విజయా పిక్చర్స్ వారి "చంద్రహారం" 1954 లో విడుదల అయ్యింది. శ్రీ కమలాకర కామేశ్వరరావు గారు దర్శకులు. ఘంటసాల మాస్టారు సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం ప్రజాదరణ పొందలేదు. శ్రీ నందమూరి తారక రామారావు శ్రీరంజని, సావిత్రి, రేలంగి, యస్.వి.రంగారావు మొదలగు వారు నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర దెబ్బ తిన్నది. అయితే, ఘంటసాల సమకూర్చిన బాణీలు ఎంతో మధురంగా ఉన్నాయి. ఈ చిత్రంలోని అన్ని పాటలు పింగళి నాగేంద్ర రావు గారు వ్రాసారు.
ఘంటసాల, A.P. కోమల పాడిన "ఎవరివో ఎచట ఉంటివో" చాల మంచి పాట. ఆ పాట వినండి. వీడియో యు ట్యూబ్ ద్వార సేకరించబడినది. శ్రీ సోముపద్మ గారికి కృతజ్ఞతలు.
No comments:
Post a Comment