Saturday, February 11, 2012

ఘంటసాల వర్ధంతి 11-02-2012

ఘంటసాల గారి 38వ వర్ధంతి నేడు జరుపు కొంటున్నాము. ఒక సందర్భంలో, మాస్టారు గారి అమ్మాయి చెప్పారు,  "మా నాన్న గారికి వర్ధంతి ఏమిటి, ఆయన సజీవంగా అందరి మనసులో ఉన్నారు, ఆయన లేరు అన్న భావన లేనే లేదు." అని.  ఇది అక్షర లక్ష మాట. ఇది సత్యం, ఎందుకంటే  ఆయన చిరంజీవి.
బౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన పడిన పాటలు నిర్విరామంగా వినపడుతూనే ఉన్నాయి,వినపడుతూనే ఉంటాయి.అంతటి  మహర్దశ కలిగించారు ఘంటసాల గారు. అవి అజరామరం.

ఆయన పాడిన పాటలలో, నాకు చాల ఇష్టమైన పాట, మూగ మనసులు చిత్రం లోని "పాడుతా తీయగా".  ఆత్రేయ గారు వ్రాసినట్టు  "పోయినోళ్ళు అందరు మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు", అక్షర లక్షల మాట. ఘంటసాల గారు ఎంతో అనుభవించి పాడిన పాటగా చెప్పుకొంటారు. ఆ పాట మీరు మళ్లీ వినండి. ఎన్ని సార్లు విన్నా, తనివి తీరని పాట. మనసును కదిలించే  పాట. మనిషిని నిదుర పరిచే పాట. మామ మహదేవన్ అద్భుతంగా ట్యూన్ చేసిన పాట.

4 comments:

  1. కాలమెరుంగ దా మధురగానము,స్నానము ధ్యానమందు, భూ
    పాలము తెల్గువారికి, ప్రభాత మనోహరమైన వేళ దే
    వాలయ గోపురమ్ముల విహారము హారము ఘంటసాలయే
    తాళ లయాన్వితంబుగ సుధర్మ సభాస్థలి మ్రోగుచుండెనో!

    -గరికపాటి నరసింహారావు

    భవదీయుడు
    గోపాలం

    ReplyDelete
    Replies
    1. కాలమే తెలియని ఆ మధుర ఘంటసాల గానం, ఏ కాలమందు వినీనా,కాలం తెలియక గడచి పోవు, పలు కాలం నిలిచిపోవు, అనుభవించిన వారికి అనుభవనిన్చినంత ఆనందం, ఆ మధుర గానం.

      Delete
  2. Ghantasala garu chala anubhavinchi padina pata. thanks for posting Kasirao garu.

    ReplyDelete
    Replies
    1. Thanks for the compliments. Yes, true, what you said

      Delete