దేవదాసు చిత్రం లోని "పల్లెకు పోదాం పారును చూదాం చలో చలో" పాట పోస్ట్ చేసినందులకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నా బ్లాగ్ చూసిన వారందరికి నా కృతజ్ఞతలు.
ఇప్పుడు ఆ చిత్రంలోని ఇంకొక పాట " కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడి పోలేదోయ్ " అనే పాట పోస్ట్ చేస్తున్నాను. ఘంటసాల మాస్టారు ఎంతో భావయుక్తంగా పాడిన పాట. అతి తక్కువ వాయిద్యాలు వాడి, పాటకు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు సంగీత దర్శకులు శ్రీ సుబ్బరామన్ గారు. అంత గొప్పగా పాడారు ఘంటసాల గారు. ఈ పాటకు అర్థం అడిగితే, సముద్రాల గారు చెప్పారట: పార్వతిని కోరుకున్నాడు దేవదాసు, ఆమె దక్కలేదు, తనను కోరుకున్న చంద్రముఖిని దేవదాసు వద్దన్నాడు. మేడమీద అలపైడి బొమ్మ (పార్వతి), నీడనే చిలకమ్మా (చంద్రముఖి), చందమామ మసక వేసి పోయేముందు, కబురు ఎందుకు, కుడి యెడ మైనంత మాత్రాన, పొరపాటు కాదు, జీవితంలో ఓడి పోనక్కరలేదు. ఎంత సింబాలిక్ గా వ్రాసారు సముద్రాల గారు. అందుకే నాటికి, నేటికి ఆణిముత్యంగా నిలిచి పోయింది ఈ పాట.
గొంతులో మాధుర్యం తారా స్థాయిలో వుండేదేమో, ఆ కాలానికి.
ReplyDelete