Thursday, July 11, 2013

"సుందరి నీవంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికినా లేదు కదా"

మాయాబజార్  పేరు వినగానే మనసు నిండా ఒక తీయని  అనుభూతి. నేటి తరం కాకుండా , నాటి తరం వాళ్ళు ఈ చిత్రాన్ని ఎన్ని సారులు చూసి ఉంటారో చెప్పడం కష్టం.  ఈ మధ్యనే ఈ చిత్రాన్ని రంగుల్లో మార్చి విడుదల చేసారు. అప్పుడు, నేటి తరం కూడా చూసే ఉంటారు.  1957 లో విడుదల అయిన ఈ చిత్ర రాజం, ఇప్పటికి ప్రజల హృదయాలలో పదిలంగా ఉందంటే, అది ఎంత గొప్ప చిత్రమో తెలుస్తోంది. 

విజయా వారి బ్యానర్ లో తీసిన ఈ చిత్రానికి శ్రీ K V రెడ్డి దర్సకత్వం వహిం చారు. ఘంటసాల మాస్టారు సంగీతం సమకూర్చారు. అన్ని పాటలు ఆణిముత్యాలే. 

వందేళ్ళ భారతీయ సినీ చరిత్రలో అత్యద్భుత దృశ్య కావ్యంగా "మాయాబజార్" ఎన్నికయింది. జాతీయ వార్తా ఛానల్  సి యెన్ యెన్ మరియు ఐ బీ యెన్  ఇటీవల జరిపిన 'ఇండియన్ గ్రేటెస్ట్ ఫిలిం ఎవర్' ఓటింగ్లో, మన తెలుగు చిత్రం 'మాయాబజార్', దాదాపు 20,000 ఓట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇది తెలుగు వారందరూ గర్వించ తగ్గ విషయం. 

ఈ చిత్రానికి ఆయువుపట్టు సంగీతం. ఘంటసాల మాస్టారు అందించిన బాణీలు అమోఘం. మల్లి మల్లి వినాలనే పాటలు, ఎన్ని సార్లు విన్నా విసుగు పుట్టని ఆ పాటలు కల కాలం నిలిచి పోయేలా చేసారు.  ఇందులో రేలంగి గారికి మాస్టారు పాడిన పాట  "సుందరి నీవంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికినా లేదు కదా" హాశ్యం తో కూడిన మెలోడీ పాట.  గీత రచన పింగళి నాగేందర్ రావు. ఆ పాట విందాము. ఈ పాటలో సావిత్రి , రేలంగి ల నటన, హావ భావాలూ చూసి ఆనంద పడాల్సిందే. 

 

5 comments:

  1. మీ బ్లాగుని "పూదండ" తో అనుసంధానించండి.

    www.poodanda.blogspot.com

    ReplyDelete
    Replies
    1. Sure sir. kindly furnish your email

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
  2. The idea of ending bit of the song marvelous. Thanks for posing the song.

    ReplyDelete
    Replies
    1. That's Ghantasala's magic. Thanks for your feedback

      Delete