Thursday, January 8, 2015

ఘంటసాల ముందు పలుకులు దేవదాస్ చిత్రం లోని జగమే మాయ పాటకు



వినోదా పిక్చర్స్ బ్యానర్ లో D L నారాయణ నిర్మించిన చిత్రం "దేవదాస్". ఈ చిత్రం ఎందరికో కీర్తి ప్రతిష్ఠలు  ఆపాదించిన సంగతి అందరికి తెలుసు. అక్కినేని, సావిత్రి, ఘంటసాల, సుబ్బరామన్, సముద్రాల సీనియర్, వేదాంతం  రాఘవయ్య ఇలా అందరూ చిత్రానికి వన్నె తెచ్చారు. 26-06-1953 విడుదలైన చిత్రం, 61 సంవత్సరాలు నిండినా, ప్రేక్షకుల మనోభావం లో స్థిర స్థాయిగా నిలిచి ఉన్న చిత్ర రాజం. అన్ని పాటలు బహుళ ప్రజాదరణ పొంది, నేటికీ అజరామరంగా నిలిచి ఉన్నాయి. ఏనాటికి ఇలాగె నిలిచి ఉంటాయి. 

ఘంటసాల గానం చేసిన "జగమే మాయ,  బ్రతుకే మాయ,  వేదాలలో సారం ఇంతే నయా", మనసును కదిలించే పాట . మాస్టారుకు ఎంతో ఇష్టమైన పాట గా చెప్పుకొంటారు... మొదటి వీడియో క్లిప్పింగ్ లో ఈ పాట వినండి. 
రచన సముద్రాల సీనియర్, 

ఘంటసాల గారు 1971 లో అమెరికా వెల్లినప్ప్దుదు ఎన్నో సంగీత కార్యక్రమాలు చేసారు. ఒకానొక ప్రోగ్రాం చికాగో లో చేసి నప్పుడు, ఘంటసాల గారు ఈ పాటను గురించి చెప్పి స్టేజి మీద పాడారు. రెండో వీడియో క్లిప్పింగ్ లో ఆ పాట (లైవ్ కన్సర్ట్) వినండి. (ఘంటసాల ముందు పలుకులు దేవదాస్ చిత్రం లోని జగమే మాయ పాటకు)

మొదటి వీడియో క్లిప్పింగ్ పాటకు, రెండో క్లిప్పింగ్ పాటకు వ్యత్యాసం గమనించండి. అమెరికా లో పాడిన 'జగమే మాయ పాట ను మాస్టారు ఎంతో Improvise చేసి పాడి ఒక కొత్త ప్రయోగం, ఆనాడే, అంటే 1971 లోనే చేసారు. 
ఘంటసాల అభిమానులు అందరూ ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను.  కాకపోతే, రెండో క్లిప్పింగ్లో లో పూర్తి పాట లేకపోవడం దురదృష్టం












5 comments:

  1. సూపర్ సార్. వాద్య సహకారం కూడా ఎక్కడా అతి అనిపించకుండా పాటకి మరింత శోభను చేర్చింది.

    ReplyDelete
    Replies
    1. అవునండి, చక్కగా చెప్పారు.
      వాయిద్య సహకారం అద్భుతం.
      ఘంటసాల గారు మాట్లాడి నప్పుడు ఆయన
      పలుకులు స్పష్టంగా వినిపించే స్థాయిలో
      వాయిద్యాల్ని వాడి రక్తి కట్టించారు.
      ఆయన పలుకులు అమోఘం
      ఆయన పాట అమోఘం
      వాయిద్య సహకారం అమోఘం
      దట్ ఈజ్ ఘంటసాల మాస్టారు

      Delete
  2. I too a die hard fan of Ghantasala Mastaru. Wonderful improvisation. Thanks for posting.

    ReplyDelete
  3. Thanks for your remarks. We are all sailing in the same Boat named "Ghantasala"

    ReplyDelete