Thursday, October 24, 2013

"మధురమైన రేయిలో మరపు రాని హాయిలో, పండు వెన్నెలే నేడు పాడే నేలనో"


సాధనా ఫిలిమ్స్ నిర్మించిన చిత్రం "తోబుట్టువులు". 1963 లో విడుదలైన ఈ చిత్రానికి నిర్మాత-దర్శకుడు శ్రీ సి వీ రంగనాథ్ దాస్, సంగీతం సి మోహన్ దాస్. చిత్రం విజయం సాధించక  పోయీనా, చిత్రంలోని పాటలు చాలా  బాగున్నాయి. కారణం ఘంటసాల.   చిత్ర కథానాయకుడు ఎవరైనా, ఏ సంగీత దర్సకుడైనా, పాటకు వంద శాతం న్యాయం చేకూరుస్తారు మాస్టారు. శ్రీ అనిసెట్టి వ్రాసిన, ఘంటసాల, సుశీల గారలు పాడిన "మధురమైన రేయిలో మరపు రాని హాయిలో, పండు వెన్నెలే నేడు పాడే నేలనో" 
మంచి మెలోడీ పాట. ఘంటసాల సుశీల గారలు ఎంతో మధురంగా పాడారు. ఈ పాటను, జగ్గయ్య జమున ల మీద చిత్రీకరించారు. పాట విని ఆనందించండి. నిన్న ఈ చిత్రంలోని పాట సాగెను జీవిత నావా పోస్ట్ చేశాను. ఈ రెండు పాటలు ఈ చిత్రానికి వన్నె తెచ్చాయి. 


1 comment:

  1. ఘంటశాల అభిమానులగా మీరు చేసిన కృషి ఫలితంగా వారి పాటలు ఈనాటికి వినగలుగుతున్నాము. మీరు ధన్యజీవులు. మీకు ధన్యవాదములు.

    ReplyDelete