భరణి స్టూడియోస్ "చండీరాణి" 18 -08 -1953 లో విడుదలైన చిత్రం. నాయికా, నాయకులుగా భానుమతి N T రామారావు గారు నటించారు.
భానుమతి ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రానికి, ఆమె దర్సకత్వం వహించారు. భారత దేశ చరిత్రలో ఒక మహిళ దర్సకత్వం వహించిన మొదటి చిత్రం "చండీరాణి". సంగీతం శ్రీ C R సుబ్బరామన్, విశ్వనాథన్/రామమూర్తి సమకూర్చారు. ఘంటసాల, భానుమతి గారలు పాడిన ఒక అద్భుత యుగళ గీతం "ఓ తారకా ఓ... ఓ జాబిలీ". ఈ పాట వింటూ ఉంటె, మనసు అలా అలా ఆనందంతో తేలి పోతుంది. ఈ పాటలో ఘంటసాల మాస్టారు పాట ప్రారంభంలో మందస్వరంతో పలికిన "నవ్వులేల నను గని" వింటే చెప్పరాని అనుభూతి కలుగుతుంది. ఈ పాట విన్నతరువాత, మాస్టారుకు ఆ రోజుల్లో ఎంత మంది, అభిమానులు అయ్యారో చెప్పలేము. ఆ పాట వినండి. గీత రచన సముద్రాల సీనియర్.
ఈ పాట చాలా బాగుంది అండి... ఇక్కడ పాట విని నా బ్లాగ్ లో ఈ పాట పోస్ట్ చేశాను మంచి సాంగ్ వినిపించారు ధన్యవాదములు
ReplyDeleteThanks. Very glad to know that you liked this song and posted this in your blog. this shows your interest in this song. This is one of my favourite song os Ghantasala mastaru. kasirao
ReplyDelete