ఘంటసాల గారి మీద ఉన్న అభిమానం తో నా ఈ బ్లాగ్ ను 2012 లో ప్రారంభించాను. ఈ బ్లాగ్ ప్రారంభానికి సహాయ పడ్డ శ్రీ వులిమిరి సూర్యనారాయణ గారికి నా కృతజ్ఞతలు. ఇది నా బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్న 100 వ పాట. నా బ్లాగ్ ను చూసి ఆదరిస్తున్న దేశ విదేశాల ఘంటసాల అభిమానులందరికీ నా ప్రత్యెక కృతజ్ఞతలు.
ఘంటసాల మాస్టారు లేరు అన్నది అబద్ధం. వారి పాటల ద్వారా మనలోనే ఉన్నారు . వారు చిరంజీవులు. ఆయన పాడిన పాటలకు మరణం లేదు. అవి అజరామరం.
రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ నిర్మించిన చిత్రం "బంగారు గాజులు". ఈ చిత్రం 1968 లో విడుదలై, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ "నంది" అవార్డు పొందింది. అక్కినేని, భారతి, విజయ నిర్మల నటించగా, శ్రీ సి యస్ రావు దర్సకత్వం వహించారు. సంగీతం శ్రీ తాతినేని చలపతి రావు. ఈ చిత్రం లో 7 పాటలు ఉన్నాయి. అందులో ఘంటసాల, సుశీల గారలు పాడిన మంచి మెలోడీ పాట "విన్న వించు కోన చిన్న కోరిక, ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక". విన్నంత సేపు ఎంతో హాయిగా ఉంటుంది. గీత రచన శ్రీ దాశరథి కృష్ణమాచార్య. ఆ పాట వీడియో క్లిప్పింగ్ చూద్దాము.

శ్రీ వెంకోబా రావు గారికి ధన్యవాదములు మరియు శుభాభినందనలు.
ReplyDeleteశ్రీ సూర్యనారాయణ గారికి,
ReplyDeleteనేనే మీకు ధన్యవాదాలు తెలుపోకావాలి నేను మిమ్మల్నికలిసి ఉండక పోతే, నా ఈ ఘంటసాల మాస్టారు బ్లాగ్ ఉండేది కాదు. మిమ్మల్ని కలుసు కోవడం దైవేచ్ఛ. నా బ్లొగ్ మీ ఇంట్లో శ్రీకారం చుట్టింది. నేడు 100 పాటల కు చేరుకొని ఘంటసాల గారి మీద ఉన్న అభిమానం ఇంకా పెరిగింది. నాకు చాల సంతోషంగా ఉంది. అందుకే మీకు ధన్యవాదాలు. ... కే వెంకోబ రావు