Tuesday, December 3, 2013

తెలుగు సినీ జగత్తులో మలయ మారుతం ...... మన ఘంటసాల

డిసెంబర్ 4 ఘంటసాల అభిమానులందరికీ పర్వ దినం. కారణం ఆయన జయంతి నేడు.
తెలుగు చిత్ర పరిశ్రమ కు దొరికిన ఆణిముత్యం శ్రీ ఘంటసాల మాస్టారు. ఆయన పాడిన పాటలు నిత్య వసంతాలు.
కారణ జన్ముడు, గాన గంధర్వుడు, నిగర్వి, పరోపకారి, మన ఘంటసాల గారు.

ఆయన జయంతి సంధర్భంగా ఒక చిన్న కవిత:

  తెలుగు సినీ జగత్తులో మలయ మారుతం ......                మన ఘంటసాల 
  రాతి యుగాన్నే పాటల స్వర్ణ యుగంగా మలచెను ..         మన ఘంటసాల
  తరాలు మారినా తరగని పాటల మకరంధం రుచి చూపే ..  మన ఘంటసాల 
  పాటల సంపదను మన కొసగిన గంధర్వుడు ........           మన ఘంటసాల 

                 విన్న కొలదీ వినాలనే కుతూహలం 
                 ఎన్ని సార్లు విన్నా తరగని ఆనందం 
                 మనిషి పోయీనా మరువలేని బంధం
                 ఆయన పాటలతో అల్లుకొన్న అనుబంధం. 

                 ఓ ఘంటసాల నాయకా, గానాగ్రేశ్వర 
                 జోహార్లు మీకు.. అవని ఉన్నంతవరుకు
                 వింటూనే ఉంటాము మీ పాటలు ...

కాశి వెంకోబ రావు ..... 9885482942
People say 'OLD IS GOLD'
FOR THE WORD "OLD" ADD "G" it becomes GOLD
and that "G"  is nothing but Ghantasala

ఆ పాత మధురాలు మరువలేని సుమధురాలు







Thursday, November 7, 2013

"అందమైన తీగకు పందిరుంటే చాలును, పైకి పైకి పాకుతుంది చినదానా, పరవశించి సాగుతుంది చినదానా"


1953 లో వచ్చిన 'బ్రతుకు తెరువు' (అక్కినేని, సావిత్రి), 
(సంగీతం ఘంటసాల) చిత్రాన్ని, హిందీ లో "జీనే కీ రాహ్" అనే పేరుతో శ్రీ 
L V ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం 1969 లో విడుదల. మళ్ళీ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మాత శ్రీ అనుమోలు వెంకట సుబ్బా రావు గారు 1971 లో 
"భార్యా  బిడ్డలు" (అక్కినేని, జయలలిత) పేరుతో తీసారు.  ఈ చిత్రానికి  శ్రీ 
K V మహదేవన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలోని అన్ని పాటలు సూపర్ హిట్స్.  ఘంటసాల మాస్టారు పాడిన "అందమైన తీగకు పందిరుంటే చాలును,  పైకి పైకి పాకుతుంది చినదానా, పరవశించి సాగుతుంది  చినదానా" ఒక చక్కటి పాట.  ఆ పాట విందాము.



Saturday, November 2, 2013

" వగలాడి వయ్యారం భలే జోరు, నీ వయ్యారం ఒలికించు ఒన్స్ మోరు"


             ఈ బ్లాగ్ వీక్షిస్తున్న అందరికి "దీపావళి  
                             శుభాకాంక్షలు"      
జగపతి పిక్చర్స్ నిర్మించిన మొదటి చిత్రం ' అన్నపూర్ణ'. ఈ చిత్రం 1960 లో విడుదల. శ్రీ V. మధుసూదన్ రావు దర్సకత్వం వహించగా, సంగీతం శ్రీ సుసర్ల దక్షిణామూర్తి సమకూర్చారు. అన్ని పాటలు శ్రీ ఆరుద్ర వ్రాసారు. ఈ చిత్రంలో ఘంటసాల-జిక్కి పాడిన యుగళ గీతం " వగలాడి వయ్యారం భలే జోరు,  నీ వయ్యారం ఒలికించు ఒన్స్ మోరు" రేలంగి, గిరిజ మీద చిత్రీకరించిన ఈ పాట, ఆ రోజుల్లో ఒక ఊపు ఊపిన మాట వాస్తవం. ఘంటసాల మాస్టారు ఎంతో హుషారుగా పాడి, పాటకు ప్రాణం పోసారు. ఘంటసాల గారు ఈ చిత్రంలో పాడింది ఈ ఒక్క పాటే అయినా, ఈ పాటే చిత్రానికి హై లైట్ గా నిలిచింది. ఆ పాట విందాము. 



Thursday, October 31, 2013

"జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారం ఇంతేనయా"

ఘంటసాల మాటలలో   దేవదాస్ చిత్రంలోని "జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారం ఇంతేనయా" పాట యొక్క వివరణ వినండి. 
ఒక సందర్భంలో, మాస్టారు  చెప్పారు  ఆ పాట లో వచ్చిన దగ్గు కూడా తనదే అని.  ఇప్పుడు వినిపించ బోయే 

  పాట చిత్రంలోనిది కాకుండా,  ఇతర  దేశాలలో పాడి నప్పుడు రికార్డు చేయ బడినది. ఈ వీడియో క్లిప్పింగ్ అందించిన వారు శ్రీ అప్పారావు వింజమూరి కి కృతజ్ఞతలు. 
 గీత రచన శ్రీ సముద్రాల సీనియర్. సంగీతం శ్రీ సీ ఆర్ సుబ్బరామన్.


Saturday, October 26, 2013

"మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ .. అదే స్వర్గము"

శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారి వర్ధంతి నేడు . (26 అక్టోబర్).
 శ్రీ రాజేశ్వర రావు గారు నిరాడంబరుడు, ఆత్మగౌవరం 
 కోసం ఎన్నో  సినిమాలు వదులుకొన్న మహా మనిషి.
శ్రీ రాజేశ్వర రావు గారికి ఘంటసాల అంటే మిక్కిలి ఇష్టం.
నటునిగా, నేపథ్య గాయకునిగా, సంగీత దర్సకుడుగా, శ్రీ సాలూరు వారు బహుముఖ ప్రజ్ఞాశాలి.  ఆయన దాదాపు 150 చిత్రాలకు సంగీత దర్సకత్వం వహించారు.
రాజేశ్వరరావుకి మెదడు నిండా సంగీతమే అని ఒక సందర్భంలో రావు బాలసరస్వతి గారు చెప్పారు.
డాక్టర్ చక్రవర్తి చిత్రానికి సాలూరు వారు అందించిన స్వరాలూ అమోఘం. ముఖ్యంగా, ఘంటసాల గారు పాడిన
"మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ .. అదే స్వర్గము" మనసును కదిలించే పాట. శ్రీ శ్రీ గారు వ్రాసిన ఈ పాటకు, సాలూరు వారు అందించిన బాణీ, ఘంటసాల గారి గళం లో అజరామరమై నిలిచిపాయింది.  

శ్రీ సాలూరు గారికి నివాళులు అందిస్తూ, ఈ పాట విందాము.




Friday, October 25, 2013

" చల్ల గాలిలో ..ఓ ...... .యమునా తటిపై శ్యామసుందరుని మురళి"






 ఈ పాట ఘంటసాల గారు పాడిన పాట కాదు. గమనించ గలరు. శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారి జయంతి (12 అక్టోబర్ ), వర్ధంతి ( 26 అక్టోబర్) పురస్కరించుకొని, ఆయన్ను స్మరిస్తూ, ఆయన పాడి, స్వర పరచిన గీతం " చల్ల గాలిలో ..ఓ ...... .యమునా తటిపై శ్యామసుందరుని మురళి" పాట విందాము.
శ్రీ సాలూరు గారికి ఎంతో ఇష్టమైన రాగాలు: యమునాకళ్యాణి. మోహన, భీంప్లాస్, శుద్ధసావేరి, మాల్కోస్, హిందుస్తానీ భైరవి.
ఈయన దాదాపు 150 చిత్రాలకు సంగీత దర్సకత్వం వహించారు. 
సాలూరు గారికి  అభిమాన సంగీత దర్శకులు : శ్రీ నౌషద్ అలీ ( హిందీలో), తెలుగు లో పెండ్యాల, తమిళంలో M S విశ్వనాథన్. 
అభిమాన గాయకులు: ఘంటసాల, సైగల్, పంకజ్ మల్లిక్ , సుశీల

అపస్వరం తెలియని రాజేశ్వర రావు గారు, సుమధుర సుస్వరాలతో తెలుగు సినిమా పాటకు పట్టాభిషేకం చేసారు . ఆయన పాటలు నిత్య నూతనంగా నేటికీ సజీవమై అలరారుతోంది. 

ఇప్పుడు విందాము ఆయన  పాడిన  పాట:










Thursday, October 24, 2013

"మధురమైన రేయిలో మరపు రాని హాయిలో, పండు వెన్నెలే నేడు పాడే నేలనో"


సాధనా ఫిలిమ్స్ నిర్మించిన చిత్రం "తోబుట్టువులు". 1963 లో విడుదలైన ఈ చిత్రానికి నిర్మాత-దర్శకుడు శ్రీ సి వీ రంగనాథ్ దాస్, సంగీతం సి మోహన్ దాస్. చిత్రం విజయం సాధించక  పోయీనా, చిత్రంలోని పాటలు చాలా  బాగున్నాయి. కారణం ఘంటసాల.   చిత్ర కథానాయకుడు ఎవరైనా, ఏ సంగీత దర్సకుడైనా, పాటకు వంద శాతం న్యాయం చేకూరుస్తారు మాస్టారు. శ్రీ అనిసెట్టి వ్రాసిన, ఘంటసాల, సుశీల గారలు పాడిన "మధురమైన రేయిలో మరపు రాని హాయిలో, పండు వెన్నెలే నేడు పాడే నేలనో" 
మంచి మెలోడీ పాట. ఘంటసాల సుశీల గారలు ఎంతో మధురంగా పాడారు. ఈ పాటను, జగ్గయ్య జమున ల మీద చిత్రీకరించారు. పాట విని ఆనందించండి. నిన్న ఈ చిత్రంలోని పాట సాగెను జీవిత నావా పోస్ట్ చేశాను. ఈ రెండు పాటలు ఈ చిత్రానికి వన్నె తెచ్చాయి. 


Wednesday, October 23, 2013

" సాగేను జీవిత నావా, తెర చాప లేక ఈ త్రోవా, దరిజేర్చు దైవము నీవే నా ఆశ తీర్చ రావే"

సాధనా ఫిలిమ్స్ నిర్మించిన చిత్రం "తోబుట్టువులు". 1963 లో విడుదలైన ఈ చిత్రానికి నిర్మాత-దర్శకుడు శ్రీ సి వీ రంగనాథ్ దాస్, సంగీతం సి మోహన్ దాస్. చిత్రం విజయం సాధించక  పోయీనా, చిత్రంలోని పాటలు చాలా  బాగున్నాయి. కారణం ఘంటసాల.   చిత్ర కథానాయకుడు ఎవరైనా, ఏ సంగీత దర్సకుడైనా, పాటకు వంద శాతం న్యాయం చేకూరుస్తారు మాస్టారు. శ్రీ అనిసెట్టి వ్రాసిన, ఘంటసాల, సుశీల గారలు పాడిన
" సాగేను జీవిత నావా, తెర చాప లేక ఈ త్రోవా,  దరిజేర్చు దైవము నీవే 
   నా ఆశ తీర్చ రావే"......................
 మంచి మెలోడీ పాట. ఘంటసాల సుశీల గారలు ఎంతో మధురంగా పాడారు. ఈ పాటను మహానటి సావిత్రి, కాంతారావు ల మీద చిత్రీకరించారు. పాట విని ఆనందించండి.






Thursday, October 17, 2013

" ఓ నెల రాజా, వెన్నెల రాజా, నీ వన్నెలన్ని చిన్నెలన్ని మా కే లోయీ"


"భట్టి విక్రమార్క" చిత్రం 1960 లో విడుదలై విజయం సాదించిన చిత్రం. నిర్మాత శ్రీ P V V సత్యనారాయణ మూర్తి,  దర్సకత్వం శ్రీ జంపన చంద్రశేఖర రావు. సంగీతం శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు.  ఈ చిత్రం లోని ఘంటసాల, సుశీలపాడిన " ఓ నెల రాజా, వెన్నెల రాజా, నీ వన్నెలన్ని చిన్నెలన్ని మా కే లోయీ" మంచి మెలోడీ పాట. ఈ నాటికీ అంతే ఆదరణ తో అలరారుతోంది. ఆ పాట విందాము. వీడియో యు ట్యూబ్ ద్వారా సేకరించడం జరిగింది. వారికి, ఆ వీడియో అందించిన తేజా వీడియో వారికీ నా కృతజ్ఞతలు. 




Monday, October 14, 2013

"జీవనమే పావనం"







శ్రీ  విట్టాలా చార్య  నిర్మించి దర్సకత్వం వహించిన చిత్రం "శ్రీ కనక దుర్గా పూజా మహిమ., ఈ చిత్రం 1960 లో వచ్చింది  రాజెన్ నాగేంద్ర సంగీతం. ఘంటసాల,  రాజ్యలక్ష్మి పాడిన "జీవనమే పావనం"  ఒక చక్కటి పాట . గీత రచన శ్రీ కృష్ణ మూర్తి.. 




Friday, September 27, 2013

" కన్నుల్లో నీ బొమ్మ చూడు, నా కన్నుల్లో నీ బొమ్మ చూడు"

 పక్షిరాజా  స్టూడియోస్ నిర్మించిన  చిత్రం "విమల"  1960 లో  విడుదల.
    శ్రీ నందమూరి తారక రామారావు, సావిత్రి, నటించగా,  దర్సకత్వం  శ్రీ రాములు నాయుడు వహించారు. సంగీతం శ్రీ సుబ్బయ్య నాయుడు. దర్శకులు, సంగీత దర్శకులు బహుశ అన్నతమ్ములు అయి ఉండాలి.   ఈ చిత్రం లో ఘంటసాల మాస్టారు, కోమల పాడిన  యుగళ గీతం " నా కన్నుల్లో నీ బొమ్మ చూడు" ఒక చక్కటి పాట.   ఆ పాట విందాము



Tuesday, September 24, 2013

" ఇంటికి దీపం ఇల్లాలే..... ఇల్లాలే .... కల కల లాడుతూ కిల కిల నవ్వుతు బ్రతుకే స్వర్గం అనిపించును ......"



అర్ధాంగి చిత్రాన్ని శ్రీ పీ పుల్లయ్య నిర్మించి దర్సకత్వం వహించారు. ఈ చిత్రం 1955 లో విడుదల. సంగీతం శ్రీ బీ. నరసింహ రావు మరియు మాస్టర్ వేణు. మాటలు, పాటలు శ్రీ ఆత్రేయ. ఘంటసాల మాస్టారు పాడిన " ఇంటికి దీపం ఇల్లాలే .. ఇల్లాలే .... కల కల లాడుతూ  కిల కిల నవ్వుతు బ్రతుకే స్వర్గం అనిపించును .......   చాలా ఉదాత్తమైన  పాట. బహుశ బ్యాక్ గ్రౌండ్ పాట అయి ఉండాలి. పాట విందాము..




Monday, September 23, 2013

" మమతలు లేని మనుజులలోన ఎవరికీ ఎవరు తండ్రి తనయుడు ఎవరో "



1962 లో విడుదలైన చిత్రం  "" గాలిమేడలు"". సంగీతం T G లింగప్ప సమకూర్చారు. పాటలన్నీ బాగున్నాయి. ప్రత్యేకించి , సముద్రాల గారు వ్రాసిన " మమతలు లేని మనుజులలోన ఎవరికి  ఎవరో తండ్రి తనయుడు ఎవరో " చాల చక్కటి పాట. మాస్టారు ఎంతో  ఆర్ద్రతతో  పాడారు. పాట వింటే మనసు కలత చెందక తప్పదు. పాట విందాము




Wednesday, September 18, 2013

" కాదు సుమ కల కాదు సుమ"


Keelu Gurram.jpg
ఘంటసాల మాస్టారు సంగీత దర్సకత్వం వహించిన తొలి చిత్రం 
"కీలు గుర్రం". ఈ చిత్రం 1949 లో విడుదలై గొప్ప విజయం సాదించిన చిత్రరాజం. రాజ అఫ్ మిర్జాపూర్ (మిర్జాపూర్ జమీందార్) నిర్మాత-దర్శకుడు. కథ-మాటలు-పాటలు శ్రీ తాపి ధర్మా రావు.  ఘంటసాల మాస్టారు తనకు వచ్చిన ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని , ఈ చిత్రం లోని అన్ని పాటలు సూపర్ హిట్ చేసారు.   రాబోయే కాలంలో తనో గొప్ప సంగీత దర్శకుడు అవుతానని సంకేతాలు పంపారు. మాస్టారు గారి గళం ఎంతో మధురంగా, లేతగా ఉండి శ్రోతల మనసు పులకరింప చేస్తుంది. మాట స్పష్టత, గళ మాధుర్యం మాస్టారి ప్రత్యేకత.   ఘంటసాల, సరళ రావు పాడిన " కాదు సుమ కల కాదు సుమ" చాల మెలోడీ  గా బాణీ కట్టిన పాట. విన్నంత సేపు, మనం కూడా గగనంలో విహరించినట్లు ఉంటుంది.
ఈ చిత్రంలో అక్కినేని కి మారు  తల్లి గా నటించిన అంజలి దేవి తరువాయి   చాలా చిత్రాలలో నాయికగా నటించింది.
64 సంవత్సరాలు క్రితం వచ్చిన ఈ పాట, ఇంకా శ్రోతల హృదయాలలో శాశ్వత ముద్ర వేసుకొన్నదంటే , ఆ  పాట మహత్యం ఎంతటిదో ఊహించుకో గలరు.
 ఆ పాట వినండి, ఆనందించండి.  







" చాలదా ఈ పూజ దేవి, ఈ భక్తుని నిరాదరణ చేయ నేయ"






జయంతి పిక్చర్స్ నిర్మించిన చిత్రం "శ్రీ కృష్ణార్జున యుద్ధం". దర్శక-నిర్మాత శ్రీ కే.వీ.రెడ్డి గారు. ఈ చిత్రం 9-1-1963 లో విడుదలై, ఇటు పండితులను, అటు  పామరులను అలరించింది. 50 సంవత్సరాలు క్రిత్రం వచ్చిన ఈ చిత్రరాజం, నేటికీ నిత్య నూతనంగా అలరారుతోంది. శ్రీ పెండ్యాల సంగీతంలో పాటలూ, పద్యాలూ,బహుళ ప్రజాదరణ పొందినవి. ఘంటసాల మాస్టారు ఎంతో వైవిధ్యంగా అటు రామారావుగారికి, ఇటు నాగేశ్వరరావు గారికి పాడి ప్రజలను మెప్పించారు. శ్రీ పింగళి గారి రచనలో అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్స్. ఘంటసాల  మాస్టారు పాడిన " చాలదా ఈ పూజ దేవి, ఈ భక్తుని నిరాదరణ చేయ నేయ" పాట విందాము. అర్జునుడు యతీన్ద్రుని వేషం లో ఉండి, సుభద్ర సపర్యలు చేస్తుంటే, విరహం నటిస్తూ పాడిన పాట. విన్నంత సేపు ఎంతో హాయిగా ఉంటుంది.


Sunday, September 15, 2013

" ముందరున్న చిన్న దాని అందమేమో చందమామ సిగ్గు చెంది సాగి పోయే





శ్రీ K విశ్వనాధ్ దర్సకత్వం వహించిన చిత్రం : "కాలం  మారింది". నిర్మాత వాసిరాజు ప్రకాశం, సంగీతం శ్రీ సాలూరు రాజేశ్వర రావు. 1972 లో విడుదైన ఈ చిత్రానికి, ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా, రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారం దక్కింది . ఈ చిత్రం లో దాశరథి  వ్రాసిన పాట " ముందరున్న చిన్న దాని అందమేమో  చందమామ సిగ్గు చెంది సాగి పోయే " చాల చక్కటి పాట.   ఘంటసాల మాస్టారు, సుశీల అంత అందంగానూ పాడారు. ఆ పాట విందాము.    


















Saturday, September 14, 2013

" వినవె ఓ ప్రియురాల వివరాలన్నీ ఈ వేళ"


 భరణి పిక్చర్స్ నిర్మించిన చిత్రం "గృహలక్ష్మి". 1967 విడుదల.  నిర్మాత-దర్శకుడు శ్రీ రామకృష్ణ. సంగీతం శ్రీ సాలూరు  రాజేశ్వర రావు. రచన శ్రీ నరసరాజు.  చిత్రం అనుకొంత విజయం సాదించ లేదు. పాటల పరంగా చూస్తే కొన్ని మంచి పాటలు ఉన్నాయి.  ఆ ఘనత శ్రీ రాజేశ్వర రావు మరియు ఘంటసాల మాస్టారు.  

ఘంటసాల గారు పాడిన " వినవె ఓ ప్రియురాల వివరాలన్నీ ఈ వేళ" ఒక చక్కటి హాస్య భరిత పాట. ఆ పాట విందాము.




Tuesday, September 10, 2013

"ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో " ఈ బండల మాటున ఏ గుండెలు దాగెనో "


విక్రం ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీ B. S. రంగా దర్శక నిర్మాత గా 1964 లో నిర్మించిన చిత్రం "అమరశిల్పి జక్కన".  చిత్రానికి  ఛాయాగ్రహణం కూడా శ్రీ రంగా గారే. సంగీతం శ్రీ సాలూరు రాజేశ్వర రావు. దాదాపు అన్ని పాటలూ బాగున్నాయి..  శ్రీ  నారాయణ రెడ్డి వ్రాసిన "   ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో " ఈ బండల మాటున ఏ గుండెలు దాగెనో "   చాలా ఉదాత్తమైన పాట . ఘంటసాల మాస్టారు గళం లో ఈ పాట మరింత అందంగా రూపు దిద్దుకొంది.  పాట విందాము. వీడియో క్లిప్పింగ్ యు ట్యూబ్ ద్వారా సేకరించడం జరిగింది.  వారికి, వాటిని అందించిన వారికీ  నా ధన్యవాదాలు . 






Sunday, September 8, 2013

"వాతాపి గణపతిం బజే"

 ఘంటసాల మాస్టారు బ్లాగ్ ను వీక్షిస్తున్న అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు.  ఘంటసాల మాస్టారు పాడిన "వాతాపి గణపతిం బజే" పాటను ఈ గణేశ చవితి రోజున విని తరిద్దాం... అందరికి శుభం అవుగాక.. 


Wednesday, September 4, 2013

"పోతే పోని పోరా"

  1. శివాజీ గనేషన్, సరోజా దేవి నటించిన తమిళ సూపర్ హిట్ చిత్రం " పాలుం పళముమ్" చిత్రాన్ని తెలుగులో "ప్రాయశ్చితం" పేరుతో అనువదించారు. ఇందులో ఘంటసాల మాస్టారు పాడిన "పోతే పోని పోరా" ఒక చక్కటి పాట గా చెప్పు కోవచ్చు. రచన అనిసెట్టి, సంగీతం విశ్వనాథన్ రామమూర్తి. తమిళంలో "పోనాల్ పోగటం పోడా" పాటను 
T M సౌందర్ రాజన్ పాడారు. కాని ఘంటసాల పాటకే నా వోటు.




Sunday, September 1, 2013

"తలనిండ పూదండ దాచిన రాణి, మొలక నవ్వుల తోడ మురిపించ బోకే"


ఘంటసాల మాస్టారు,సినీ గీతలే కాకుండా, ఎన్నో ప్రైవేటు గీతాలు కూడా ఆలపించారు. పుష్ప విలాపం, అమ్మా సరోజినీ దేవి, తలనిండ పూదండ, పోలీస్ వెంకటస్వామి ఇలా ఎన్నో ఉన్నాయి. ఏ పాట పాడినా, ఆయన గళం లోని మాధుర్యం చెరగి పోదు. అందుకే ఆయన పాడిన పాటలు నిత్య    నూతనంగా అలరారుతోంది. 

మాస్టారు పాడిన పై పాటలలో  "తలనిండ పూదండ దాచిన రాణి, మొలక నవ్వుల తోడ మురిపించ బోకే" ఒక చక్కటి పాట. గీత రచన శ్రీ దాశరథి.  ఘంటసాల ఎంత మధురంగా పాడారో,  ఆ పాటకు అంత ఆదరణ లభించింది.  ఘంటసాల గారు ఒరిజినల్ గా పాడిన పాటతో పాటు,  మహానటి సావిత్రీ హావ భావాలకు అనుగుణంగా జత చేసిన పాట కూడా చూడండి.  యు ట్యూబ్ ద్వారా ఈ వీడియో క్లిప్పింగ్ ను అనుసంధానం చేసిన శ్రీ హరీష్ (బ్యాంకు అఫ్ ఘంటసాల గారికి) నా కృతజ్ఞతలు/ ధన్యవాదాలు. ఈ ఆనందాన్ని నలుగురుతో పంచుకోవాలనేదే నా ఉద్దేశం. 
 

Sunday, August 25, 2013

" ఓ......... సుకుమారా....... నను........ జేర........ రావోయీ".......(చిత్రం "భార్యాభర్తలు").

ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మించిన చిత్రం "భార్యాభర్తలు".  అనుమోలు వెంకట సుబ్బారావు  నిర్మాత,  కి. ప్రత్యేగాత్మ దర్శకుడు.  సంగీతం శ్రీ  సాలూరు రాజేశ్వర రావు.  పాటలన్నీ బాగున్నాయి.  ముఖ్యంగా "జోరుగా హుషారుగా, ఏమని పాడేదనో ఈ వేళా, మధురం మధురం  ఈ సమయం, చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి, ఓ సుకుమార"  మొదలగునవి. 52 సంవత్సరాల క్రితం నాటి ఆ పాటలు,  నేటికి సజీవంగా ఉన్నాయంటే, అవి ఎంతలా శ్రోతల హృదయాలలో నిలిచి పోయాయో. ఆ పాటలు ఎంతో మధురమో అందఱికి తెలుసు.  ఘంటసాల మాస్టారు, సుశీల పాడిన " ఓ.... సుకుమారా... నను..... జేర...... రావోయీ".............. యుగళ  గీతం మంచి మెలోడి పాట.   ఇది డ్రీం సీక్వెన్స్ పాట. ఈ చిత్రం 1961 లో విడుదలైంది. 









  

Tuesday, August 20, 2013

" ఎవరి కోసం ...... ఎవరి కోసం..... ఈ ప్రేమమందిరం, ఈ శూన్యనందనం" ( 3 బాషలలో)


Prem Nagar.jpg

సురేష్ ప్రొడక్షన్స్ వారి ప్రతిష్టాత్మిక చిత్రం "ప్రేమనగర్".  ఈ చిత్రం 1971 లో విడుదలై గొప్ప విజయం సాదించిన చిత్రం.  చిత్ర దర్శకుడు శ్రీ K S ప్రకాష్ రావు, సంగీతం శ్రీ K V మహదేవన్. అన్నీ పాటలు మధురాతి మధురంగా ఉన్నాయ్. ఘంటసాల, సుశీల పాడిన  పాటలు, చిత్ర విజయానికి ఎంతో తోడ్పడ్డాయి అనడం అతిశయోక్తి కాదు. అక్కినేని (కళ్యాణ్), వాణిశ్రీ (లత)   నటన అమోఘం.                   
ఈ చిత్రంలో ఘంటసాల మాస్టారు పాడిన (రచన: శ్రీ ఆచార్య ఆత్రేయ)
" ఎవరి కోసం ......  ఎవరి కోసం..... ఈ ప్రేమమందిరం, ఈ శూన్యనందనం"
చాలా భావోద్వేవంగా సాగిన పాట.

Vasantha Maligai.jpg

ప్రేమనగర్ చిత్రాన్ని తమిళం లో "వసంత మాలిగై" పేరుతో   తీసారు. ఈ చిత్రాన్ని కూడా శ్రీ రామానాయుడు నిర్మించారు. దర్సకత్వం శ్రీ కే యస్ ప్రకాష్ రావు, సంగీతం శ్రీ కే వీ మహదేవన్, నాయిక వాణిశ్రీ(లత)  కథానాయకుడు   శివాజీ గణేషన్ (ఆనంద్).   ఘంటసాల మాస్టారు తెలుగులో  పాడిన  పాట " ఎవరికొసం ...  ఎవరికోసం .. పాటను  తమిళంలో    "యారుకాగ .... యారుకాగ"    అని  సౌందరరాజన్ పాడారు. రచన: కన్నదాసన్. 
 ఈ చిత్రం 1972 లో విడుదలై అఖండ విజయం సాదించింది.

Prem Nagar 1974 Film Poster.JPG

శ్రీ రామానాయుడు గారే ఈ చిత్రాన్ని హిందీ లో   కూడా "ప్రేమనగర్" పేరుతోనే కే యస్ ప్రకాష్ రావు దర్సకత్వం  లోనే   తీసారు.  సంగీతం శ్రీ యస్ డీ బర్మన్ సమకూర్చారు.  ఈ చిత్రం 1974 లో విడుదలై విజయం సాదించింది. నాయికా నాయకులు  గా హేమామాలిని (లత),  రాజేష్ ఖన్నా(కరణ్ సింగ్) నటించారు. పై సన్నివేశ పాటను  శ్రీ "కిశోరే కుమార్" పాడారు. ఆ పాట 
"జా .. జా .. జా ముజ్హే అబ్ నా యాద్ ఆ" ......  ఈ గీతాన్ని ఆనంద్ బక్షి వ్రాసారు.

హిందీ లో  ఇదే పేరుతో (ప్రేమ నగర్)   1940 లో ఒక చిత్రం విడుదలైంది. చిత్ర దర్శకుడు మోహన్ దయారాం భావనాని,  రామానంద్, బిమ్లా కుమారి, హుస్ను భాను నటించారు.    కాని, దానికి, దీనికి ఎలాంటి సంబంధం లేదు.

ఒకే చిత్రాన్ని, ఒక నిర్మాత (రామానాయుడు) ఒకే దర్శకునితో  (కే యస్ ప్రకాష్ రావు) 3 బాషలలో తీయడం చాలా అరుదైన విషయం. పైగా 3 బాషలలోను విజయం సాధించి, నిర్మాతకు ఎనలేని కీర్తిని, ధనాన్ని ఆర్జించింది. మూడు చిత్రాలలోనూ, నాయిక పేరు "లత", నాయకుని పేరు మాత్రం మార్చారు.  .

ఇక పాటల విషయానికి వస్తే, తెలుగు పాటే అత్త్యుత్తమం.  ఘంటసాల గళం నుండి జారు వారిన  ఈ పాట,  మిగిలిన బాష పాటలకన్నా ఎంతో  గొప్పగా ఉంది,  అని నిస్సంకోచంగా చెప్పవచ్చు.  మీరు కూడా ఆ 3 పాటలు విని, మీ నిర్ణయాన్ని తెలియచేయండి.

పాటలన్నీ యు ట్యూబ్ ద్వారా సేకరించడం జరిగిన్ది.  వారికి నా ధన్యవాదాలు.



 
  
 

Wednesday, August 14, 2013

"జన్మ మెత్తితిరా అనుభవించితిరా" (ఇదే పాట 3 బాషలలో )

రాజ్య లక్ష్మి ప్రొడక్షన్స్, శ్రీ V మధుసూదన్ రావు దర్సకత్వంలో నిర్మించిన చిత్రం "గుడిగంటలు"  1964 లో విడుదల.  ఘంటసాల మాస్టారు సంగీతం సమకూర్చారు. ఈచిత్రంలోని "జన్మ మెత్తితిరా అనుభవించితిరా"  ఒక విషాద పాట.  ఘంటసాల గారు చాలా ఆర్ద్రత తో పాడారు. శ్రీ N T రామారావు, జగ్గయ,కృష్ణకుమారి నటించారు    

గుడిగంటలు చిత్రానికి మూలం తమిళంలో వచ్చిన " ఆలయమణి", ఈ చిత్రం 1962 లో వచ్చింది. ఈ చిత్రంలో పై పాట సన్నివేశానికి, T M సౌందర్ రాజన్ పాడిన "సత్తి సత్తదడ"అనే పాట ఉంది. సంగీతం శ్రీ విశ్వనాథన్ రామమూర్తి. చిత్ర దర్శకుడు K శంకర్. శివాజీ గనేషన్, రాజేంద్రన్, సరోజా దేవి నటీ నటులు

ఇదే చిత్రాన్ని హిందీ లో "ఆద్మి" పేరుతో,  శ్రీ A  భీమ్ సింగ్ దర్సకత్వంలో తీసారు . ఇది 1968 లో వచ్చింది. ఈ చిత్రానికి సంగీతం శ్రీ నౌశాద్ సమకూర్చారు . పై సన్నివేశమ్ పాటను శ్రీ షకీల్ బదాయుని  వ్రాసారు. ఆ పాట " ఆజ్ పురాని రాహోం సే". చాల ప్రజాదరణ పొందిన పాట. దిలీప్ కుమార్,మనోజ్ కుమార్, వహీదా రెహమాన్ నటించారు. 

గుడిగంటలు, ఆలయమణి, ఆద్మి, ఒకే సినిమా 3 బాషలలో నిర్మించిన చిత్రమ్. దర్శకులు వేరు, సంగీత దర్శకులు వేరు, పాడిన  గాయకులు కూడా వేరు . 3 ప్రాంతాలకు చెందిన వారు వీరందరు.  ఒక్క తెలుగు లోనే, ఘంటసాల గారు సంగీత దర్సకత్వం తో పాటు,  పై పాటను పాడడం జరిగింది.  అది మన తెలుగు వాళ్ళ అదృష్టం.

పాటలన్నీ యు ట్యూబ్ ద్వారా సేకరించడం జరిగింది. వారికి మా కృతజ్ఞతలు


 

Tuesday, August 13, 2013

ఒకే పాట మూడు బాషల్లో: (చిత్రం జయసింహ)



N A T సంస్థ నిర్మించిన జయసింహ చిత్రం 1955 విడుదల. జానపద చిత్రాలలో మేటి చిత్రం. శ్రీ దాసరి యోగానంద్ దర్సకత్వమ్  వహించారు, సంగెతం శ్రీ T V రాజు. ఈ చిత్రాన్ని తమిళం, హిందీ బాషలలో అనువదించారు.

తెలుగు లో  రావు బాలసరస్వతి, ఘంటసాల పాడిన యుగళ గీతం 
"మదిలోనే మధుర భావం, పలికేను  మోహన రాగం"  చాలా చాలా మెలోడీ పాట. గీత రచన శ్రీ సముద్రాల. 

తమిళంలో వీరే " మలరోడుం మధుర మేవుం, మనం కానుం మోహన్ రాగం" అంటూ గానం చేసారు.  

అలాగే, హిందీ లో "మన్  బీనా మధుర్ భోలే,  మై రాగ్ ....  తు..  మేరా సరగమ్" (చిత్రం జయసింఘ్ --1959 లో విడుదల) గీత రచన: ప్రేమ్ ధవన్, సంగీతం: రమేష్ నాయుడు. గాయనీ గాయకులు: లతా మంగేష్కర్, మన్నాడే. 

ఈ మూడు బాషలలోను ఆ పాటను వినండి. పాటలు యు  ద్వారా సేకరణ. వారికి మా ధన్యవాదాలు. పాటలలోని మాధుర్యాన్ని ఆస్వాదించండి. 


 

Monday, August 12, 2013

"కన్నుల్లో మిసమిసలు కనిపించని, గుండెల్లో గుసగుసలు వినిపించని"


రేఖా & మురళి ఆర్ట్స్ బ్యానర్ పై నటుడు పద్మనాభం నిర్మించిన చిత్రం "దేవత". 1964 లో విడుదలై విజయం సాదించిన చిత్రం. కథా బలం తో పాటు., సంగీత పరంగా ఉత్తమ విలువలు కల్గిన చిత్రం. చిత్ర దర్శకుడు శ్రీ హేమాంభరధర రావు,  సంగీతం శ్రీ S P కోదండపాణి. అన్ని పాటలు చాలా చాలా బాగున్నాయి. శ్రీ వీటూరి వ్రాసిన గీతం "కన్నుల్లో మిసమిసలు కనిపించని, గుండెల్లో గుసగుసలు వినిపించని" ఒక చక్కటి యుగళ గీతం. ఘంటసాల మాస్టారు, సుశీల గారలు ఈ పాటను ఎంతో అద్భుతంగా పాడారు.  ఈ పాటలో ఘంటసాల గారు, పాట మధ్యలో పై స్వరంలో  "అణువైన వేళ .............అందాలు దాచకు"   అన్నచోట మరియు  "నా లోని ప్రేమా............మారాకు వేయని " అని అందుకోవడం, పాటకే వన్నె తెచ్చింది. ఆ పాట విందాము. పాట సహకారం T one, యు ట్యూబ్ ద్వార సేకరణ. వారికి మా కృతజ్ఞతలు.  ఈ పాటను నలుగురికి వినిపించడమే ఈ బ్లాగ్ ధేయం.


 

Saturday, August 10, 2013

" ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక" ( "ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక".)


 శ్రీమతి కోడూరి కౌసల్యా దేవి నవల " చక్రభ్రమణం" ఆధారంగా,  అన్నపూర్ణ సంస్థ, శ్రీ  ఆదుర్తి సుబ్బారావు దర్సకత్వంలో నిర్మించిన చిత్రం, 
 "డాక్టర్ చక్రవర్తి."  ఈ పేరు వినగానే మొదట గుర్తు కు  వచ్చేది  ఘంటసాల   మాస్టారు పాడిన పాట "మనసున మనసై బ్రతుకున బ్రతుకై"(   ఈ పాటను నా బ్లాగ్ లో 08-04-2012 లో ) పోస్ట్ చేశాను. చాల గొప్ప పాట, మాస్టారు కు నచ్చిన పాట గా చెప్పుతారు. 

చిత్ర ప్రారంభంలో ఘంటసాల,  సుశీల గారలు పాడిన పాట " ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక"   ఒక మంచి మెలోడీ పాట.  సాలూరు  రాజేశ్వర రావు సమకూర్చిన సంగీతం ఈ పాటకు మరింత అందాన్ని తెచ్చింది. చాల రోజుల తరువాయి కలుసుకొన్న ప్రేమికులు వాళ్ళ భావాలు ఎలా ఉంటాయో చక్కగా చెప్పిన పాట. చిత్రీకరణ కూడా బాగా ఉంది. పాటలో  చరణం "ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక". ఎంత అందంగా చెప్పారు కవి  శ్రీ ఆరుద్ర. ఆ పాట విందాము. వీడియో సహకారం తెలుగు ఒన్, యు ట్యూబ్ ద్వారా, వారికి నా ధన్యవాదాలు. 

ఆ రోజుల్లో, పాటలను మొదటి సారి చిత్రంలోనే వినే వాళ్ళం . ఆడియా కేసెట్లు, వగైరా లేని  రోజులు. కేవలం గ్రామఫోన్ రికార్డ్స్ లో విడుదల చేసినా, అందరికి అందుబాటులో ఉండేవి కావు.  విన్న పాటను  మళ్ళి  వినాలన్నా, సినిమా చూడవలసిందే.   ఈ రోజుల్లో చిత్రం విడుదల కు ముందే పాటలను విడుదల చేస్తున్నారు.  కాని పాత పాటలకు ఉన్న ఆదరణ నేటి పాటలకు లేవు.


 

Wednesday, August 7, 2013

"కోవెల ఎరుగని దేవుడు కలడని అనుకొంటినా నేను ఆ నాడు, కనుగొంటి కనుగొంటి ఈ నాడు",


D V S ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీ D V S రాజు నిర్మించిన చిత్రం 
"తిక్క శంకరయ్య",  11-10-1968  విడుదల. శ్రీ దాసరి యోగానంద్ దర్సకత్వం,  శ్రీ తోటకూర వెంకట రాజు (టీ వీ రాజు) సంగీతం.   
ఈ చిత్రంలో 7 పాటలు ఉండగా అందులో 6 పాటలు శ్రీ సి. నారాయణ రెడ్డి గారు వ్రాయగా ఒక పాటను శ్రీ కొసరాజు వ్రాసారు. దాదాపు అన్ని పాటలు బాగున్నాయి. 

ఘంటసాల మాస్టారు, సుశీల పాడిన "కోవెల ఎరుగని దేవుడు కలడని అనుకొంటినా నేను ఆ నాడు,  కనుగొంటి కనుగొంటి ఈ నాడు", చాల చక్కటి పాట.
















 

" నీలో నేనై, నాలో నీవై తీయని కలలే కందాము, ఎడ బాయని జంటగ ఉందాము"



ఘంటసాల మాస్టారు గారి సంగీత దర్సకత్వంలో ఇంకొక ఆణిముత్యం "ఆలీబాబా 40 దొంగలు". 1970 లో విడుదల.  శ్రీ B విఠలాచార్య నిర్మించి, దర్సకత్వం వహించిన చిత్రం. 

 1950 లో హిందీలో,  1956 లో తమిళంలో  విజయాలు సాదించిన చిత్రం. 
తమిళంలో  శ్రీ T R రామచంద్రన్,  మోడరన్ థియేటర్ బ్యానర్ పై  నిర్మించారు.  1956 లో విడుదలైన చిత్రాన్ని తెలుగు లో అనువదించారు. ఈ చిత్రంలో M G రామచంద్రన్, భానుమతి, P S వీరప్పన్, తంగవేలు నటించారు. 

తెలుగు లో నందమూరి తారక రామారావు, జయలలిత నటించారు. ఈ చిత్రం లో ఘంటసాల సుశీల  గారలు 
పాడిన " నీలో నేనై, నాలో నీవై,  తీయని కలలే కందాము, ఎడ బాయని జంటగ  ఉందాము"  ఒక చక్కటి పాట. ఆ పాట విందాము. వీడియో క్లిప్పింగ్ యు ట్యూబ్ సహకారంతో, వారికి ధన్యవాదాలు. 
 

 

Monday, August 5, 2013

" నీలోన నన్నే నిలిపేవు నేడు ఏ శిల్పి కల్పనవో, ఏ కవి భావనవో"


రాజ్యలక్ష్మి సంస్థ నిర్మించిన  "గుడిగంటలు" 1964 లో విడుదలై విజయం సాదించిన చిత్రం.  దర్శకుడు శ్రీ V మధుసూదన్ రావు, సంగీత సారత్యం శ్రీ ఘంటసాల మాస్టారు. దాదాపు అన్ని పాటలు ప్రజాదరణ పొందినవే. 
శ్రీ ఆత్రేయ వ్రాసిన " నీలోన నన్నే నిలిపేవు నేడు ఏ శిల్పి కల్పనవో, ఏ కవి భావనవో" మంచి  మెలోడీ పాట. ఎన్ని సార్లు విన్నా, మరీ మరీ వినాలనే కుతూహలం కలుగు తుంది. శ్రీ ఆత్రేయ గారు పాటలో నాయికను, ఎల్లోరా గుహలో శిల, నండూరి వారి ఎంకి, విశ్వనాథ వారి కిన్నెర, బాపిరాజు గారి శశికళ, కవి కాళిదాస్ శకుంతల తో  పోల్చడం, ఈ మాటలను ఘంటసాల గారి నోట వింటూ ఉంటె, చెప్పలేని హాయి. పాట ఎంత అందంగా వ్రాయబడిందో, మాస్టారు అంత అందంగాను పాడారు. 
  ఆ పాట విందాము. వీడియో సహకారం వోల్గా, యు ట్యూబ్ ద్వారా. వారికీ ధన్యవాదాలు  



 

Wednesday, July 31, 2013

"మధురం మధురం ఈ సమయం, ఇక జీవితమే ఆనందమయం"


Barya Bhartalu.png

ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారు, పెంపుడు కొడుకు, ఇల్లరికం తరువాయి నిర్మించిన చిత్రం "భార్యా భర్తలు". చక్కటి కథతో, వినసొంపైన  పాటలతో, ఇటు పండితులను, అటు పామరులను అలరించిన చిత్రం.  ఈ చిత్రం 31-03-1961 లో విడుదలై విజయం సాదించటం తో  పాటు ప్రభుత్వ ప్రసంశలు పొందిన చిత్రమ్. ( ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు పొందిన చిత్రం). 

 శ్రీ K. ప్రత్యగాత్మ దర్సకత్వం వహించగా, శ్రీ అనుమోలు వెంకట సుబ్బారావు నిర్మించిన ఈ చిత్రానికి శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారు సంగీతం  సమకూర్చారు. ఈ చిత్ర విజయానికి, సంగీతం కూడా తోడ్పడింది. ఘంటసాల మాస్టారు, సుశీల గారలు పాడిన పాటలు నేటికి శ్రోతలను అలరిస్తూనే ఉంది. 
ముఖ్యంగా, ఘంటసాల సుశీల పాడిన యుగళ గీతం "మధురం మధురం ఈ సమయం, ఇక జీవితమే ఆనందమయం" మంచి మెలోడీ పాట.  పాట వింటూ ఉంటె ఏదో లోకాలలో విహరించి నట్లు అనుభూతి కలగక మానదు.  పాట అప్పుడే అయిపోయిందా అనే సందేహం రాక మానదు. అంత గొప్ప పాట , అందుకే నేటికి సజీవంగా ఉంది. 

ఆ పాట విందాము/ వీడియో క్లిప్పింగ్ చూద్దాము. వీడియో యు ట్యూబ్ సహకారంతో పోస్ట్ చేయడం జరిగింది. వారికి ధన్యవదాలు. 


 

Tuesday, July 30, 2013

"ప్రేమించ నిదె పెళ్ళాడనని తెగ కోతలు కోశావులే"


అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మించిన చిత్రం " ఆత్మగౌరం" 1965  లో  విడుదలైంది.  శ్రీ విశ్వనాధ్ గారు తొలిసారి దర్సకత్వం వహించిన చిత్రం ఆత్మగౌరం. కథ:  యద్దనపూడి సులోచనా రాణి, గొల్లపూడి మారుతీ రావు. అన్నపూర్ణ సంస్థకు శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారు సంగీతం సమకూర్చడం "ఇద్దరు మిత్రులు" చిత్రంతోనే ప్రారంభం. ఈ చిత్రం లోని పాటలు ఎంత ప్రజాదరణ పొందిందో అందరికి తెలిసిన విషయమే.

ఆత్మగౌరం చిత్రం లోని పాటలు కూడా అంతే ప్రజాదరణ  పొందింది. ఈ చిత్రంలో దాదాపు 10 పాటలు ఉన్నాయి. అన్నీ మెలోడీ గీతలే.  ఘంటసాల మాస్టారు, సుశీల గారితో పాడిన  యుగళ గీతం  "ప్రేమించ నిదె పెళ్ళాడనని  తెగ కోతలు కోశావులే"  చాల చక్కటి పాట.  ఆ పాట వినండి. ఘంటసాల గారు ఎంతో చలాకీగా  పాడారు. శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారు చక్కటి బాణీ సమకూర్చి పాటకు మరింత అందం తెచ్చారు. వీడియో సహకారం యూ ట్యూబ్ మరియు వోల్గా. వారికి ధన్యవాదాలు.  



 

Monday, July 29, 2013

"పాటల దేవుడు ఘంటసాల"

విజయా పిక్చర్స్ నిర్మించిన పూర్తి హాస్య భరిత చిత్ర రాజం " గుండమ్మ కథ".  అగ్రశ్రేణి నటులు శ్రీ నందమూరి తారక రామా రావు. అక్కినేని నాగేశ్వర రావు,  S. V. రంగా రావు, సావిత్రి, జమున, రమణా రెడ్డి, రాజనాల, సూర్యకాంతం, ఛాయా దేవి, నటించిన ఈ చిత్రానికి దర్శకుడు శ్రీ కమలాకర కామేశ్వర రావు. ఇదంతా ఒక ఎత్తైతే, ఘంటసాల మాస్టారు సమకూర్చిన సంగీతం ఒక ఎత్తు. అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్స్. 
ఈ చిత్రంలో పాట లేకుండా, L. విజయలక్ష్మి చేసిన నృత్యానికి, మాస్టారు కేవలం వాయిద్యాలతో సమకూర్చిన సంగీతం అద్భుతంగా కుదిరింది. 
"పాటల దేవుడు ఘంటసాల" అనే శీర్షికతో, ఘంటసాల మాస్టారు వాయిద్యాలతో సమకూర్చిన సంగీతంతో,  ఫోటో ఆల్బం విడుదల చేసారు. ఈ ఆల్బం లో ఘంటసాల మాస్టారు, ఇతర గాయకులు, గాయని మణులు, సంగీత దర్శకులు, నటులు మొదలగు వారితో ఉన్న ఫోటోలు ఉన్నాయి. మాస్టారు అభిమానులు వీటిని చూసి ఆనందిస్తూ, ఆ సంగీతాన్ని వింటారని, విని ఆనందిస్తారని ఆశిస్తున్నాను. (యూ ట్యూబ్ వారికి కృతజ్ఞతలతో). నలుగురికి తెలియ చెప్పే ప్రయత్నమే కాని, కాపీ రైట్స్ ఉల్లంగన కాదని మనవి.


 

Sunday, July 28, 2013

" నా సరి నీ వని నీ గురి నే నని ఇప్పుడే తెలిసెనులే"

Telugu film poster C.I.D..JPG

విజయా సంస్థ నిర్మించిన చిత్రం CID. చిత్ర నిర్మాతలు శ్రీయుతులు నాగిరెడ్డి, చక్రపాణి, దర్శకుడు చాణక్య. సంగీతం ఘంటసాల మాస్టారు.  ఈ చిత్రంలో 8 పాటలు ఉన్నాయి. అన్ని మెలోడీ పాటలే. ఘంటసాల మాస్టారు విజయ సంస్థకు మంచి బాణీలు సమకూర్చి వారి చిత్రాలకు విజయం చేకూర్చారు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. 

పింగళి  నాగేంద్ర రావు గీత రచన చేసిన పాట " నా సరి నీ వని నీ గురి నే నని ఇప్పుడే తెలిసెనులే" ఘంటసాల, సుశీల పాడారు.  మంచి మెలోడీ పాట. ఆ పాట విందాము.video సహకారం యు ట్యూబ్.

 

Sunday, July 21, 2013

"కొండగాలి తిరిగింది గుండె ఊసు లాడింది గోదావరి వరద లాగ కోరిక చెల రేగింది"

శ్రీ కే.బి.తిలక్  నిర్మించి దర్సకత్వం వహించిన చిత్రం "ఉయ్యాలా జంపాల". ఈ చిత్రం 1965 లో విడుదలైంది. శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు గారు అద్భతమైన బాణీలు సమకూర్చి అన్ని పాటలు సూపర్ హిట్ చేసారు. ఈ చిత్రంలోని ఘంటసాల మాస్టారు, సుశీల  పాడిన "కొండగాలి తిరిగింది గుండె ఊసు లాడింది గోదావరి వరద లాగ కోరిక చెల రేగింది". 

 
 

' హనుమాన ప్రాణ, .. ప్రభు రఘురామ'. (కన్నడ చిత్రం)

ఘంటసాల మాస్టారు కన్నడ చిత్రాలలో కూడా చాలా పాటలు పాడారు. మాస్టారు గారి గొప్ప తనం ఏంటంటే , తనకు బాష రాక పోయీనా, పాటను తెలుగులో వ్రాసుకొని, ఇంట్లో పాడుకొనే వారట. బాష వచ్చిన వారితో, తన ఉచ్చారణలో లోపాలు ఉంటె సరిచేసుకొని, పాటను రికార్డు చెయ్య మనేవారని చెప్పుతారు. సంగీత దర్శకుడు, నిర్మాత, తన మీద అభిమానంతో పాడటానికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసే వారు. 

అలంటి ఒక పాటే "శ్రీ రామాంజనేయ యుద్ధ" చిత్రంలో ఘంటసాల గారు పాడిన ' హనుమాన  ప్రాణ, ..  ప్రభు రఘురామ'.  చాలా చక్కగా  భావయుక్తంగా పాడి రక్తి కట్టించారు.

చిత్ర విశేషాలు తెలియదు కాని, ఈ చిత్రంలో కన్నడ రాజ్ కుమార్, జయంతి, ఉదయ కుమార్ మొదలగు వారు నటించారు. సంగీత దర్శకుడు సత్యం (?)
ఆ పాట విందాము. వీడియో యు ట్యూబ్ సహకరనతో.  వారికి ధన్యవాదాలు.

 

Thursday, July 18, 2013

" వేయి వేణువులు మ్రోగే వేళ, హాయి వెల్లువై పొంగే వేళ "

చిత్రకల్పన సంస్థ నిర్మించిన చిత్రం 'బుద్ధిమంతుడు'.  ఈ చిత్రం 20-09-1969 లో, అక్కినేని జన్మ దిన కానుకగా విడుదలై విజయం సాదించింది. కథా మాటలు శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ, దర్సకత్వం శ్రీ బాపు. సంగీతం శ్రీ K V మహదేవన్. ఘంటసాల గారు పాడిన సోలో గీతాలు, సుశీల తో పాడిన యుగళ  గీతాలు ఎంతో బాగున్నాయి. 

భూమ్మీద సుఖ పడితే తప్పు లేదురా, టాటా వీడుకోలు, గుట్టమీద, వేయి వేణువులు మ్రోగే వేళ, బడిలో ఏముంది, మొదలగు అన్ని పాటలు బహుళ ప్రజాదరణ పొందినవే. ఘంటసాల మాస్టారు అన్ని పాటలకు జీవం పోసారు. అందుకే అలా నిలిచి పోయాయి. 

ఇప్పుడు ఘంటసాల మాస్టారు పాడిన " వేయి వేణువులు మ్రోగే వేళ, హాయి వెల్లువై పొంగే వేళ " పాట విందాము.  వీడియో క్లిప్పింగ్ యు ట్యూబ్ సౌజన్యంతో.

 

Friday, July 12, 2013

" మోహన రాగ మహా మూర్తి మంతమాయే ."

గౌతమి ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం " మహామంత్రి తిమ్మరుసు ". ఇది చారిత్రాత్మిక  చిత్రం, 1962 లో విడుదలై, ఆ సంవత్సరపు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రాష్ట్రపతి రజత పథకం పొందింది.   చిత్ర నిర్మాత  అట్లూరి పున్డరికాక్షయ్య, దర్శకుడు శ్రీ కమలాకర కామేశ్వర రావు.  కథా-మాటలు-పాటలు శ్రీ పింగళి నాగేంద్ర రావు.  సంగీతం శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు


 శ్రీ రామారావు, గుమ్మడి,దేవిక, యస్ వరలక్ష్మి నటీ నటులు.  పాటలన్నీ మధురంగా ఉండి, మనసుకు ఎంతో హాయిని కలిగిస్తాయి. 
ఘంటసాల సుశీల యుగళ గీతం 
" మోహన రాగ మహా మూర్తి మంతమాయే ." ఒక చక్కటి మెలోడీ పాట. ఘంటసాల మాస్టారు ఎంతో రస రమ్యంగా పాడారు.  పాటకు తగ్గట్టు చిత్రీకరణ ఎంతో హుందాగా ఉంది.  ఆ పాట విందాము. వీడియో క్లిప్పింగ్  యూ ట్యూబ్ సహకారంతో. 

 

Thursday, July 11, 2013

"సుందరి నీవంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికినా లేదు కదా"

మాయాబజార్  పేరు వినగానే మనసు నిండా ఒక తీయని  అనుభూతి. నేటి తరం కాకుండా , నాటి తరం వాళ్ళు ఈ చిత్రాన్ని ఎన్ని సారులు చూసి ఉంటారో చెప్పడం కష్టం.  ఈ మధ్యనే ఈ చిత్రాన్ని రంగుల్లో మార్చి విడుదల చేసారు. అప్పుడు, నేటి తరం కూడా చూసే ఉంటారు.  1957 లో విడుదల అయిన ఈ చిత్ర రాజం, ఇప్పటికి ప్రజల హృదయాలలో పదిలంగా ఉందంటే, అది ఎంత గొప్ప చిత్రమో తెలుస్తోంది. 

విజయా వారి బ్యానర్ లో తీసిన ఈ చిత్రానికి శ్రీ K V రెడ్డి దర్సకత్వం వహిం చారు. ఘంటసాల మాస్టారు సంగీతం సమకూర్చారు. అన్ని పాటలు ఆణిముత్యాలే. 

వందేళ్ళ భారతీయ సినీ చరిత్రలో అత్యద్భుత దృశ్య కావ్యంగా "మాయాబజార్" ఎన్నికయింది. జాతీయ వార్తా ఛానల్  సి యెన్ యెన్ మరియు ఐ బీ యెన్  ఇటీవల జరిపిన 'ఇండియన్ గ్రేటెస్ట్ ఫిలిం ఎవర్' ఓటింగ్లో, మన తెలుగు చిత్రం 'మాయాబజార్', దాదాపు 20,000 ఓట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇది తెలుగు వారందరూ గర్వించ తగ్గ విషయం. 

ఈ చిత్రానికి ఆయువుపట్టు సంగీతం. ఘంటసాల మాస్టారు అందించిన బాణీలు అమోఘం. మల్లి మల్లి వినాలనే పాటలు, ఎన్ని సార్లు విన్నా విసుగు పుట్టని ఆ పాటలు కల కాలం నిలిచి పోయేలా చేసారు.  ఇందులో రేలంగి గారికి మాస్టారు పాడిన పాట  "సుందరి నీవంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికినా లేదు కదా" హాశ్యం తో కూడిన మెలోడీ పాట.  గీత రచన పింగళి నాగేందర్ రావు. ఆ పాట విందాము. ఈ పాటలో సావిత్రి , రేలంగి ల నటన, హావ భావాలూ చూసి ఆనంద పడాల్సిందే. 

 

Wednesday, July 10, 2013

"కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు గుండెల్లో గుండె కలిపి చూడు"

దస్త్రం:TeluguFilm Jeevitha chakram.jpg
నవశక్తి ప్రొడక్షన్స్ చిత్రం "జీవిత చక్రం".  ఈ చిత్రం 1971 లో విదుదల. చిత్ర నిర్మాత శ్రీ P గంగాధర రావు, చిత్ర దర్శకుడు శ్రీ C S రావు. సంగీత దర్శకుడు శంకర్ - జైకిషన్.    హిందీ చిత్ర రంగం లో   ఎన్నో చిత్రాలకు ఉత్తమ సంగీతం అందించిన సంగీత దర్శకుల జోడి శంకర్-జైకిషన్. తెలుగు లో మొదటి సారి సంగీతం అందించి అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ చేసారు. ఘంటసాల మాస్టారు, బొంబాయి శారద కలిసి పాడిన పాటలు వెరైటీ గా ఉండి, శ్రోతలను అలరించాయి. ఈ చిత్రం లోని ఆరుద్ర గారి కలం నుండి జాలు వ్రాలిన పాట "కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు గుండెల్లో గుండె కలిపి  చూడు" ఒక చక్కటి పాట. ఆ పాట విందాం. 




Monday, July 8, 2013

" ఆశలే అలలాగా ఊగేనే సరదాగా".

ఘంటసాల మాస్టారు స్వీయ  సంగీత దర్సకత్వం వహించన  చిత్రం "శబాష్  రాముడు". ఈ చిత్రాన్ని రాజశ్రీ పిక్చర్స్ నిర్మించి 1959 లో విడుదల చేసారు.   శ్రీ రామారావు, దేవిక,  రమణమూర్తి, రేలంగి,  గిరిజ నటించారు. దర్శకుడు శ్రీ సీ యస్ రావు. ఈ చిత్రంలో  మాస్టారు రేలంగి కి ఒక పాట పాడారు.  ఈ పాటను శ్రీ శ్రీ వ్రాసారు. " ఆశలే అలలాగా ఊగేనే సరదాగా".  చాలా తక్కువగా వినిపించే పాట. బహుశ  ఘంటసాల అభిమానులు కూడా విని ఉండరు.(?)

 

Wednesday, July 3, 2013

"అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం" P లీల, ఘంటసాల



ఘంటసాల మాస్టారు స్వర పరిచి పాడిన పాటలలో ముందు వరసలో నిలిచే పాట "అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం" 1953 లో విడుదలైన "బ్రతుకు తెరువు" చిత్రం లోని ఈ పాట అప్పటికి, ఇప్పటికి , ఎప్పటికి మరచి పోలేని మధుర మైన పాట గా చెప్పుకోవచ్చు.  ఇదే పాటను  P. లీల చే పాడించారు మాస్టారు. ఆమె కూడా అంతే అధ్భుతంగా పాడారు.  పాట రచన సముద్రాల జూనియర్.  ఇప్పుడు P లీల, ఘంటసాల పాడిన పాటను 
విందాము. 

 

Tuesday, July 2, 2013

" వెన్నెలా జ్యోతి యై వీసుదే కన్ గలే కాదలై పేసుదే"

ఘంటసాల మాస్టారు తమిళ్లో కొన్ని పాటలు పాడారు.  పాడిన పాటకు న్యాయం చేకూర్చాలి అనే తపన మాస్టారు గారిది. అది తెలుగు అయినా, తమిళం అయినా సరే. అలంటి పాటే మన్ మగన్ తేవై చిత్రంలోనిది. ఈ చిత్ర వివరాలు చూడండి. 
భరణి పిక్చర్స్ నిర్మించిన చిత్రం   "వరుడు కావాలి ".  ఇదే చిత్రాన్ని తమిళంలో " మన్ మగన్ తేవై " గా తీసారు. ఈ చిత్రం  1957 లో విడుదలైంది.  తెలుగు లో జగ్గయ్య, భానుమతి నటించగా, తమిళంలో శివాజీ గణేషన్ భానుమతి నటించారు. చిత్ర దర్శకుడు P రామకృష్ణ , సంగీత దర్శకుడు G రామనాథన్.  తమిళంలో ఘంటసాల మాస్టారు, భానుమతి , పిఠాపురం నాగేశ్వర రావు కలిసి పాడిన పాట " వెన్నెలా జ్యోతి యై  వీసుదే  కన్ గలే కాదలై పేసుదే" ఒక చక్కని మెలోడీ పాట. ఈ పాటను తెర మీద శివాజీ గణేషన్, భానుమతి, T R రామచంద్రన్ పై చిత్రీక రించారు. తమిళ పాట క్లిప్పింగ్ చూద్దాము  క్లిప్పింగ్ రాకపోతే యు ట్యూబ్ ద్వారా చూడండి. 


Sunday, June 30, 2013

" ఎంగుమే ఆనందం, ఆనందమే జీవనిన్ మకరంధం"

1953  లో వచ్చిన "బ్రతుకు తెరువు" చిత్రాన్ని తమిళంలో "భలే రామన్" పేరుతో అనువాదం చేసి విడుదల చేసారు. తమిళం లో కూడా విజయం సాధించింది.  అక్కినేని పియానో ఫై  పాడిన పాట అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం ఒక గొప్ప మెలోడీ పాట. ఘంటసాల మాస్టారు స్వర పరచి పాడారు.  ఘంటసాల గారికి ఎంతో ఇష్టమైన పాటగా చెప్పుకొంటారు.  మాస్టారు ఎక్కడ కచేరి చేసినా  ఈ పాటతో మొదలుపెట్టి,  దేవదాసు చిత్రంలోని జగమే మాయ తో ముగించేవారని చెప్పగా విన్నాను.  భలే రామన్ చిత్రంలో లోని పాట " ఎంగుమే ఆనందం, ఆనందమే జీవనిన్ మకరంధం" కూడా ఘంటసాల మాస్టారు అంతే అందంగా, స్వచ్చంగా పాడారు. మాస్టారు కు తమిళం రాక పోయినా, పాటలోని చరణాలను ఆయన గళం అద్భుతంగా పలికింది. అది ఘంటసాల గారి గొప్పతనం. ఆ పాట విందాము. 

Friday, June 28, 2013

"విన్న వించు కోన చిన్న కోరిక, ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక".

Bangaru Gajulu.JPG    ఘంటసాల గారి మీద ఉన్న అభిమానం తో నా ఈ బ్లాగ్ ను 2012 లో ప్రారంభించాను.  ఈ బ్లాగ్ ప్రారంభానికి సహాయ పడ్డ శ్రీ వులిమిరి సూర్యనారాయణ గారికి నా కృతజ్ఞతలు.   ఇది నా బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్న 100 వ పాట. నా బ్లాగ్ ను చూసి  ఆదరిస్తున్న దేశ  విదేశాల ఘంటసాల అభిమానులందరికీ నా ప్రత్యెక కృతజ్ఞతలు.
ఘంటసాల మాస్టారు లేరు అన్నది అబద్ధం. వారి పాటల ద్వారా మనలోనే ఉన్నారు . వారు చిరంజీవులు. ఆయన పాడిన  పాటలకు మరణం లేదు. అవి అజరామరం.

రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ నిర్మించిన చిత్రం "బంగారు గాజులు".  ఈ చిత్రం 1968 లో విడుదలై, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ "నంది" అవార్డు పొందింది. అక్కినేని, భారతి, విజయ నిర్మల నటించగా, శ్రీ సి యస్ రావు దర్సకత్వం వహించారు. సంగీతం శ్రీ తాతినేని చలపతి రావు. ఈ చిత్రం లో 7 పాటలు ఉన్నాయి. అందులో ఘంటసాల, సుశీల గారలు  పాడిన  మంచి మెలోడీ పాట "విన్న వించు కోన చిన్న కోరిక, ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక". విన్నంత సేపు ఎంతో హాయిగా ఉంటుంది. గీత రచన శ్రీ దాశరథి కృష్ణమాచార్య.  ఆ పాట వీడియో క్లిప్పింగ్ చూద్దాము.


Wednesday, June 26, 2013

"కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడి పోలేదోయి" .


 Devadasu 1953.JPG
ఘంటసాల మాస్టారు అనుభవించి పాడిన పాటలు ఎన్నో ఉన్నాయి. అందులో  చెప్పుకో తగ్గది "దేవదాసు"  చిత్రంలోని దాదాపు అన్ని పాటలు. చిత్ర విజయానికి ఆయన పాడిన పాటలు ఎంతో దోహదం చేశాయి అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.  ఆ పాటలన్నీ ఆణిముత్యాలే.  వినోదా బ్యానర్ లో శ్రీ డీ.యల్.నారాయణ నిర్మించిన చిత్రం " దేవదాసు"  విడుదలై నేటికి 60  సంవత్సరాలు నిండినవి. ఈ చిత్రం 23-06-1953 రోజున విడుదలైంది.  నేటికినీ, ఆ పాటలు ప్రజల మనోఫలకం ఫై నిలిచి ఉందంటే, ఆ శక్తి ఘంటసాల గారిదే. అక్కినేని, సావిత్రి ల అసమాన నటన, సీ.ఆర్. సుబ్బరామన్ అద్భుత సంగీతం, శ్రీ సముద్రాల మాటలు-పాటలు, శ్రీ వేదాంతం రాఘవయ్య దర్సకత్వ ప్రతిభ, శ్రీ బి.ఎస్. రంగ ఛాయాగ్రహణం,  అన్నిఅలా కలిసి వచ్చి చిత్ర విజయానికి పీటలు వేశాయి. ఈ చిత్రం లో ఘంటసాల మాస్టారు పాడిన "కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడి పోలేదోయి" ఒక మంచి సింబాలిక్ పాట.ఈ పాటకు అర్థం ఏమిటని అడిగితే, సముద్రాల గారు చెప్పారట-- దేవదాసు పార్వతిని ప్రేమించాడు, ఆమె దక్కలేదు, చంద్రముఖి దేవదాసు ను ప్రేమించింది కానీ దేవదాసు వద్దన్నాడు.  కుడి ఎడమైనా పరవాలేదు అంత మాత్రాన ఓడి పోలేదు. త్రాగుడుకు  బానిస అయ్యాడు.  మేడ  మీద అలపైడి  బొమ్మ (పార్వతి), నేలనే చిలక్కమ్మ (చంద్రముఖి),  చందమామ మసక వేసే ముందు, కబురేల, అవసరం లెదు. ప్రాణం మీద తీపి ఉన్న వానికి లంగరు అవసరం కాని, చావాలని అనుకొన్న వానికి లంగారు  అవసరం లేదు, లాహిరి నది సంద్రంలోన లంగరు తో పనిలేదోయి , మునకే సుఖ మను కోవోయి. ఎంత సింబాలిక్ గా వ్రాసారు సీనియర్ సముద్రాల గారు. అందుకే ఆ పాట అలా నిలిచిపోయింది. ఆ పాట విందాము.