Tuesday, February 21, 2012

నీ సుఖమే నే కోరుకున్నా







1964 లో విడుదలైన  చిత్రం పద్మశ్రీ పిక్చర్స్ వారి  "మురళీకృష్ణ." ఇందులో ఘంటసాల మాస్టారు మూడు పాటలు పాడారు. మాస్టర్ వేణు సంగీతం సమకూర్చారు. ఘంటసాల పాడిన మొదటి పాట  "కనులు కనులు కలిసెను,కన్నె మనసు తెలిసెను, ఉసురు లన్ని పైపైనే అసలు మనసు తెలిసెను." మురళి పాత్ర ధారిణి జమునను, కృష్ణ పాత్ర ధారి అక్కినేని ఉడికిస్తూ  పాడే  పాట. రెండవది, ఘంటసాల-సుశీల పాడిన పాట  "ఊ అను,ఊహు అను, ఔ నను ఔ నవ్ నను" నాయికా నాయకులు పాడుకొనే యుగళ గీతం.  మూడవది, ఘంటసాల పాడిన విషాద గీతం " ఎక్కడవున్నా ఏమైనా, ఎవరికీ వారు ఏమైనా, నీ సుఖమే నే కోరుకున్నా, నిను వీడి అందుకే వెళుతున్నా." ఘంటసాల గారు అద్భుతంగా పాడిన పాట. గీత రచన: మనసుకవి ఆత్రేయ. ఈ చిత్రానికి P. పుల్లయ్య గారు దర్శకుడు. ఆ పాటను, మాస్టారు ఎంత  మనసు పెట్టి పాడారో, ఆలకించండి.

2 comments:

  1. EE paata Maa College studies timelo, chaalamandi competetion song ga paadevaaru. IT is really a tough song . Sri Ghantasalagaru chaala aardhratagaa, aavedanagaa paaderu . EEpaata Videogaa chudadam kante, Audio gaa, vintene, enduko baaga untundanipistundi.Endukante, aa ganam vintunte, manasuekkadiko velutundi.
    Intha manchi paatani, present chesinanduku, chaala krutagnyatalu.!
    pvs rao, vskp

    ReplyDelete
  2. మీ రెస్పాన్స్ కు ధన్యవాదాలు. ఇది చాల కష్టమైనా పాట. ఘంటసాల గారు అద్భుతంగా పాడారు. నేను ఈ పాటకోసమే చిత్రాన్ని ఆ రోజుల్లో కనీసం 8 సార్లు చూసాను.

    ReplyDelete