అన్నపూర్ణ పిక్చర్స్ చిత్రం "చదువుకున్న అమ్మాయిలు". ఈ చిత్రం 10-04-1963 లో విడుదల అయ్యింది. అక్కినేని, సావిత్రి, కృష్ణకుమారి. శోభన్ బాబు, సరోజ, మొదలగు వారు నటించారు. ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకుడు. శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారు సంగీతం సమకూర్చారు. ఈ చిత్రానికి మూలం డాక్టర్ శ్రీదేవి నవల "కాలాతీత వ్యక్తులు". అన్ని పాటలు బహుళ ప్రజాధరణ పొందినవే. ఘంటసాల మాస్టారు సుశీల తో పాడిన "గుట్టుగా లేత కొమ్మల కులుకు నిన్ను..........ఒకటే హృదయం కోసం ఇరువురి పోటీ దోషం" చాల మంచి పాట. ఆ పాట వినండి, వీడియో చూడండి.
Sunday, May 13, 2012
Tuesday, May 8, 2012
అనుకొన్నదొకటి అయినది ఒక్కటి
మంచి మనసుకు మంచి రోజులు చిత్రంలో ఘంటసాల మాస్టారు పాడిన " రావే నా చెలియా", "కలవారి స్వార్థం నిరుపేద దుఃఖం," "అనుకొన్నదొకటి అయినది ఒక్కటి" చాల చక్కటి పాటలు .
ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల సమకూర్చారు. చిత్ర దర్శకుడు శ్రీ సి. యస్ రావు. ఈ చిత్రం 1958 లో వచ్చింది.ఇక్కడ అనుకొన్నదొకటి అయినది ఒక్కటి పాట జత పరుస్తున్నాను. వినండి .
Monday, May 7, 2012
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకు ఇంతే
ఆత్రేయ గారి జయంతి నేడు. మనసు కవి ఆత్రేయ ఎన్నో పాటలకు జీవం పోసారు. వ్రాయక నిర్మాతని, రాసి ప్రేక్షకులను ఏడి పిస్తారని చెపుతారు. ప్రేమనగర్ చిత్రంలో ఆయన వ్రాసిన "మనసు గతి ఇంతే మనిషి బ్రతుకు ఇంతే "
పాట ఆయనను మనసుకవి చేసింది. ఘంటసాల గారు అద్భుతంగా పాడిన పాట. దేవదాసు చిత్రం లోని "జగమే మాయ బ్రతుకే మాయ " తరువాత అంత మంచి పాట పాడానని మాస్టారు గారు చెప్పుకొన్నారు. ఆ పాట వినండి.
ఆత్రేయ గారి వర్ధంతి సందర్భంగా టీవీ 9 వారు ప్రసారం చేసిన కార్య క్రమము కూడా జత పరుస్తున్నాను. వీక్షించండి. (టీవీ 9 వారికీ ధన్యవాదములతో )
Wednesday, May 2, 2012
అమ్మా అని అరిచిన ఆలకించవేమమ్మ
పాండురంగ మహాత్యం చిత్రంలో అన్ని మంచి పాటలే ఉన్నాయి.
ఈ చిత్రానికి శ్రీ తోటకూర వెంకట రాజు గారు సంగీతం సమకూర్చారు. ఇది NAT
నిర్మించిన చిత్రం. ఇందులో ఘంటసాల మాస్టారు పాడిన "అమ్మా అని అరిచినా" అనే
పాట హృదయాన్ని కదిలించే పాట. చిత్ర కథానాయకుడు రామారావు మీద చిత్రీకరించిన ఈ పాటను విన్న ప్రతి వారు కంట తడి పెట్టక మానరు. గీత రచన సముద్రాల. ఈ చిత్ర దర్శకుడు కమలాకర కామేశ్వర రావు.
Tuesday, May 1, 2012
"చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేర రావేలా"
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ "కులగోత్రాలు" 24-08-1962 లో
విడుదలైన చిత్రం. కృష్ణకుమారి, అక్కినేని నాయికా నాయకులుగా
నటించారు.సంగీతం శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారు సమకూర్చారు. డా.నారాయణ
రెడ్డి గారు అక్కినేని చిత్రానికి వ్రాసిన మొదటి పాట "చెలికాడు నిన్నే
రమ్మని పిలువ". ఈ గీతాన్ని ఘంటసాల, సుశీల గారలు పాడారు. పాట వింటూ
ఉంటె ఎంతో హాయ్ గా ఉంటుంది. అంత చక్కగా బాణి కట్టారు శ్రీ సాలూరు వారు. ఆ
పాట వినండి ఆనందించండి.
Subscribe to:
Posts (Atom)