Saturday, August 10, 2013

" ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక" ( "ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక".)


 శ్రీమతి కోడూరి కౌసల్యా దేవి నవల " చక్రభ్రమణం" ఆధారంగా,  అన్నపూర్ణ సంస్థ, శ్రీ  ఆదుర్తి సుబ్బారావు దర్సకత్వంలో నిర్మించిన చిత్రం, 
 "డాక్టర్ చక్రవర్తి."  ఈ పేరు వినగానే మొదట గుర్తు కు  వచ్చేది  ఘంటసాల   మాస్టారు పాడిన పాట "మనసున మనసై బ్రతుకున బ్రతుకై"(   ఈ పాటను నా బ్లాగ్ లో 08-04-2012 లో ) పోస్ట్ చేశాను. చాల గొప్ప పాట, మాస్టారు కు నచ్చిన పాట గా చెప్పుతారు. 

చిత్ర ప్రారంభంలో ఘంటసాల,  సుశీల గారలు పాడిన పాట " ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక"   ఒక మంచి మెలోడీ పాట.  సాలూరు  రాజేశ్వర రావు సమకూర్చిన సంగీతం ఈ పాటకు మరింత అందాన్ని తెచ్చింది. చాల రోజుల తరువాయి కలుసుకొన్న ప్రేమికులు వాళ్ళ భావాలు ఎలా ఉంటాయో చక్కగా చెప్పిన పాట. చిత్రీకరణ కూడా బాగా ఉంది. పాటలో  చరణం "ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక". ఎంత అందంగా చెప్పారు కవి  శ్రీ ఆరుద్ర. ఆ పాట విందాము. వీడియో సహకారం తెలుగు ఒన్, యు ట్యూబ్ ద్వారా, వారికి నా ధన్యవాదాలు. 

ఆ రోజుల్లో, పాటలను మొదటి సారి చిత్రంలోనే వినే వాళ్ళం . ఆడియా కేసెట్లు, వగైరా లేని  రోజులు. కేవలం గ్రామఫోన్ రికార్డ్స్ లో విడుదల చేసినా, అందరికి అందుబాటులో ఉండేవి కావు.  విన్న పాటను  మళ్ళి  వినాలన్నా, సినిమా చూడవలసిందే.   ఈ రోజుల్లో చిత్రం విడుదల కు ముందే పాటలను విడుదల చేస్తున్నారు.  కాని పాత పాటలకు ఉన్న ఆదరణ నేటి పాటలకు లేవు.


 

8 comments:

  1. కవి ఆత్రేయ కాదు. సరిచేయండి.
    శ్యామ్

    ReplyDelete
    Replies
    1. మీ సూచనకు ధన్యవాదాలు. పొరపాటు దొర్లింది . ఈ పాట వ్రాసింది శ్రీ ఆరుద్ర గారు. సరి చేశాను.

      మీ స్పందనకు నా ధన్యవాదాలు.

      Delete
  2. ఘంటసాల మాస్టారు గారి పేరుతొ బ్లాగ్ నడుపుతూ వారి పాటలు వీడియోలు పెడుతున్నందుకు అభినందనలు . మాకు కుడా శ్రీ ఘంటసాల సంగీత కళాసమితి అనే సంస్థ ఉంది .దాని ద్వారా ఘంటసాలగారి జయంతులు ,వర్ధంతులు మరియు ఇతర సంగిత కార్యక్రమాలు(ఘంటసాల విభావరులు ) చేస్తుంటాము.

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదాలు. ఘంటసాల గారికి ఎందరో అభిమానులు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ అభిమానాన్ని చాటుకొంటారు. మీరు కూడా మీ కళాసమితి ద్వారా మాస్టారు గారి జయంతులు, వర్ధంతులు చేస్తున్నారని విని సంతోషంగా ఉంది. ఇక్కడ హైదరాబాద్ లో నిరంతరం మాస్టారు గారి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. మాకు కూడా ఒక సంస్థ ఉంది. " కీరవాణి రాగ సాంస్కృతిక సంగం" పేరున ఘంటసాల గారి పాటల ప్రోగ్రాం చేస్తుంటాము. ఈ సారి కార్యక్రమంలో మిమ్మల్ని ఆహ్వానిస్తాం, తప్పక రావడానికి ప్రయత్నం చేయండి.

      Delete
  3. Very god song.Ghantasala sung it in a special manner suited to the situation.

    ReplyDelete
    Replies
    1. Thanks Radharao garu for your feedback. Yes, its a situation song, melodiously sung by Ghantasala and Suseela with good lyrics by Aarudra and nicely picturised by Adurthi Subba rao and romatically acted nu ANR and Krishnamumari. Last but not least, well tuned by Salur Rajeswara Rao.

      Delete
  4. Thanks for posting a wonderful song. As you said the old songs have great meaning and music. Now a days don't call them songs- no clarity only u can identify some telugu words if u keenly observe. You cannot call them telugu songs at all.

    ReplyDelete
    Replies
    1. Thanks Sri Subba Rao gaaru for daringly admitting the fact about the present day songs. Patha patalu madurame kaadu, bangaram kooda. ( Old songs are not only Old but Gold too)

      Delete