దర్శక నిర్మాత శ్రీ బీ ఏ సుబ్బారావు నిర్మించిన చిత్రం "రాణి రత్నప్రభ". ఈ చిత్రం 1960 లో విడుదలైంది. శ్రీ నందమూరి తారక రామా రావు, అంజలి దేవి నటించిన చిత్రం. శ్రీ సాలూరు రాజేశ్వర రావు సంగీతం సమకూర్చారు. ఘంటసాల మాస్టారు పాడిన "నిన్న కనిపించింది నన్ను మురిపించింది అంద చందాల రాణి" మంచి మెలోడి పాట. రచన శ్రీ ఆరుద్ర. ఆ పాట విందాము.