విజయా సంస్థ నిర్మించిన చిత్రం "అప్పు చేసి పప్పు కూడు". పూర్తి హాస్య ప్రధాన చిత్రం. రామారావు, జగ్గయ్య, రంగా రావు, రేలంగి, సావిత్రి, జమున, గిరిజ మొదలగు వారు నటించారు. ఈ చిత్రం 1958 లో విడుదల అయ్యింది. యల్ వి ప్రసాద్ దర్శకుడు. శ్రీ సాలూరు రాజేశ్వర రావు సంగీతం. మాటలు శ్రీ సదాశివబ్రహ్మం. పాటలు శ్రీ పింగళి నాగేంద్ర రావు. ఈ చిత్రంలో రేలంగి గారికి ఘంటసాల గారు, గిరిజ కు స్వర్ణలత కలిసి ఒక పాట పాడారు. "కాశి కి పోయాను రామ హరే గంగ తీర్థము తెచ్చాను రామ హరే". హాస్య ప్రధానంగా సాగే పాట. వినండి.
E paata eppatiki Everygreen Song Andi Dhanyavadamulu
ReplyDeleteఅక్షరాల నిజాం, ప్రిన్సు గారు. మీ స్పందనకు నా ధన్యవాదాలు.
Delete