Tuesday, February 14, 2012

ఆరాధన చిత్రానికి 50 సంవత్సరాలు




జగపతి పిక్చర్స్ వారి రెండవ చిత్రం "ఆరాధన." సావిత్రి, అక్కినేని నాయికా నాయకులుగా నటించిన ఈ చిత్రానికి,  దర్శకుడు విక్టరీ (వి). మధుసూదన్ రావు. సంగీతం శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారు. ఈ చిత్రానికి మూలం, సాగరిక అనే బెంగాలి చిత్రం. ఈ చిత్రం 16 -02 -1962 లో విడుదలై, రేపటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొంటోంది. నాకు అప్పుడు 16 సంవత్సరాలు.  నేను H .S .C చదువుతున్నాను. మార్చ్ నెలలో పబ్లిక్ పరీక్షలు. అయినా, ఈ చిత్రాన్ని, హైదరాబాద్ లో కమల్ టాకీస్ లో ఫస్ట్ డే మార్నింగ్ షో చూసాను. నాకు చాల నచ్చింది. పాటలు అద్భుతం. ఇక సావిత్రి గారు, అక్కినేని గారు పోటి పడి నటించారు. నాకు ఎంత నచ్చిందంటే, వరుసగా మొదటి మూడు రోజులు మార్నింగ్ షో చూసాను. ఇందులో ఘంటసాల మాస్టారు పాడిన " నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి " అనే పాట నాకే కాక ఎందరికో ఇష్ట మైన పాట. ఈ పాటను శ్రీ శ్రీ రాసారు. 
ఈ చిత్రంలోని కథా బలమే, చిత్ర విజయానికి దోహదం చేసిందని నిర్మాత రాజేంద్రప్రసాద్ గారు ఒక సందర్భంలో చెప్పారు. ఇప్పుడు ఘంటసాల గారి పాటను వినండి, ఆనందించండి.

 

2 comments:

  1. Thanks for your comments and wonderful song of Mastaru.

    ReplyDelete
  2. Thanks for your comments and wonderful song of Mastaru.

    ReplyDelete