీ. సరోజ, అన్నపూర్ణ వారు తీసిన "ఇద్దరు మిత్రులు" (1961) చిత్రంలో కథానాయికగా నటించడం కొసమెరుపు.
No comments:
Post a Comment