అంజలి పిక్చర్స్ వారి "భక్త తుకారం" 18-06-1973 లో విడుదలైన చిత్రం. పాండురంగని భక్తుడైన తుకారం జీవిత చరిత్ర ఆధారంగా తీసిన చిత్రం. దర్శకులు శ్రీ వి.మధుసూదన్ రావు, సంగీత దర్శకులు శ్రీ ఆదినారాయణ రావు.
భక్తి రసం కురుపించిన చిత్రం. శ్రీ ఆదినారాయణరావు గారు చక్కటి బాణీలు కట్టి, అన్ని పాటలు సూపర్ హిట్ చేసారు,
ఘంటసాల మాస్టారు అంతే భక్తీ భావంతో ఆ పాటలు పాడి, ఈ చిత్రానికి వన్నె తెచ్చారు. మాస్టారు పాడిన " ఉన్నావా అసలున్నావా, ఉంటె కళ్ళు మూసుకున్నావా", దేవుణ్ణి నిందిస్తూ తుకారం మీద చిత్రీకరించిన పాట. ఆత్రేయ గారి కలం నుండి జాలు వారిన పాట. ఈ పాట విందాము.
No comments:
Post a Comment