Friday, December 5, 2014

"గాయకులలో ఘంటసాల ను నేనే"-- శ్రీ కృష్ణ ఉవాచ

డిసెంబర్ 4 ఘంటసాల గారి 92 వ  జయంతి.  అంతకు రెండు రోజుల ముందు, అనగా డిసెంబర్ 2, శ్రీ కృష్ణ జయంతి జరిగింది. 
ఘంటసాల మాస్టారు చివర దశలో "శ్రీ భగవథ్గీత " గానం చేసి, తన జన్మ సార్థకం చేసుకున్న మహా మనిషి. 

భగవథ్గీత లోని, 10 వ ఆధ్యాయంలో, శ్రీ గీతా  చార్యుడు చెప్పారు :

                           "మహార్షీ ణామ్ భ్రుగు రహం      
                             గిరామస్మేక్య మక్షరం 
                             యజ్ఞానాం జప యజ్ఞో స్మే 
                             స్థావరాణాం హిమాలయః " 
దీని అర్థం " నేను మహర్షులలో భ్రుగువును, శబ్దములలొ ఓంకారమును , యజ్ఞములలో జప యజ్ఞమును,
స్థావరములలో హిమవంతుడను". 

ఇంకా ఏమి  చెప్పారంటే , దేవర్షులలో నారదుడు, గంధర్వులలో చిత్రరథుడు, సిద్దులలో కపిల మునియు,
ఏనుగులలో ఐరావతము, దేనువులలో కామధేనువు, సర్పములలో వాసుకి  ఇలా చాలా చాలా, అన్నీ తనే అని  చెప్పారు ........  కాని
గాయకులలో ఎవరో చెప్పకుండా వదేలేసారు.?
మనం ఇప్పుడు  "గాయకులలో ఘంటసాల ను నేనే" అని  కృష్ణుని మాటగా సగర్వంగా చెప్పు కొందాము. మనం ఘంటసాల గారికి ఇచ్చే నిజమైన నివాళి ఇదే.  



2 comments:

  1. గాయకులలో ఘంటసాలను నేనే :)) బాగుంది. నిజానికి గీత అంటే ఘంటసాల గారే గుర్తుకు వస్తారు. ఆ విషయాన్ని నేను భగవద్గీతపై ఓ పోస్టులో ఉదహరించాను. 4 వతేదీన ఘంటసాల గారిపై ఎవరైనా వ్రాస్తారేమో అని చూశాను. ఏమీ కనపడలా(?). అందుకే ఆ రోజు పల్లెప్రపంచంలో నాకు నచ్చిన పాట మీరు వినిపిస్తారా? అనే పోస్టును రీ పబ్లిష్ చేశాను. పాట అంటే మరి ఘంటసాల తరవాతే కదా? ఎవరైనా గుర్తుకు వచ్చేది. పాడుతా తీయగా అన్నా... నా పాట నీనోట..... అన్నా ఆ గానగాంధర్వమే వేరు. 'భలేమంచి రోజు' మీరెందుకు మరచారండీ? ఒక్కరోజు ఆలస్యమైనా అదిరిపోయే కొటేషన్ ఇచ్చారు. అభినందనలు.

    ReplyDelete
  2. చాలా ధన్యవాదాలు శ్రీ కొండల రావు గారు,

    నిజానికి నేను 4 వ తేది రోజునే వ్రాసి ఉంచాను. కాని పోస్ట్ చేయడం ఆలస్యం అయ్యింది.
    ఎందుకంటే, ఆ రోజు ఉదయం 9.00 నుండి, ఆయన జయంతిని పురస్కరించుకొని, మల్కాజ్గిరి లో
    నిర్విరామ 12 ఘంటల కార్యక్రమము జరిగింది. అందులో ఉండిపోయాను. తిరిగి సాయంత్రం,గాన సభలో
    4.00 నుండి రాత్రి 9.30 వరకు ఇంకొక కార్యక్రమములో ఉండవలిసి వచ్చింది. నేను ఈ బ్లాగ్ లో వ్రాసిన మాటలు, గాన సభలో కూడా చెప్పాను. మరుసటి రోజు పోస్ట్ చేశాను.
    భగవత్గీత గానం చేసి అమరత్వం పొందిన మాస్టారు ...శ్రీ కృష్ణుని అంశమే.
    అందుకే శ్రీ కృష్ణ ఉవాచ గా ...."గాయకులలో ఘంటసాల ను నేనే" అని కొటేషన్ ఇచ్చాను.

    ReplyDelete