వెలుగు నీడలు చిత్రంలో శ్రీ శ్రీ గారు వ్రాసిన ఇంకొక సందేశాత్మక పాట " కల కానిది, నిజం అయినది." కలం, కత్తి కన్నా గొప్పది. కత్తి ప్రాణం తీస్తుంది, కలం ప్రాణం పోస్తుంది. ఒక మనిషి, తాను జీవితంలో ఓడి పోయానని, తలచి, ఆత్మహత్య చేసుకొందామని, విశాఖపట్నం బీచ్ లో ఉన్నాడట. ఆ బీచ్ లో ఒక ట్రాన్సిస్టర్ లోంచి, ఈ పాట వినుపిస్తోందట. "అగాధమౌ జలనిధి లోనా, ఆణిముత్యం ఉన్నట్లే, శోఖాన మరుగున దాటి సుఖం ఉన్నదిలే, ఏది తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాదించాలి అధియే ధీరగుణం." ఈ పాట విన్నంతనే, అతను మనసు మార్చుకొన్నాడట". ఈ ఒక్క ఉదాహరణ చాలు, పాట మనిషికి ప్రాణం పోసింది అని చెప్పడానికి. శ్రీ శ్రీ గారి జీవితం ధన్యం అయినట్లే. ఘంటసాల గారు జీవం పోసి పాడిన పాట, శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు గారి సంగీతంలో మకుటంలా నిలిచిన పాట. మీరూ వినండి.
No comments:
Post a Comment