Friday, September 27, 2013

" కన్నుల్లో నీ బొమ్మ చూడు, నా కన్నుల్లో నీ బొమ్మ చూడు"

 పక్షిరాజా  స్టూడియోస్ నిర్మించిన  చిత్రం "విమల"  1960 లో  విడుదల.
    శ్రీ నందమూరి తారక రామారావు, సావిత్రి, నటించగా,  దర్సకత్వం  శ్రీ రాములు నాయుడు వహించారు. సంగీతం శ్రీ సుబ్బయ్య నాయుడు. దర్శకులు, సంగీత దర్శకులు బహుశ అన్నతమ్ములు అయి ఉండాలి.   ఈ చిత్రం లో ఘంటసాల మాస్టారు, కోమల పాడిన  యుగళ గీతం " నా కన్నుల్లో నీ బొమ్మ చూడు" ఒక చక్కటి పాట.   ఆ పాట విందాము



Tuesday, September 24, 2013

" ఇంటికి దీపం ఇల్లాలే..... ఇల్లాలే .... కల కల లాడుతూ కిల కిల నవ్వుతు బ్రతుకే స్వర్గం అనిపించును ......"



అర్ధాంగి చిత్రాన్ని శ్రీ పీ పుల్లయ్య నిర్మించి దర్సకత్వం వహించారు. ఈ చిత్రం 1955 లో విడుదల. సంగీతం శ్రీ బీ. నరసింహ రావు మరియు మాస్టర్ వేణు. మాటలు, పాటలు శ్రీ ఆత్రేయ. ఘంటసాల మాస్టారు పాడిన " ఇంటికి దీపం ఇల్లాలే .. ఇల్లాలే .... కల కల లాడుతూ  కిల కిల నవ్వుతు బ్రతుకే స్వర్గం అనిపించును .......   చాలా ఉదాత్తమైన  పాట. బహుశ బ్యాక్ గ్రౌండ్ పాట అయి ఉండాలి. పాట విందాము..




Monday, September 23, 2013

" మమతలు లేని మనుజులలోన ఎవరికీ ఎవరు తండ్రి తనయుడు ఎవరో "



1962 లో విడుదలైన చిత్రం  "" గాలిమేడలు"". సంగీతం T G లింగప్ప సమకూర్చారు. పాటలన్నీ బాగున్నాయి. ప్రత్యేకించి , సముద్రాల గారు వ్రాసిన " మమతలు లేని మనుజులలోన ఎవరికి  ఎవరో తండ్రి తనయుడు ఎవరో " చాల చక్కటి పాట. మాస్టారు ఎంతో  ఆర్ద్రతతో  పాడారు. పాట వింటే మనసు కలత చెందక తప్పదు. పాట విందాము




Wednesday, September 18, 2013

" కాదు సుమ కల కాదు సుమ"


Keelu Gurram.jpg
ఘంటసాల మాస్టారు సంగీత దర్సకత్వం వహించిన తొలి చిత్రం 
"కీలు గుర్రం". ఈ చిత్రం 1949 లో విడుదలై గొప్ప విజయం సాదించిన చిత్రరాజం. రాజ అఫ్ మిర్జాపూర్ (మిర్జాపూర్ జమీందార్) నిర్మాత-దర్శకుడు. కథ-మాటలు-పాటలు శ్రీ తాపి ధర్మా రావు.  ఘంటసాల మాస్టారు తనకు వచ్చిన ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని , ఈ చిత్రం లోని అన్ని పాటలు సూపర్ హిట్ చేసారు.   రాబోయే కాలంలో తనో గొప్ప సంగీత దర్శకుడు అవుతానని సంకేతాలు పంపారు. మాస్టారు గారి గళం ఎంతో మధురంగా, లేతగా ఉండి శ్రోతల మనసు పులకరింప చేస్తుంది. మాట స్పష్టత, గళ మాధుర్యం మాస్టారి ప్రత్యేకత.   ఘంటసాల, సరళ రావు పాడిన " కాదు సుమ కల కాదు సుమ" చాల మెలోడీ  గా బాణీ కట్టిన పాట. విన్నంత సేపు, మనం కూడా గగనంలో విహరించినట్లు ఉంటుంది.
ఈ చిత్రంలో అక్కినేని కి మారు  తల్లి గా నటించిన అంజలి దేవి తరువాయి   చాలా చిత్రాలలో నాయికగా నటించింది.
64 సంవత్సరాలు క్రితం వచ్చిన ఈ పాట, ఇంకా శ్రోతల హృదయాలలో శాశ్వత ముద్ర వేసుకొన్నదంటే , ఆ  పాట మహత్యం ఎంతటిదో ఊహించుకో గలరు.
 ఆ పాట వినండి, ఆనందించండి.  







" చాలదా ఈ పూజ దేవి, ఈ భక్తుని నిరాదరణ చేయ నేయ"






జయంతి పిక్చర్స్ నిర్మించిన చిత్రం "శ్రీ కృష్ణార్జున యుద్ధం". దర్శక-నిర్మాత శ్రీ కే.వీ.రెడ్డి గారు. ఈ చిత్రం 9-1-1963 లో విడుదలై, ఇటు పండితులను, అటు  పామరులను అలరించింది. 50 సంవత్సరాలు క్రిత్రం వచ్చిన ఈ చిత్రరాజం, నేటికీ నిత్య నూతనంగా అలరారుతోంది. శ్రీ పెండ్యాల సంగీతంలో పాటలూ, పద్యాలూ,బహుళ ప్రజాదరణ పొందినవి. ఘంటసాల మాస్టారు ఎంతో వైవిధ్యంగా అటు రామారావుగారికి, ఇటు నాగేశ్వరరావు గారికి పాడి ప్రజలను మెప్పించారు. శ్రీ పింగళి గారి రచనలో అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్స్. ఘంటసాల  మాస్టారు పాడిన " చాలదా ఈ పూజ దేవి, ఈ భక్తుని నిరాదరణ చేయ నేయ" పాట విందాము. అర్జునుడు యతీన్ద్రుని వేషం లో ఉండి, సుభద్ర సపర్యలు చేస్తుంటే, విరహం నటిస్తూ పాడిన పాట. విన్నంత సేపు ఎంతో హాయిగా ఉంటుంది.


Sunday, September 15, 2013

" ముందరున్న చిన్న దాని అందమేమో చందమామ సిగ్గు చెంది సాగి పోయే





శ్రీ K విశ్వనాధ్ దర్సకత్వం వహించిన చిత్రం : "కాలం  మారింది". నిర్మాత వాసిరాజు ప్రకాశం, సంగీతం శ్రీ సాలూరు రాజేశ్వర రావు. 1972 లో విడుదైన ఈ చిత్రానికి, ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా, రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారం దక్కింది . ఈ చిత్రం లో దాశరథి  వ్రాసిన పాట " ముందరున్న చిన్న దాని అందమేమో  చందమామ సిగ్గు చెంది సాగి పోయే " చాల చక్కటి పాట.   ఘంటసాల మాస్టారు, సుశీల అంత అందంగానూ పాడారు. ఆ పాట విందాము.    


















Saturday, September 14, 2013

" వినవె ఓ ప్రియురాల వివరాలన్నీ ఈ వేళ"


 భరణి పిక్చర్స్ నిర్మించిన చిత్రం "గృహలక్ష్మి". 1967 విడుదల.  నిర్మాత-దర్శకుడు శ్రీ రామకృష్ణ. సంగీతం శ్రీ సాలూరు  రాజేశ్వర రావు. రచన శ్రీ నరసరాజు.  చిత్రం అనుకొంత విజయం సాదించ లేదు. పాటల పరంగా చూస్తే కొన్ని మంచి పాటలు ఉన్నాయి.  ఆ ఘనత శ్రీ రాజేశ్వర రావు మరియు ఘంటసాల మాస్టారు.  

ఘంటసాల గారు పాడిన " వినవె ఓ ప్రియురాల వివరాలన్నీ ఈ వేళ" ఒక చక్కటి హాస్య భరిత పాట. ఆ పాట విందాము.




Tuesday, September 10, 2013

"ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో " ఈ బండల మాటున ఏ గుండెలు దాగెనో "


విక్రం ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీ B. S. రంగా దర్శక నిర్మాత గా 1964 లో నిర్మించిన చిత్రం "అమరశిల్పి జక్కన".  చిత్రానికి  ఛాయాగ్రహణం కూడా శ్రీ రంగా గారే. సంగీతం శ్రీ సాలూరు రాజేశ్వర రావు. దాదాపు అన్ని పాటలూ బాగున్నాయి..  శ్రీ  నారాయణ రెడ్డి వ్రాసిన "   ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో " ఈ బండల మాటున ఏ గుండెలు దాగెనో "   చాలా ఉదాత్తమైన పాట . ఘంటసాల మాస్టారు గళం లో ఈ పాట మరింత అందంగా రూపు దిద్దుకొంది.  పాట విందాము. వీడియో క్లిప్పింగ్ యు ట్యూబ్ ద్వారా సేకరించడం జరిగింది.  వారికి, వాటిని అందించిన వారికీ  నా ధన్యవాదాలు . 






Sunday, September 8, 2013

"వాతాపి గణపతిం బజే"

 ఘంటసాల మాస్టారు బ్లాగ్ ను వీక్షిస్తున్న అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు.  ఘంటసాల మాస్టారు పాడిన "వాతాపి గణపతిం బజే" పాటను ఈ గణేశ చవితి రోజున విని తరిద్దాం... అందరికి శుభం అవుగాక.. 


Wednesday, September 4, 2013

"పోతే పోని పోరా"

  1. శివాజీ గనేషన్, సరోజా దేవి నటించిన తమిళ సూపర్ హిట్ చిత్రం " పాలుం పళముమ్" చిత్రాన్ని తెలుగులో "ప్రాయశ్చితం" పేరుతో అనువదించారు. ఇందులో ఘంటసాల మాస్టారు పాడిన "పోతే పోని పోరా" ఒక చక్కటి పాట గా చెప్పు కోవచ్చు. రచన అనిసెట్టి, సంగీతం విశ్వనాథన్ రామమూర్తి. తమిళంలో "పోనాల్ పోగటం పోడా" పాటను 
T M సౌందర్ రాజన్ పాడారు. కాని ఘంటసాల పాటకే నా వోటు.




Sunday, September 1, 2013

"తలనిండ పూదండ దాచిన రాణి, మొలక నవ్వుల తోడ మురిపించ బోకే"


ఘంటసాల మాస్టారు,సినీ గీతలే కాకుండా, ఎన్నో ప్రైవేటు గీతాలు కూడా ఆలపించారు. పుష్ప విలాపం, అమ్మా సరోజినీ దేవి, తలనిండ పూదండ, పోలీస్ వెంకటస్వామి ఇలా ఎన్నో ఉన్నాయి. ఏ పాట పాడినా, ఆయన గళం లోని మాధుర్యం చెరగి పోదు. అందుకే ఆయన పాడిన పాటలు నిత్య    నూతనంగా అలరారుతోంది. 

మాస్టారు పాడిన పై పాటలలో  "తలనిండ పూదండ దాచిన రాణి, మొలక నవ్వుల తోడ మురిపించ బోకే" ఒక చక్కటి పాట. గీత రచన శ్రీ దాశరథి.  ఘంటసాల ఎంత మధురంగా పాడారో,  ఆ పాటకు అంత ఆదరణ లభించింది.  ఘంటసాల గారు ఒరిజినల్ గా పాడిన పాటతో పాటు,  మహానటి సావిత్రీ హావ భావాలకు అనుగుణంగా జత చేసిన పాట కూడా చూడండి.  యు ట్యూబ్ ద్వారా ఈ వీడియో క్లిప్పింగ్ ను అనుసంధానం చేసిన శ్రీ హరీష్ (బ్యాంకు అఫ్ ఘంటసాల గారికి) నా కృతజ్ఞతలు/ ధన్యవాదాలు. ఈ ఆనందాన్ని నలుగురుతో పంచుకోవాలనేదే నా ఉద్దేశం.