Monday, July 29, 2013

"పాటల దేవుడు ఘంటసాల"

విజయా పిక్చర్స్ నిర్మించిన పూర్తి హాస్య భరిత చిత్ర రాజం " గుండమ్మ కథ".  అగ్రశ్రేణి నటులు శ్రీ నందమూరి తారక రామా రావు. అక్కినేని నాగేశ్వర రావు,  S. V. రంగా రావు, సావిత్రి, జమున, రమణా రెడ్డి, రాజనాల, సూర్యకాంతం, ఛాయా దేవి, నటించిన ఈ చిత్రానికి దర్శకుడు శ్రీ కమలాకర కామేశ్వర రావు. ఇదంతా ఒక ఎత్తైతే, ఘంటసాల మాస్టారు సమకూర్చిన సంగీతం ఒక ఎత్తు. అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్స్. 
ఈ చిత్రంలో పాట లేకుండా, L. విజయలక్ష్మి చేసిన నృత్యానికి, మాస్టారు కేవలం వాయిద్యాలతో సమకూర్చిన సంగీతం అద్భుతంగా కుదిరింది. 
"పాటల దేవుడు ఘంటసాల" అనే శీర్షికతో, ఘంటసాల మాస్టారు వాయిద్యాలతో సమకూర్చిన సంగీతంతో,  ఫోటో ఆల్బం విడుదల చేసారు. ఈ ఆల్బం లో ఘంటసాల మాస్టారు, ఇతర గాయకులు, గాయని మణులు, సంగీత దర్శకులు, నటులు మొదలగు వారితో ఉన్న ఫోటోలు ఉన్నాయి. మాస్టారు అభిమానులు వీటిని చూసి ఆనందిస్తూ, ఆ సంగీతాన్ని వింటారని, విని ఆనందిస్తారని ఆశిస్తున్నాను. (యూ ట్యూబ్ వారికి కృతజ్ఞతలతో). నలుగురికి తెలియ చెప్పే ప్రయత్నమే కాని, కాపీ రైట్స్ ఉల్లంగన కాదని మనవి.


 

1 comment:

  1. ఘంటసాలవారి చాయాచిత్రచయనిక అమూల్యం!

    ReplyDelete