Tuesday, May 22, 2012

దొరికేరు దొరగారు ఇక నిన్ను విడలేరు


 
 
పద్మశ్రీ పిక్చర్స్ వారి "ప్రేమించి చూడు" 24-06-1965 లో విడుదలయిన చిత్రం. దీనికి మూలం తమిళంలో తీసిన "కాదలిక్క నేరమిల్లై". జగ్గయ్య, కాంచన, అక్కినేని, రాజశ్రీ, రేలంగి, చలం, సరస్వతి మొదలగు వారు నటించారు.
శ్రీ పీ. పుల్లయ్య దర్సకత్వం వహించగా, నేటి ప్రఖ్యాత దర్శకుడు శ్రీ కే.రాఘవేంద్ర రావు, సహాయ దర్శకుడు గా పని చేసారు.  శ్రీ మాస్టర్ వేణు సంగీతం సమకూర్చారు. మాటలు: ముళ్ళపూడి వెంకటరమణ. ఈ చిత్రంలో, జగ్గయ్య గారికి  ఘంటసాల మాస్టారు పాడగా, అక్కినేనికి  పీ. బీ. శ్రీనివాస్ పాడడం ఒక విశేషం. ఘంటసాల, సుశీల పాడిన : "దొరికేరు దొరగారు ఇక నిన్ను విడలేరు" పాటను  జగ్గయ్య,  కాంచన ల మీద చిత్రీకరించారు. ఆ పాట వినండి / చూడండి. 


No comments:

Post a Comment