Wednesday, June 26, 2013

"కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడి పోలేదోయి" .


 Devadasu 1953.JPG
ఘంటసాల మాస్టారు అనుభవించి పాడిన పాటలు ఎన్నో ఉన్నాయి. అందులో  చెప్పుకో తగ్గది "దేవదాసు"  చిత్రంలోని దాదాపు అన్ని పాటలు. చిత్ర విజయానికి ఆయన పాడిన పాటలు ఎంతో దోహదం చేశాయి అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.  ఆ పాటలన్నీ ఆణిముత్యాలే.  వినోదా బ్యానర్ లో శ్రీ డీ.యల్.నారాయణ నిర్మించిన చిత్రం " దేవదాసు"  విడుదలై నేటికి 60  సంవత్సరాలు నిండినవి. ఈ చిత్రం 23-06-1953 రోజున విడుదలైంది.  నేటికినీ, ఆ పాటలు ప్రజల మనోఫలకం ఫై నిలిచి ఉందంటే, ఆ శక్తి ఘంటసాల గారిదే. అక్కినేని, సావిత్రి ల అసమాన నటన, సీ.ఆర్. సుబ్బరామన్ అద్భుత సంగీతం, శ్రీ సముద్రాల మాటలు-పాటలు, శ్రీ వేదాంతం రాఘవయ్య దర్సకత్వ ప్రతిభ, శ్రీ బి.ఎస్. రంగ ఛాయాగ్రహణం,  అన్నిఅలా కలిసి వచ్చి చిత్ర విజయానికి పీటలు వేశాయి. ఈ చిత్రం లో ఘంటసాల మాస్టారు పాడిన "కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడి పోలేదోయి" ఒక మంచి సింబాలిక్ పాట.ఈ పాటకు అర్థం ఏమిటని అడిగితే, సముద్రాల గారు చెప్పారట-- దేవదాసు పార్వతిని ప్రేమించాడు, ఆమె దక్కలేదు, చంద్రముఖి దేవదాసు ను ప్రేమించింది కానీ దేవదాసు వద్దన్నాడు.  కుడి ఎడమైనా పరవాలేదు అంత మాత్రాన ఓడి పోలేదు. త్రాగుడుకు  బానిస అయ్యాడు.  మేడ  మీద అలపైడి  బొమ్మ (పార్వతి), నేలనే చిలక్కమ్మ (చంద్రముఖి),  చందమామ మసక వేసే ముందు, కబురేల, అవసరం లెదు. ప్రాణం మీద తీపి ఉన్న వానికి లంగరు అవసరం కాని, చావాలని అనుకొన్న వానికి లంగారు  అవసరం లేదు, లాహిరి నది సంద్రంలోన లంగరు తో పనిలేదోయి , మునకే సుఖ మను కోవోయి. ఎంత సింబాలిక్ గా వ్రాసారు సీనియర్ సముద్రాల గారు. అందుకే ఆ పాట అలా నిలిచిపోయింది. ఆ పాట విందాము. 


No comments:

Post a Comment