అన్నపూర్ణ వారి డా.చక్రవర్తి 1964 లో విడుదలైన చిత్రం. ఈ చిత్రానికి మూల కథ శ్రీమతి కోడూరి కౌసల్య దేవి నవల "చక్రబ్రమణం". ఆదుర్తి సుబ్బారావు గారి దర్సకత్వంలో రూపు దిద్దికొన్న ఈ చిత్రం బహుళ ప్రజాదరణ పొందింది. అక్కినేని, సావిత్రి, జగ్గయ్య నటనా కౌశలం, సాలూరు రాజేశ్వర్ రావు సంగీతం, కథా గమనం ఈ చిత్రానికి వన్నె తెచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డ్స్ ప్రవేశ పెట్టిన సంవత్సరం 1964 .అదే సంవత్సరినికి
తొలి బంగారు నంది అవార్డు అందుకొన్న చిత్రం డా చర్క్రవర్తి . అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్స్. వీటిలో శ్రీ శ్రీ గారు వ్రాసిన "మనసున మనసై బ్రతుకున బ్రతుకై" అన్న పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. ఘంటసాల మాస్టారు అద్భుతంగా పాడిన పాట. మనసున్న ప్రతి మనిషి కోరుకొనే పాట, వినాలనే పాట. ఆ పాట వినండి.