Friday, September 2, 2016

"పుష్పవిలాపం"



జంధ్యాల పాపయ్య శాస్త్రి విరసిత "పుష్పవిలాపం" ఘంటసాల గారి గాత్రం లో ప్రాణం పోసుకున్న ఒక అద్భుత గీతం  
వింటూ ఉంటె ఒళ్ళు జలదరిస్తుంది. అంతటి శక్తి ఆ పాటకు ఉంది అంటే అతిశయోక్తి కాదు.  ఆ పాట విందాం 






Tuesday, March 8, 2016

' లేచింది నిద్ర లేచింది మహిళా లోకం '----------ప్రపంచ మహిళా దినోత్సవం.

నేడు ప్రపంచ మహిళా దినోత్సవం. నేటి మహిళలు అన్ని రంగాలలో ముందుకు దూసుకు వెళ్తున్నారు. 
పురుషులతో సమాన మంటూ పోటీ పడుతున్నారు. విజయం  సాదిస్తున్నారు.  స్టార్ మహిళలుగా గుర్తింపు తెచ్చుకొన్నారు. 

స్త్రీ  రూపం అనేకం.  తల్లి గా,  చెల్లి గా, భార్యగ, వదినగా ఇలా ఎన్నో రూపాలు గా మనకు ఆగుపిస్తుంది. 
మగువను దేవత గా కొలిచిన సౌభాగ్యం కలుగును. ఆమె కంట కన్నీరు కార్చిన, ఆ ఇల్లు నాశనం ఆగును. 
స్త్రీ ని గౌరవిద్దాము. 

ఇంటికి దీపం ఇల్లాలు .. ఇంటికి  జీవన జ్యోతి. 
గుండమ్మ కథ  చిత్రం లో ఘంటసాల మాస్టారు పాడిన 
' లేచింది నిద్ర లేచింది మహిళా లోకం ' పాట  విందాం 
రచన పింగళి సంగీతం ఘంటసాల .  పాట లింక్ ఓపెన్ కాకపోతే యు ట్యూబ్ లో చూడండి



Friday, January 1, 2016

కాలం గడిచినా కాటు వేయని గీతాలు ,,ఘంటసాల పాటలు

ఘంటసాల అభిమానులందరికీ  నూతన సంవత్సర శుభాకాంక్షలు. 
కాలం  గడిచే కొద్ది,   ఘంటసాల అభిమానులు పెరుగుతున్నారు. 
నిర్విరామంగా ఆయన పాడిన పాటలు నిత్యం వినిపిస్తున్నాయి. 
ఆ పాటలు అన్నీ అజరామరం అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. 




                               కాలం గడిచినా  కాటు వేయని గీతాలు ,,ఘంటసాల పాటలు 
                                   కాల దోషం పట్టనివి ..అ పాత మధురాలు.  

2015 వెళ్ళింది ... 2016 వచ్చింది.  కొత్త సంవత్సరం కొత్త ఆశయాలు ...కొత్త అనుభూతులు.
నిన్న లేని అందం ఏదో ఈ వేళ నిదుర లేస్తే .......అదొక ఆనందం 
01-01-1964 లో విడుదలైన పూజాఫలం చిత్రం లోని ఈ పాట ఒక మధురం సాలూరు రాజేశ్వర రావు స్వర పరచిన ఈ పాట విందాం 

..