Sunday, February 26, 2012

(శ్రీ శ్రీ గారి సందేశాత్మక పాట-2) కలకానిది, నిజమైనది

వెలుగు నీడలు చిత్రంలో శ్రీ శ్రీ గారు వ్రాసిన ఇంకొక సందేశాత్మక పాట " కల కానిది, నిజం అయినది." కలం, కత్తి కన్నా గొప్పది. కత్తి ప్రాణం తీస్తుంది, కలం ప్రాణం పోస్తుంది. ఒక మనిషి, తాను జీవితంలో ఓడి పోయానని, తలచి, ఆత్మహత్య చేసుకొందామని, విశాఖపట్నం బీచ్ లో ఉన్నాడట. ఆ బీచ్ లో ఒక ట్రాన్సిస్టర్ లోంచి, ఈ పాట వినుపిస్తోందట. "అగాధమౌ జలనిధి లోనా, ఆణిముత్యం ఉన్నట్లే, శోఖాన  మరుగున దాటి సుఖం ఉన్నదిలే, ఏది తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాదించాలి అధియే ధీరగుణం." ఈ పాట విన్నంతనే, అతను మనసు మార్చుకొన్నాడట". ఈ ఒక్క ఉదాహరణ చాలు, పాట మనిషికి ప్రాణం పోసింది అని చెప్పడానికి. శ్రీ శ్రీ గారి జీవితం ధన్యం అయినట్లే. ఘంటసాల గారు జీవం పోసి పాడిన పాట, శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు గారి సంగీతంలో మకుటంలా నిలిచిన పాట. మీరూ వినండి.

 

Friday, February 24, 2012

"పాడవోయి భారతీయుడా" (శ్రీ శ్రీ గారి సందేశాత్మక పాట)

అన్నపూర్ణ పిక్చర్స్ వారు నిర్మించిన నాలుగవ చిత్రం "వెలుగు నీడలు." 1961 లో విడుదలై, ప్రజాదరణ పొందిన చిత్రం. ఇందోలో రెండు, సందేశాత్మక పాటలు ఉండడం విశేషం, ఆ రెండు పాటలూ శ్రీ శ్రీ గారు వ్రాయడం మరో విశేషం. మొదటిది "పాడవోయి భారతీయుడా," రెండవది "కలకానిది, నిజమైనది."  శ్రీ శ్రీ గారు ఎంత ముందుచూపుతో "పాడవోయి భారతీయుడా" రాసారో తలచుకొంటే ఆశ్చర్యం కలుగుతుంది. అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు, ఆకాశం అందుకొనే ధరలు, నిరుద్యోగ సమస్య ఇవన్నీఇప్పటికీ అలానే ఉన్నాయి. 50 ఏళ్ళ తరువాత ఈ పరిస్థితులు ఉంటాయని ఆయన ఊహించడం, ఆ పాటలో రాయడం, ఆయన మేధా సంపత్తికి జోహార్లు. ఆ పాట వినండి. సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు గారు. ఘంటసాల, సుశీల మరియు కోరస్ పడిన పాట.

వెన్నెల-దివ్య ప్రేమ
















 భరణి పిక్చర్స్ "ప్రేమ" 1952 లో వచ్చిన చిత్రం. భానుమతి,  అక్కినేని నాగేశ్వర రావు,  నాయికా నాయకులుగా నటించారు. శ్రీ రామకృష్ణ దర్శకత్వం వహించగా, శ్రీ చింతామణి రామ సుబ్బరామన్ సంగీతం సమకూర్చారు. ఇందులోని పాటలన్నీ బాగున్నాయి. ముఖ్యంగా ఘంటసాల గారు పాడిన "రోజుకు రోజు మరింత మోజు," ఘంటసాల, భానుమతి పాడిన "దివ్య ప్రేమకు సాటి ఔనే, వెన్నెలే అయినా" మొదలైనవి చాల పొపులర్ అయిన హిట్ సాంగ్స్.
ప్రేమికులకు, యవతీ- యువకులకు, క్రొత్త దంపతులకు, వెన్నెలలో విహరించడం, ఆ వెన్నెల చల్ల దనాన్నిఆస్వాదించడం ఏంటో ఇష్టం. కానీ, దివ్య ప్రేమాకు సాటి రాదు వెన్నెల కూడా అని పాడుకొంటారు, ఈ చిత్రంలోని ప్రేమికులు.  ఆ పాట విందాం రండి. పాట రచన:శ్రీ కే.జి.శర్మ. సంగీతం: శ్రీ C R సుబ్బరామన్. ఈ పాటకు వీడియో క్లిప్పింగ్ దొరకనందున, జత పరచనందులకు, క్షంతవ్యుణ్ణి.
ఇక్కడ క్లిక్ చేయండి.