Showing posts with label ప్రేమనగర్ 1971. Show all posts
Showing posts with label ప్రేమనగర్ 1971. Show all posts

Monday, May 7, 2012

మనసు గతి ఇంతే మనిషి బ్రతుకు ఇంతే

ఆత్రేయ గారి జయంతి నేడు. మనసు కవి ఆత్రేయ ఎన్నో పాటలకు జీవం పోసారు. వ్రాయక నిర్మాతని, రాసి ప్రేక్షకులను ఏడి పిస్తారని చెపుతారు. ప్రేమనగర్ చిత్రంలో  ఆయన వ్రాసిన "మనసు గతి ఇంతే మనిషి బ్రతుకు ఇంతే "
పాట ఆయనను మనసుకవి చేసింది. ఘంటసాల గారు అద్భుతంగా పాడిన  పాట. దేవదాసు చిత్రం లోని  "జగమే మాయ బ్రతుకే మాయ " తరువాత  అంత మంచి పాట పాడానని మాస్టారు గారు చెప్పుకొన్నారు. ఆ పాట వినండి. 

 
ఆత్రేయ గారి వర్ధంతి సందర్భంగా టీవీ 9  వారు ప్రసారం చేసిన కార్య క్రమము కూడా జత పరుస్తున్నాను. వీక్షించండి. (టీవీ 9 వారికీ ధన్యవాదములతో )
 

Friday, March 16, 2012

తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా

సురేష్ పిక్చర్స్ వారి "ప్రేమనగర్" 1971 లో విడుదలై సంచలనాత్మక విజయం సాదించిన చిత్ర రాజం.  ఈ చిత్రం శ్రీ రామానాయుడు గారిని చిత్ర పరిశ్రమలో ఉండేలా చేసిన చిత్రం అని చెప్పుకొంటారు. అక్కినేని అపురూప నటన, వాణిశ్రీ నటనా చతుర్థి, మామ మహదేవన్ అద్బుత సంగీతం, ఈ చిత్రానికి వన్నె తెచ్చాయి. ఈ చిత్రంలోని అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్స్. ఇందులో తెలుగు తనానికి దగ్గరగా ఉన్న పాట "తేట తేట తెలుగులా, తెల్లవారి వెలుగులా," ఘంటసాల మాస్టారు ప్రాణం పోసిన పాట. రచన శ్రీ ఆత్రేయ.
పాట వినండి.