Wednesday, June 27, 2012

"ఎవరికోసం ఈ మందహాసం ఒకపరి వివరించవే"


                                            

రాజ్యం పిక్చర్స్ నిర్మించిన చిత్రం "నర్తనశాల". గొప్ప పౌరాణిక చిత్రం. ఈ చిత్రం 11-10-1963 లో విడుదలై బహుళ ప్రజాదరణ పొందింది. శ్రీ నందమూరి తారక రామారావు, శ్రీ యస్.వి.రంగారావు, శోభన్ బాబు, సావిత్రి, యల్.విజయలక్ష్మి,గుమ్మడి, బాలయ్య, దండమూడి మొదలగు వారు నటించిన చిత్రం. దర్సకత్వం శ్రీ కమలాకర కామేశ్వర రావు, సంగీతం శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారు  సమకూర్చారు. కథ -మాటలు శ్రీ సముద్రాల రాఘవాచార్యులు. నిర్మాతలు శ్రీధర్ రావు, లక్ష్మిరాజ్యం దంపతులు.
ఇందులో ఘంటసాల,  సుశీల గారలు పాడిన "ఎవరికోసం ఈ మందహాసం ఒకపరి వివరించవే" మంచి మేలోడి పాట. శ్రీ శ్రీ రచన. మాస్టారు గారు ఎవ్వరికి పాడినా, ఆ పాటకు  నూరు శాతం న్యాయం జరుగుతుంది. ఆ పాట విందాము.


No comments:

Post a Comment