Thursday, February 23, 2012

చిట్టి అమ్మలు చిన్ని నాన్నలు(ఆస్తిపరులు)



 

జయలలిత, అక్కినేని నాయికా నాయకులుగా నటించిన చిత్రం, జగపతి పిక్చర్స్ "ఆస్తిపరులు." ఆ రోజుల్లో  జగపతి పిక్చర్స్ కు ఒక ఒరవడి ఉండేది. వారి  చిత్రాలన్నీ "అ" లేక 'ఆ" అక్షరంతో  మొదలయ్యేది.   "అన్నపూర్ణ",  'ఆరాధన", "ఆత్మబలం", "అంతస్తులు",  "ఆస్తిపరులు", "అక్కచెల్లెళ్ళు". ఇంకో విశేషం ఏమిటంటే, కథా నాయికలు మారుతూ వచ్చారు. పైన చెప్పిన చిత్రాలలో వరుసగా "జమున", సావిత్రి , సరోజాదేవి ,కృష్ణకుమారి ,జయలలిత , జానకి నాయికలుగా నటించారు.  నిర్మాత వీరమాచనేని బాబు రాజేంద్రప్రసాద్ కు తన ఇంటి పేరే గల వీరమాచనేని మధుసూదన్ రావు గారు దర్సకుడుగా ఉండడం/దొరకడం అదృష్టం, వీరి చిత్రాలన్నీ విజయం సాదించింది.
"ఆస్తిపరులు" చిత్రంలో ఘంటసాల గారు  పాడిన "చిట్టి అమ్మలు చిన్ని నాన్నలు, మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు," చాల మంచి పాట. ఈ పాట కథాగమనానికి కూడా తోడ్పడే పాట, చిత్రంలో రెండు సార్లు ఉంది. మొదటిది పాపను నిద్రపరచేటప్పుడు, రెండవది విషాదంగా. గీత రచన: ఆత్రేయ. సంగీతం: మామ మహదేవన్.
   విడుదల:01-01-1966 . 
 


2 comments:

  1. పాట నచ్చినందుకు ధన్యవాదాలు. చాల అరుదుగా వినిపించే పాట

    ReplyDelete