Friday, June 8, 2012

శివశంకరి శివానంద లహరి....శివశంకరి"



 


విజయా పిక్చర్స్ "జగదేకవీరుని కథ" సంగీత ప్రాధాన్య చిత్రం. ఈ చిత్రం 09-08-1961 లో విడుదలైంది. ఈ చిత్రానికి దర్శక నిర్మాత శ్రీ కదిరి వెంకట్ రెడ్డి. సంగీతం శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు. ఈ చిత్రంలో అన్ని మంచి పాటలే ఉన్నాయి. ఘంటసాల మాస్టారు పాడిన "శివశంకరి శివానంద లహరి....శివశంకరి" ఒక అద్భుత మైన పాట. ఘంటసాల గారు పాడిన కొన్ని వేల పాటలలో, ముని వేళ్ళ మీద లెక్కింప తగ్గ పాట గా  చెప్పుకొంటారు. గీత రచన శ్రీ పింగళి నాగేంద రావు. వర్ధమాన గాయకులు పాటల పోటీలో పాల్గొనా లంటే, ఈ పాటను ఎంచుకొని పాడి  మెప్పించడానికి చూస్తారు. ఎంతో క్లిష్టమైన/ కష్టమైన పాటగా చెప్తారు. ఆ పాట విందాము. కలర్ వీడియో చూద్దాము.
 
 
 




No comments:

Post a Comment