అన్నపూర్ణ వారి డా.చక్రవర్తి 1964 లో విడుదలైన చిత్రం. ఈ చిత్రానికి మూల కథ శ్రీమతి కోడూరి కౌసల్య దేవి నవల "చక్రబ్రమణం". ఆదుర్తి సుబ్బారావు గారి దర్సకత్వంలో రూపు దిద్దికొన్న ఈ చిత్రం బహుళ ప్రజాదరణ పొందింది. అక్కినేని, సావిత్రి, జగ్గయ్య నటనా కౌశలం, సాలూరు రాజేశ్వర్ రావు సంగీతం, కథా గమనం ఈ చిత్రానికి వన్నె తెచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డ్స్ ప్రవేశ పెట్టిన సంవత్సరం 1964 .అదే సంవత్సరినికి
తొలి బంగారు నంది అవార్డు అందుకొన్న చిత్రం డా చర్క్రవర్తి . అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్స్. వీటిలో శ్రీ శ్రీ గారు వ్రాసిన "మనసున మనసై బ్రతుకున బ్రతుకై" అన్న పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. ఘంటసాల మాస్టారు అద్భుతంగా పాడిన పాట. మనసున్న ప్రతి మనిషి కోరుకొనే పాట, వినాలనే పాట. ఆ పాట వినండి.
నాకు చాల ఇష్టం ఈ పాట వెంకోబా రావు గారూ. పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు. మాస్టారి గొంతులో- శ్రీశ్రీ సాహిత్యం - వీనులవిందైన సాలూరు వారి సితారు తంత్రులు కలిగించే స్పందన అనిర్వచనీయమైన ఆనందానికి లోను చేస్తుంది హృదయాన్ని.
ReplyDeleteఅభ్యర్ధన :
ReplyDeleteనమస్తే!
' సేవ' సంస్థ ఆధ్వర్యంలో 'సకల' అంతర్జాల సకుటుంబం (వెబ్సైటు)ను ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. సాహిత్య రంగం, మహిళా రంగం, రాజకీయ రంగం, క్రీడా రంగం, ఆధ్యాత్మిక రంగం, సినిమారంగం, విద్య-ఉపాధి, ఆర్ధిక రంగం, కళారంగం, వైద్యం, హాస్యం, బాల్యం, వంటలు ఇత్యాది రంగాలకు సంబంధించి బ్లాగులు , వెబ్ పత్రికలు, వార్తాపత్రికలు ఉన్నాయా?..
అయితే.. ఇంకేం ఆలస్యం.. మీ మీ బ్లాగులు, వెబ్ పత్రికలు, వార్తాపత్రికల పేర్లు, URL లు, నిర్వాహకుల పేర్లు, ఇ -మెయిల్ అడ్రెస్, ఫోన్ నెంబర్లతో వెంటనే... sevalive.com@gmail.com మెయిల్ చేయండి. ఇట్టే అంతర్జాల సకుటుంబం లో అనుబంధం (లింక్) చేస్తాం.
మా ఈ ప్రయత్నానికి సహకరించాలని కోరుతున్నాం.
వ్యాఖ్యానంలో మా అభ్యర్ధనను విన్నపిస్తున్నందులకు అన్యదా భావించ వద్దని కోరుకొంటూ.. మా విజ్ఞప్తిని పదిమందికి తెలిసేలా సహకరించమని అభ్యర్ధిస్తూ...
సదా సేవలో,
-కంచర్ల సుబ్బానాయుడు,
సంపాదకులు, సేవ
http://sevalive.com/
Great effort sir.
Delete