Follow by Email

Monday, September 24, 2012

"పయనమయే ప్రియతమా నను మరిచిపోకుమా"

అక్కినేని "ఖైస్" గా భానుమతి "లైలాగా" నటించిన చిత్రం "లైలా మజ్ను". భరణి పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం 1949 లో విడుదల. దర్సకత్వం శ్రీ రామకృష్ణ గారు, సంగీతం కీ.శే. సుబ్బరామన్. ఘంటసాల గారు పాడిన "పయనమయే ప్రియతమా నను మరిచిపోకుమా"         
 ఒక మంచి గుర్తుండి పోయిన పాట. రచన శ్రీ సముద్రాల ?
ఆ పాట విందాము.


Thursday, September 20, 2012

"మాణిక్య వీణా ముపలాల యంతి" (మహాకవి కాళిదాస్)

నేడు శ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారి జన్మ దినోత్సవం. ఆయన 89 వ పుట్టిన రోజు జరుపుకొంటున్నారు.
ANR ఈ మూడు అక్షరాలు తెలుగు కళామ తల్లికి దొరికిన ఆణిముత్యాలు. అందం, నటన, రాజసం కలబోసిన వ్యక్తిత్వం అక్కినేని సొంతం. ఆ నటునికి శుభాకాంక్షలు. అక్కినేని నటించిన "మహాకవి కాళిదాస్" లో ఘంటసాల గారి స్వరంలో "మాణిక్య వీణా ముపలాల యంతి" విందాము. ఘంటసాల గారు అద్భుతంగా గానం చేసారు. సంగీతం శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు. ఈ చిత్రం 1960 లో వచ్చింది. దర్సకత్వం శ్రీ కమలాకర కామేశ్వర రావు.Monday, September 17, 2012

" ఓ పోయే పోయే చినదాన నీ కమ్మని మనసు నాదేనా"

Uyyala Jampala

శ్రీ కే.బి.తిలక్  నిర్మించి దర్సకత్వం వహించిన చిత్రం "ఉయ్యాలా జంపాల". ఈ చిత్రం 1965 లో విడుదలైంది. శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు గారు అద్భతమైన బాణీలు సమకూర్చి అన్ని పాటలు సూపర్ హిట్ చేసారు. ఈ చిత్రంలోని ఘంటసాల మాస్టారు పాడిన " ఓ పోయే పోయే చినదాన నీ కమ్మని మనసు నాదేనా" మంచి మెలోడి పాట. గీత రచన ఆరుద్ర గారు. ఆ పాట విందాము.