Wednesday, December 31, 2014

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2015


ఘంటసాల అభిమానులకు , సంగీతాభిమానులకు 
నా స్నేహితులందరికీ, శ్రేయోభి లాషులకు, 
           పేస్ బుక్ సన్నిహితులకు 
                         
                       
                                                2 0 1 5

                నూతన సంవత్సర శుభాకాంక్షలు 

                                      
                                 కే వీ రావు , అధ్యక్షులు                                                                     కీరవాణి రాగ సాంస్కృతిక సంఘం 


నూతన 

Tuesday, December 30, 2014

" టాటా...... వీడుకోలు..... గుడ్ బై...... ఇంక శెలవు"




2014 సంవత్సరానికి వీడుకోలు పలికే సమయం వచ్చింది. ఇంక కొన్ని ఘంటల్లో 2015 వ సంవత్సరం రాబోతుంది. 
ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో మధుర క్షణాలు, ఎంతో విషాదం మిగిల్చింది 2014. అక్కినేని జనవరి 22 నిష్క్రమించారు. అలాగే అంజలి, బాపు గారు,. కి బాలచందర్ గారు వెళ్లి పోయారు. 
ఘంటసాల గారు లేకుండా 40 సంవత్సరాలు గడిచాయి.  కాని అయన పాటలు నిత్యమై, సత్యమై నేటికి వినిపిస్తూనే ఉంది.  ఇలాగే కొన్ని తరాలవరకు వినిపిస్తుంది. అ పాటలన్నీ అజరామరం. 

బాపు గారి దర్సకత్వం వహించిన "బుద్ధిమంతుడు" చిత్రం లో  ఘంటసాల మాస్టారు పాడిన పాట 
" టాటా......  వీడుకోలు.....  గుడ్ బై......  ఇంక శెలవు"     పాటను వీరందరికీ నివాళి గ సమర్పిస్తున్నాను. 
సంగీతం శ్రీ మహదేవన్ పాట సేఖరణ యు ట్యూబ్ ద్వారా. వారికి ధన్యవాదాలు. 




















Tuesday, December 16, 2014

" , " నీ ఆస అడియాస, చేజారే మణి పూస, బ్రతుకంతా అమావాస, లంబాడోళ్ళ రామదాస"


దర్శక నిర్మాత శ్రీ కి బీ తిలక్ నిర్మించిన చిత్రం ఎం ఎల్. ఎ.  సంగీతం శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు. ఈ చిత్రం తోనే, గాయని యస్ జానకి సినీ రంగ ప్రవేశం చేసింది. 
ఘంటసాల జానకి పాడిన " నీ  ఆస అడియాస, చేజారే మణి పూస, బ్రతుకంతా అమావాస, లంబాడోళ్ళ రామదాస" చాలా పాపులర్ అయిన పాట.  ఆ పాట విందాము. ఘంటసాల గారి గళం లో ఎంత ఆర్ద్రత ఉందొ గమనించండి







Friday, December 5, 2014

"గాయకులలో ఘంటసాల ను నేనే"-- శ్రీ కృష్ణ ఉవాచ

డిసెంబర్ 4 ఘంటసాల గారి 92 వ  జయంతి.  అంతకు రెండు రోజుల ముందు, అనగా డిసెంబర్ 2, శ్రీ కృష్ణ జయంతి జరిగింది. 
ఘంటసాల మాస్టారు చివర దశలో "శ్రీ భగవథ్గీత " గానం చేసి, తన జన్మ సార్థకం చేసుకున్న మహా మనిషి. 

భగవథ్గీత లోని, 10 వ ఆధ్యాయంలో, శ్రీ గీతా  చార్యుడు చెప్పారు :

                           "మహార్షీ ణామ్ భ్రుగు రహం      
                             గిరామస్మేక్య మక్షరం 
                             యజ్ఞానాం జప యజ్ఞో స్మే 
                             స్థావరాణాం హిమాలయః " 
దీని అర్థం " నేను మహర్షులలో భ్రుగువును, శబ్దములలొ ఓంకారమును , యజ్ఞములలో జప యజ్ఞమును,
స్థావరములలో హిమవంతుడను". 

ఇంకా ఏమి  చెప్పారంటే , దేవర్షులలో నారదుడు, గంధర్వులలో చిత్రరథుడు, సిద్దులలో కపిల మునియు,
ఏనుగులలో ఐరావతము, దేనువులలో కామధేనువు, సర్పములలో వాసుకి  ఇలా చాలా చాలా, అన్నీ తనే అని  చెప్పారు ........  కాని
గాయకులలో ఎవరో చెప్పకుండా వదేలేసారు.?
మనం ఇప్పుడు  "గాయకులలో ఘంటసాల ను నేనే" అని  కృష్ణుని మాటగా సగర్వంగా చెప్పు కొందాము. మనం ఘంటసాల గారికి ఇచ్చే నిజమైన నివాళి ఇదే.  



Monday, November 24, 2014

"మురిపించే అందాలే అవి నన్నే.చెందాలె"..................................



బొబ్బిలి యుద్ధం 1964 లో విడుదలైన చారిత్రాత్మక చిత్రం. దర్శక నిర్మాత  శ్రీ సీతారం. మేటి తారాగణం గల చిత్రం. సంగీతం శ్రీ సాలూరు రాజేశ్వర రావు. పాటలన్నీ బగున్నయి. ఘంటసాల సుశీల పాడిన "మురిపించే అందాలే అవి నన్నేచెందాలె " బాగా పాపులర్ అయిన యుగళ గీతం. 

తెర మీద సీతారం జమున మీద చిత్రీకరించారు . సీతారం వేసిన పాత్రకు అక్కినేనిని దృష్టిలో పెట్టుకొని, ఘంటసాల గారిచే రెండు యుగళ గీతాలు రికార్డు చేసారట., సంగీత దర్శకులు మరియు నిర్మాత సీతారం గారలు. కొన్ని కారణాల వల్ల అక్కినేని ఆ పాత్రను వేయలేదు. అప్పుడు దర్శక  నిర్మాత అయిన శ్రీ సీతారం గారే వేసారు. ఆ పాటలను వీరి మీద చిత్రీకరించడం జరిగింది. 

ఆ పాట విందాం. సేకరణ యు ట్యూబ్ ద్వారా. వారికి కృతజ్ఞతలు. 




Wednesday, October 22, 2014

చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి'


అందరికి దీపావళి శుభాకాంక్షలు. 

ఘంటసాల సుశీల పాడిన ' చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి'
ఒక చక్కటి పాట . విందాం .  ఈ పండగ రోజు ఆనందంతో గడుపుదాం 
చిత్రం విచిత్ర భంధం 

Saturday, August 9, 2014

"నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని "

Gulebakavali Katha.jpgImage result for dr.c.narayana reddy pictures

డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఈ మధ్యనే తమ పుట్టిన రోజు పండుగ జరుపుకున్నారు. ( జూలై 29)
గత 52 సంవత్సరాలుగా ఆయన సినీ రంగానికి చేసిన సేవలు అమోఘం. 

1962 లో "గులేభకావలి కథ"   చిత్రం ద్వారా సినీ రంగానికి పరిచయ మయ్యారు. ఈ చిత్రం లోని  
"నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని " పాటతో తెలుగు హృదయాలను దోచుకొన్నారు. 
నేటికి ఈ పాట అజరామరమై శ్రోతల మనసులో నిలిచి ఉంది. ఈ చిత్రానికి సంగీతం: జోసెఫ్ అండ్ విజయా కృష్ణమూర్తి ఆ పాట విందాం 







Monday, July 21, 2014

" గోరింక గూటికే చేరావు చిలకా ...... బయమెందుకే నీకు బంగారు మొలక"


ఆదుర్తి సుబ్బారావు దర్సకత్వం, కి వీ మహదేవన్ సంగీతం కలయిక లో వచ్చిన చిత్రం. "దాగుడు మూతలు"  1964 విడుదల   నందమూరి, సరోజా దేవి, ముఖ్య నటీ నటులు. 

ఈ చిత్రంలోని అన్ని పాటలు ప్రజాదరణ పొందినవే. ప్రముఖంగా ఘంటసాల మాస్టారు పాడిన 

" గోరింక గూటికే చేరావు చిలకా ...... బయమెందుకే నీకు బంగారు మొలక"
మంచి మెలోడీ పాట.   గీత రచన  శ్రీ దాశరథి  పాట విందాం. యు ట్యూబ్ సహకారంతో



Sunday, June 15, 2014

"కల కానిది నిజమైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు"

 మహాకవి శ్రీ శ్రీ వర్ధంతి నేడు .....అనగా 15 జూన్.

అయన వ్రాసిన పాటలలో ఎంతో విజ్ఞత ఉంటుంది. వెలుగు నీడలు చిత్రం లోని 
పాట  "కల కానిది నిజమైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు" 
అగాధమౌ జల నిధి లోన ఆణి ముత్యం ఉన్నటులే, శోకాన మరుగున దాటి సుఖ మున్నదిలే 
ఏది తనంత తానై నీ దరికి రాదు శోధించి సాదించాలి అదియే ధీర గుణం "
చాలా భావ గర్భిత మైన పాట.  ఒక మనిషి జీవితం లో  ఒడి పోయి ఆత్మహత్య 
చేసుకోబోయి, ఈ పాట వినిపిస్తే, తన ప్రయత్నాన్ని మానుకోన్నాడట.
తన పాట వల్ల ఒకరి జీవితం నిలబదిందంటే, ఆ రచయితకు ఇంత కంటే ఏమి కావాలి.




                    ...

Tuesday, June 10, 2014

" వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడ"


రాజ్య లక్ష్మి పిక్చర్స్ నిర్మించిన చిత్రం "గోవుల  గోపన్న"  1968 విడుదల . 
దర్శకుడు: సీ యస్ రావు.  సంగీతం: ఘంటసాల గారు . 
కొసరాజు వ్రాసిన గీతం " వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడ"
మంచి పాట .   గోవును గురించి ఎన్నో విషయాలు తెలియ చెప్పిన పాట
ఘంటసాల గళం లో వన్నె తెచ్చింది. 



Friday, May 16, 2014

"పెదవుల పైన సంగీతం"


వాసు ఫిల్మ్స్ నిర్మించిన చిత్రం " పుణ్యవతి". దర్శకుడు V దాదా మిరాసి.  సంగీతం ఘంటసాల మాస్టారు. 1967 లో. 
విడుదల 

ఈ చిత్రంలో, డా సి నారాయణ రెడ్డి గారు వ్రాసిన "పెదవుల పైన సంగీతం" ఒక చక్కటి  పాట. ఘంటసాల గళం లో మరింత హుందా గా ఉంది. 

ఆ పాట విందాము. పాట సేకరణ యూ ట్యూబ్ ద్వారా




Tuesday, May 6, 2014

" కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడి తానా "




నేడు అంటే 07.. 05.. 2014..  ఆత్రేయ జయంతి 

కిళాంబి వెంకట నరసింహాచార్యులు అంటే కొంత మందికే తెలుసు . 
ఆచార్య ఆత్రేయ  అంటే చాలా మందికి  తెలుసు 
మనసు కవి అంటే చాలా చాలా .మందికి ... మనందిరికి   తెలుసు.
అంతలా అందరి మనసులో నిలిచి పోయిన మహా కవి ఆత్రేయ గారు.
వ్రాయక నిర్మాతను, రాసి ప్రేక్షకులను ఏడి పిస్తారని చెప్తారు.

"తోడి కోడళ్ళు" చిత్రం లో ఆత్రేయ గారు రాసిన " కారులో షికారు కెళ్ళే పాల బుగ్గల పసిడి తానా " పాట వింటే, ఆయన మనోభావాలు ఏమిటో తెలుస్తాయి. శ్రీ శ్రీ గారు రాసారా అన్న  బ్రమ కలిగించి ఆశ్చర్య పరచారు.. ఇంక ఘంటసాల గారి గళం లో ఆ పాట ఎంతో మాధుర్యాన్ని పొందింది. మాస్టర్ వేణు చక్కటి సంగీతం అందించారు. అందుకే, ఈ నాటికీ ఈ పాట స్థిర స్థాయిగా నిలిచి పోయింది...

శ్రీ ఆత్రేయ గారికి జోహార్లు  అందిస్తూ ..... ఈ పాట విందాము. ....


Monday, May 5, 2014






తెలుగులో మొదటి సినీ నేపధ్య  గాయని శ్రీమతి రావు బాలసరస్వతి  దేవి.. 

దేవదాస్ చిత్రం లో ఈమెపాడిన " తానే మారెన నన్నేమారెన" నేటికీ సంగీత ప్రియులకు గుర్తు ఉంది.    

Friday, May 2, 2014

" నేడు శ్రీవారికి మేమంటే పరాక ...... తగని బలే చిరాక " మంచి మెలోడీ పాట



ప్రసాద్  ఆర్ట్స్ పిక్చర్స్ నిర్మించిన చిత్రం "ఇల్లరికం". విడుదలై  55 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 

01..05. 1959 లో విడుదలై రజతోత్సవం జరుపుకొంది. మంచి  కథ, మంచి సంగీతం, అక్కినేని, జమున, గుమ్మడి   నటన,    రేలంగి, రమణా రెడ్డి హాస్యం,  చిత్ర విజయానికి దోహదం చేసాయి. 
 సంగీతం: T చలపతి రావు.

ఘంటసాల- సుశీల యుగళ గీతం " నేడు శ్రీవారికి మేమంటే పరాక ......  తగని బలే చిరాక " మంచి మెలోడీ పాట.. కేవలం చిత్రంలోనే కాకుండా, నిజ జీవితంలో కూడా, భార్యా  భర్తల మధ్య ఇలాంటి చిన్న తగవులు వస్తూ ఉంటుంది. అందుకనే, ఈ పాట అందరికి వర్తిస్తుంది. ఆ పాట విందాము.  






Tuesday, April 22, 2014

"టాటా వీడుకోలు..... గుడ్ బై...... ఇంక శెలవు"


Buddhimanthudu

శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ, బాపు కలయికలో వచ్చిన చిత్రం " బుద్ధిమంతుడు". 1969 లో విడుదల . 
సంగీతం K V మహదేవన్. చిత్రంలోని పాటలన్నీ బాగున్నాయి. ముఖ్యంగా ఘంటసాల మాస్టారు పాడిన 
" వేయి వేణువులు మ్రోగే వేళ",,,, టాటా  వీడుకోలు ........ బడిలో ఏముంది బాబు .........పాటలు ఎంతో 
ప్రజాదరణ పొందినవి. అలాగే  ఘంటసాల-సుశీల  యుగళ గీతం "గుట్టమీద" కూడా మంచి మెలోడీ పాట. 
ఈ చిత్రం 1969 లో అక్కినేని పుట్టిన రోజు ....... సెప్టెంబర్ 20 ... విడుదల. 

 ఘంటసాల గారి పాటలు చిత్ర విజయానికి ఎంతో దోహదం చేసాయి  అనడం  అతి శయోక్తి కాదు.  

ఇప్పుడు ఘంటసాల పాడిన "టాటా వీడుకోలు.....  గుడ్ బై......  ఇంక శెలవు" పాట విందాము. వీడియో  క్లిప్పింగ్ యూ ట్యూబ్ నుండి సేఖరణ. వారికి ధన్యవాదాలు 



Tuesday, April 15, 2014

" చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దిమ్మ దీయ అందమంతా చీరలోనే ఉన్నది".



Bangaru Babu

జగపతి పిక్చర్స్ బ్యానర్ లో శ్రీ V B రాజేంద్ర ప్రసాద్ దర్సకత్వం వహించి, నిర్మించిన చిత్రం-----". బంగారు బాబు".   చిత్ర కథకుడు కూడా ఆయనే.
 అక్కినేని, వాణిశ్రీ, జగ్గయ్య, జయంతి, S V రంగారావు నటించారు. 

సంగీతం  K V మహదేవన్. పాటలన్నీ సూపర్ గా ఉన్నాయి.  

ఇందులో ఘంటసాల- సుశీల యుగళ గీతం " చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దిమ్మ దీయ అందమంతా చీరలోనే  ఉన్నది"....... మంచి ఉషారు గా సాగే పాట.   గీత రచన శ్రీ ఆత్రేయ.  చిత్రీకరణ ఎంతో బాగుంది.  ఆ రోజుల్లో కుర్ర కారును ఒక ఊపు ఊపిన పాట.  ఘంటసాల గారు పాడిన తీరు అమోఘం



Tuesday, April 8, 2014

"పాపాయి పద్యాలు",.........ఘంటసాల



ఘంటసాల నోట విన్న పద్యమే అమోఘం. వింటే అదే ఆనందం. 

'శిశువు' అనే శీర్షిక లో యూ ట్యూబ్ వారు సమర్పించిన, ఘంటసాల గారి "పాపాయి  పద్యాలు",  ఎంతో బాగున్నాయి.  విని  ఆనందించండి. ......................... 
రచన శ్రీ గుర్రం జాషువా గారు. 





Sunday, April 6, 2014

మన ఘంటసాల పార్ట్ I




గాన గంధర్వుడు  ఘంటసాల గురించి " మన ఘంటసాల" అనే శీర్షిక న యూ ట్యూబ్ లో లబించిన ఒక భాగాన్ని ఇక్కడ పొందు పరుస్తున్నాను. 

వీటిని  కొంత మంది చూసి ఉండవచ్చు.  చూడని వారికోసం, ఘంటసాల  అభిమానిగా, దీనిని మన అందరి కోసం మరొక్క సారి చూసే అవకాసం.  ఇది మన ఘంటసాల పార్ట్ I మాత్రమే. 

చూసి  ఆనందించండి.. (యూ ట్యూబ్ వారికీ ధన్యవాదాలు).. 





Saturday, April 5, 2014

" మనసు పరిమళించెనే" (తెలుగు), మనవు ప్రేమ వాయితే (కన్నడ) ఒకే పాట రెండు బాషలలో



జయంతి పిక్చర్స్ " శ్రీ కృష్ణార్జున యుద్ధం" చిత్రానికి సంగీతం శ్రీ  పెండ్యాల నాగేశ్వర రావు గారు. ఈ  చిత్రం లోని అన్ని పాటలు బాగున్నాయి. 

ఈ చిత్రాన్ని కన్నడం లో తర్జుమా  చేసారు. 

ఘంటసాల, సుశీల  గానం చేసిన యుగళ గీతం " మనసు పరిమళించెనే" (తెలుగు), మనవు ప్రేమ వాయితే (కన్నడ) పాటను   విందాము. 


























Friday, April 4, 2014

"సిగ లోకి విరులిచ్చి చెలి నొసట తిలక మిడి",






వీనస్ పిక్చర్స్ నిర్మించిన చిత్రం "సుమంగళి", 1965 లో విడుదల. అక్కినేని, జగ్గయ్య, సావిత్రి ముఖ్య 
తారాగణం. దర్సకత్వం శ్రీ  ఆదుర్తి సుబ్బారావు , సంగీతం శ్రీ K V మహదేవన్. పాటలు ఆత్రేయ. పాటలన్నీ బహుళ 
ప్రజాదరణ పొందినవే. 

ఘంటసాల మాస్టారు పాడిన "సిగ లోకి విరులిచ్చి చెలి నొసట తిలక మిడి", కంట  తడి పెట్టించే పాట. మాస్టారు ఎంతో ఆర్ద్రతతో పాడారు. ఆ పాట వీడియో క్లిప్పింగ్ చూద్దాము. 



Thursday, March 13, 2014

" ఇంగ్లీషు లోన మ్యారేజి, హిందీ లో అర్థము షాది"


జగపతి పిక్చర్ నిర్మించిన   రెండవ చిత్రం 'ఆరాధన'.  1962 లో విడుదల.  నిర్మాత శ్రీ  V B రాజేంద్ర ప్రసాద్, దర్శకుడు శ్రీ V మధుసూదన్ రావు. సంగీతం శ్రీ సాలూరు రాజేశ్వర రావు. ఘంటసాల మాస్టారు, ఈ చిత్రంలో మూడు పాటలు పాడారు . ఒకటి నాయకుడు అక్కినేనికి ( నా హృదయంలో నిదురించే చెలి), మిగిలిన రెండు, శ్రీ రేలంగి కి.  ఈ చిత్రంలోని అన్ని పాటలు బహుళ ప్రజాదరణ పొందినవి.   ఘంటసాల -జానకి  పాడిన " ఇంగ్లీషు లోన మ్యారేజి, హిందీ లో అర్థము షాది" సరదాగా సాగిపోయే పాట.  గీత రచన ఆరుద్ర . ఆ పాట విని ఆనందించండి



Sunday, March 9, 2014

"చేతిలో చెయ్యేసి చెప్పు బావ, చేసుకొన్న బాసలు చెదిరి పోదని".


జగపతి పిక్చర్స్ వారు నిర్మించిన చిత్రం 'దసరా బుల్లోడు'. నిర్మాత, దర్శకుడు శ్రీ V B రాజేంద్ర ప్రసాద్. విడుదల 13-01-1971. 
అప్పటివరకు కేవలం నిర్మాత గానే ఉంటూ వచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారు ఈ చిత్రానికి దర్సకత్వం వహించి, చిత్రాన్ని సూపర్ డూపర్ విజయం చేసారు.  మామ మహదేవన్ అందించిన సంగీతం,  చిత్రాన్ని తారాపథంలో నిలపెట్టింది. పల్లె వాతావరణం, అక్కినేని పంచ కట్టు, హీరో కున్న బుల్లి కారు, వాణిశ్రీ హావ భావాలూ, చిత్రానికి వన్నె తెచ్చాయి. 
పాటలు, పాటల చిత్రీకరణ అమోఘంగా ఉండి , కుర్ర కారును, మహిళా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఆత్రేయ కలం నుండి  జారు వాలిన పాటలన్నీ మధురంగా ఉండి, ఘంటసాల గాత్రంలో అవి అజరామరంగా నిలిచిపోయింది. అలాంటి  పాటే,
"చేతిలో చెయ్యేసి చెప్పు బావ, చేసుకొన్న బాసలు చెదిరి పోదని".  ఆ   పాట  విందాము.\\
 వీడియో క్లిప్పింగ్ దొరక లేదు.   ఆడియో మాత్రమే ఉంది.




Thursday, March 6, 2014

'తెల్ల చీర కట్టుకొన్నది ఎవరికోసము'

జగపతి పిక్చర్స్ పరంపరలో వచ్చిన 4వ చిత్రం "అంతస్తులు". చిత్ర దర్శకుడు శ్రీ V. మధుసూదన్ రావు, సంగీతం శ్రీ K V మహదేవన్. అక్కినేని,భానుమతి, కృష్ణకుమారి, గుమ్మడి, జగ్గయ్య, రేలంగి, రమణా రెడ్డి నటించిన చిత్రం, మంచి ప్రజాదరణ పొందింది.  పాటలన్నీ బాగున్నాయి. ఘంటసాల సుశీల గారలు పాడిన 'తెల్ల చీర కట్టుకొన్నది ఎవరికోసము' సూపర్ హిట్ పాట.  రచన శ్రీ ఆత్రేయ.  ఆ పాట విందాము. 




Thursday, February 27, 2014

'దేవ దేవ ధవలాచల మందిర గంగాధర హర హర నమో నమో'





 Bhookailas58.jpg

ఈ రోజు మహాశివరాత్రి. శివుని మీద ఘంటసాల మాస్టారు ఎన్నో పాటలు పాడారు. భక్తి పాటలంటే మాస్టారు పాడినవే వినాలి, అంత రక్తిగా ఉంటుంది. బహుశా నేడు కైలాసంలో మహాశివుడు, ఘంటసాల గారితో పాటలు పాడించుకుంటూ, నాట్యం చేస్తున్నాడేమో.  మనం కూడా, శివుని మీద పాట విందాం. " భూకైలాస్" చిత్రం లోని 
'దేవ దేవ ధవలాచల మందిర గంగాధర హర హర నమో నమో' పాట  విని తరిద్దాం.  గీత రచన: సముద్రాల, సంగీతం R గోవర్ధన్, సుదర్శన్.


Saturday, February 22, 2014

" ఓ తోడు లేని చెల్లీ , పగ పూనె పాత సంఘం, "

శ్రీ సారథి స్టూడియోస్ నిర్మించిన చిత్రం ' కుంకుమ రేఖ'.. ఈ చిత్రం 1960 లో విడుదల. చిత్ర దర్శకుడు శ్రీ తాపి చాణక్య, సంగీతం శ్రీ మాస్టర్ వేణు. ఇందులో ఘంటసాల మాస్టారు పాడిన " ఓ  తోడు లేని చెల్లీ , పగ పూనె  పాత సంఘం, నీ తాళి  తెగిన నాడే ఎగతాళి నీకు శాపం "  తెర వెనుక పాట. సావిత్రి మీద చిత్రీకరణ. చాలా అరుదుగా వినిపించే పాట.  ఈ పాట వింటూ ఉంటె, 1955 లో వచ్చిన " ఉడన్ ఖటోల" చిత్రంలోని "ఓ దూర్ కె ముసాఫిర్, హమ్ కో భి సాత్ లేలే" పాట గుర్తుకు వస్తుంది. 

Thursday, January 23, 2014

" తీరేనుగా నేటితోనే తీయని గాధ, మిగిలిపోయే (మా) మధిలో మాయని బాధ"

 అక్కినేని ఇంక లేరు అన్న వార్త విని, మనసు ద్రవించింది. ఒక మహా నటుడే కాక, ఒక  మహా మనీషి.  ఆయన ఎక్కని మెట్టు లేదు. రాని బిరుదు లేదు. ఉన్నత శిఖరాలు అధిరోహించిన మానవతా వాది. ఆయన మహాభి నిష్క్రమణ చేసారు. ఆయన కు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు వారు లేని లోటును భరించే శక్తి ఇవ్వాలని ఆ భగవంతున్ని మనసారా  వేడుకొంటున్నాను. 
ఆయన నిష్క్రమణకు సంభందించిన పాట, 'పెళ్ళికానుక' చిత్రంలోని 
" తీరేనుగా నేటితోనే తీయని గాధ, మిగిలిపోయే (మా) మధిలో మాయని బాధ" పాట విందాము. మనసు ద్రవించక మానదు. 

 

Friday, January 17, 2014

"ఆడవాళ్ళ కోపంలో అందమున్నది, అహ.. అందులోనే అంతులేని అర్థమున్నది".



 File:Chaduvukunna Ammayilu.jpg
అన్నపూర్ణ పిక్చర్స్ చిత్రం "చదువుకున్న అమ్మాయిలు". ఈ చిత్రం 10-04-1963 లో విడుదల అయ్యింది. అక్కినేని, సావిత్రి, కృష్ణకుమారి. శోభన్ బాబు, సరోజ, మొదలగు వారు నటించారు. ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకుడు. శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారు సంగీతం సమకూర్చారు. ఈ  చిత్రానికి  మూలం  డాక్టర్ శ్రీదేవి నవల "కాలాతీత వ్యక్తులు".  మంచి కథ, మంచి సంగీతం ఉన్న చిత్రాలు తీయడం అన్నపూర్ణ పిక్చర్స్ ప్రత్యేకత. అన్ని పాటలు బహుళ ప్రజాధరణ పొందినవే. ఘంటసాల మాస్టారు సుశీల తో పాడిన
"ఆడవాళ్ళ కోపంలో అందమున్నది,  అహ......  అందులోనే అంతులేని అర్థమున్నది". పాట ఎంతో హాయిగా ఉండి, మనసును ఆహ్లాద పరుస్తుంది.   ఆ పాట విందాము. పాట క్లిప్పింగ్ యు ట్యూబ్ ద్వారా సేకరించడం జరిగింది. వారికి   నా ధన్యవాదాలు