అన్నపూర్ణ పిక్చర్స్ వారు నిర్మించిన నాలుగవ చిత్రం "వెలుగు నీడలు." 1961 లో విడుదలై, ప్రజాదరణ పొందిన చిత్రం. ఇందోలో రెండు, సందేశాత్మక పాటలు ఉండడం విశేషం, ఆ రెండు పాటలూ శ్రీ శ్రీ గారు వ్రాయడం మరో విశేషం. మొదటిది "పాడవోయి భారతీయుడా," రెండవది "కలకానిది, నిజమైనది." శ్రీ శ్రీ గారు ఎంత ముందుచూపుతో "పాడవోయి భారతీయుడా" రాసారో తలచుకొంటే ఆశ్చర్యం కలుగుతుంది. అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు, ఆకాశం అందుకొనే ధరలు, నిరుద్యోగ సమస్య ఇవన్నీఇప్పటికీ అలానే ఉన్నాయి. 50 ఏళ్ళ తరువాత ఈ పరిస్థితులు ఉంటాయని ఆయన ఊహించడం, ఆ పాటలో రాయడం, ఆయన మేధా సంపత్తికి జోహార్లు. ఆ పాట వినండి. సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు గారు. ఘంటసాల, సుశీల మరియు కోరస్ పడిన పాట.
No comments:
Post a Comment