Saturday, March 31, 2012

"ఈ జీవన తరంగాలో, ఆ దేవుని చదరంగంలో"

సురేష్ మూవీస్ చిత్రం "జీవన తరంగాలు". యద్దనపూడి సులోచన రాణి నవలకు, రూపకల్పనే ఈ జీవన తరంగాలు. ఈ చిత్రం 1973 లో విడుదలై ప్రజాదరణ పొందింది. ఈ చిత్రానికి J.V. రాఘవులు సంగీతం సమకూర్చగా, శ్రీ తాతినేని రామారావు దర్శకత్వం వహించారు. ఇందులోని పాటలన్నీ బాగున్నాయి. అందులో ఘంటసాల మాస్టారు పాడిన టైటిల్ సాంగ్ 
"ఈ జీవనతరంగాలలో ఆ దేవుని చదరంగంలో. ఎవరికీ ఎవరు సొంతం. ఎంతవరకీ బంధం" అద్భుతం. మాస్టారు గళంలోని  ఆర్ద్రత, ఆవేశం రెండు కలగలసి పాటకు వన్నె తెచ్చింది. ఇది ఘంటసాల గారికి మరియు రాఘవులు గారికి చిర స్మరణీయ పాటగా నిలిచింది అని చెప్పడం అతిశయోక్తి కాదు. గీత రచన:ఆత్రేయ. జీవితాన్ని కాచి, వడబోచి ఆ జీవిత సత్యాన్ని తెలియపరచిన సుమధుర పాట. విన్న తరువాత, మీ కళ్ళల్లో నిలిచిన నీటి చుక్కల్ని తుడవడం మరిచిపోకండి. ఆ గొప్పతనం మాస్టారు కే దక్కుతుంది.

 

Tuesday, March 27, 2012

"కారులో షికారుకెళ్ళే"

అన్నపూర్ణ పిక్చర్స్ రెండవ చిత్రం "తోడికోడళ్ళు". ఈ చిత్రం 11-01-1957 లో విడుదలై బహుళ ప్రజాదరణ పొందింది. ఈ చిత్రానికి శ్రీ ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించగా, శ్రీ మాస్టర్ వేణు సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలోని పాటలు ఈనాటికి సజీవంగా ఉన్ నాయంటే, ఆ కీర్తి మాస్టర్ వేణు గారికే దక్కుతుంది. మాస్టర్ వేణు గారిది ఒక ప్రత్యెక శైలి. ఆయన పాటలను ట్యూన్ చేసేటప్పుడు, అందరిలా హార్మోనియం వాడకుండా, సందర్భానుబట్టి, పియానో, వేణువు లేక సితార్ మీద కంపోస్ చేస్తారని చెప్పుతారు. ఆత్రేయ విరచిత పాట  "కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడిదాన" ఎంత మధురంగా ట్యూన్ చేసారో,ఘంటసాల మాస్టారు అంత గొప్పగా పాడారు. నాటికీ, నేటికి ఎప్పటికి మరువలేని ఆణిముత్యం.  ఈ పాటను ఆత్రేయ గారు రాసారు అంటే ఇప్పటకి నమ్మని వారు ఉన్నారు. ఆ పాటను వీడియో క్లిప్పింగ్ ద్వారా చూడండి, పాటను ఆస్వాదించండి.

Monday, March 26, 2012

"నీలి మేఘాలలో గాలి కెరటాలలో"

 
                                                            
                                                                                                           బావామరదళ్ళు
 
పెండ్యాల నాగేశ్వర రావు సంగీత దర్సకత్వంలో ఘంటసాల మాస్టారు గారు "బావామరదళ్ళు"చిత్రంలో ఒక మంచి మెలోడి పాట పాడారు. ఈ వీడియో లో ఘంటసాల గారి వివిధ స్టిల్ల్స్ చూడండి. పాటను విని నీలి మేఘాలలో విహరించండి.