Wednesday, April 11, 2012

"నన్ను వదిలి నీవు పోలేవులే"

బాబు మూవీస్ (శ్రీ సుందరం నిర్మాత) నిర్మించిన చిత్రం "మంచి మనసులు" విడుదలై నేటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొంది. ఈ చిత్రం 11-04-1962 లో విడుదలై 23 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది. ఒక చిత్ర విజయానికి  కావలిసిన హంగులు అన్నీఉన్న చిత్రం ఇది. మంచి కథ, మంచి సంగీతం, మంచి నటన అన్నీ కలిసి చిత్ర విజయానికి దోహదం చేసాయి. ఈ చిత్రం లోని పాటలన్నీ శ్రోతల ఆదరణ పొందినవే. నన్ను వదిలి నీవు పోలేవులే, ఏవండోయ్ శ్రీవారూ, ఎంత టక్కరి వాడూ, త్యాగం ఇదియేనా, ఓహో ఓహో పావురమా, శిలలపై శిల్పాలు, మావ మావ....మావా ఇలా ప్రతి పాట గుర్తుండి పోయినవే. శ్రీ మహదేవన్ సమకూర్చిన బాణీలు అద్భుతం. ఇప్పుడు ఘంటసాల, సుశీల గారలు పడిన పాట "నన్ను వదిలి నీవు పోలేవులే" వీడియో క్లిప్పింగ్ పొందుపరుస్తున్నాను. చూడండి.గీత రచన: దాశరథి.
 

2 comments:

  1. నిజమే సార్! మిమ్మలి వదిలిపోలేము. మరి అంత మంచిపాటలు పోస్టు చేస్తున్నారు కదా!

    ReplyDelete
    Replies
    1. ఎవరిని ఎవరూ వదలలేని బంధం. మరి ఈ బంధం ఏ నాటిదో.....
      వెంకోబ రావు

      Delete