అన్నపూర్ణ ఆర్ట్స్ పిక్చర్స్ "విచిత్ర బంధం" 12-10-1972 లో విడుదల అయిన చిత్రరాజం. శ్రీ ఆదుర్తి సుబ్బారావు దర్సకత్వం వహించగా శ్రీ కే.వీ. మహదేవన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలోని పాటలు అన్ని సూపర్ డూపర్ హిట్స్. ఈ చిత్రానికి మూల కథ శ్రీమతి యద్దనపూడి సులోచన రాణి నవల "విజేత". ఘంటసాల, సుశీల పాడిన యుగళ గీతం "చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి" ఎంతో మధురంగా ఉంటుంది. ఈ పాట వింటూ ఉంటె, మనమే దీపావళి పండుగ జరుపు కొంటున్నామా అన్న బ్రాంతి కలుగుతుంది. అంతటి చక్కటి బాణీ కట్టారు మహదేవన్ గారు. ఆ పాట వినండి / దృశ్యాన్ని చూడండి.
Superb Song
ReplyDeleteThanks for the wonderful song picturised in colour.
DeleteApparao