Tuesday, August 13, 2013

ఒకే పాట మూడు బాషల్లో: (చిత్రం జయసింహ)



N A T సంస్థ నిర్మించిన జయసింహ చిత్రం 1955 విడుదల. జానపద చిత్రాలలో మేటి చిత్రం. శ్రీ దాసరి యోగానంద్ దర్సకత్వమ్  వహించారు, సంగెతం శ్రీ T V రాజు. ఈ చిత్రాన్ని తమిళం, హిందీ బాషలలో అనువదించారు.

తెలుగు లో  రావు బాలసరస్వతి, ఘంటసాల పాడిన యుగళ గీతం 
"మదిలోనే మధుర భావం, పలికేను  మోహన రాగం"  చాలా చాలా మెలోడీ పాట. గీత రచన శ్రీ సముద్రాల. 

తమిళంలో వీరే " మలరోడుం మధుర మేవుం, మనం కానుం మోహన్ రాగం" అంటూ గానం చేసారు.  

అలాగే, హిందీ లో "మన్  బీనా మధుర్ భోలే,  మై రాగ్ ....  తు..  మేరా సరగమ్" (చిత్రం జయసింఘ్ --1959 లో విడుదల) గీత రచన: ప్రేమ్ ధవన్, సంగీతం: రమేష్ నాయుడు. గాయనీ గాయకులు: లతా మంగేష్కర్, మన్నాడే. 

ఈ మూడు బాషలలోను ఆ పాటను వినండి. పాటలు యు  ద్వారా సేకరణ. వారికి మా ధన్యవాదాలు. పాటలలోని మాధుర్యాన్ని ఆస్వాదించండి. 


 

9 comments:

  1. Emi gathram! Ghantasala Mastaru gaari gathram vintunte entho haayiga untundi. Rao Bala Saraswati gaari gathram kooda adbhutham.

    Thank you, Rao gaaru for all your efforts and contributions.

    ReplyDelete
    Replies
    1. మీ అద్భుత స్పందనకు కృతజ్ఞతలు. పాట వింటూ ఉంటె, ఎంతో హాయిగా ఉంది అని చెప్పారు. ఇది వంద శాతం నిజం. ఘంటసాల గారి పాటలు వింటూ ఉంటె, ఒక్క హాయే కాదు, మనసుకు సంతోషం, రోగాలు దూరం, ఆయువు పెరుగుదల ఉంటాయి . మనశ్శాంతి ఇచ్చేది సంగీతం అయితే, ఆయువు పోసేది ఘంటసాల పాటలు.

      Delete
    2. You are perfectly correct.We want to reply in Telugu but unfortunately our system will not support.

      Delete
    3. Very beautiful.We should thank you for your efforts.

      Delete
    4. Well said.We like your efforts to increse our ayuraarogyaalu

      Delete
    5. మీ స్పందనకు నా ధన్యవాదాలు. ఘంటసాల అభిమానులందరూ, ఆయన పాటల సముద్రంలో మునిగి తేలుతూ, చక్కటి ఆరోగ్యంతో, మనసు నిర్మలంగా, సంతోషంగా ఉండేలా చేయడమే నా బ్లాగ్ యొక్క ఉద్దేశం. నా .... ఈ.... చిన్న ప్రయత్నానికి అందరి అభిమానాలు అందుతున్నాయి. ఒక అభిమానిగా నాకు ఇంత కంటే ఏమి కావాలి.



      మీరు జీ మెయిల్ ద్వారా తెలుగు లో వ్రాయవచ్చు . ప్రయత్నించండి. సాధించండి. అల్ ది బెస్ట్

      Delete
  2. I remember appudeppudo naa chinnappudu telugulo oka magazine vachedi Rajahmundry ninchi .telugu paatalu vaatininchi evaru copy chesaaru or vice versa inka ilaati information chaala vundedi....we used to like it.

    Tharavaatha nadiche paatala dictionary laati vak rangarao garu ilaati seva chaala chesaru telugu paatLaki mukhyanga cinema patalaki

    Meeruu aa sthaayi andukovaali...marinni manchi paatalu meeru parichayam cheyyali

    Annatlu ilati paatha paatalni meeru digitalise chesukunnara? Eemadhya ne choosanu okati old 78rpm records ninchi anniti digitalise chesukovadaniki...mana India lo HMV gani vere vaallu gani thayaru chesaremo choodali

    Annatlu Surya kuma ri patalni konni saradaaga parichayam cheyyakoodaduu.....

    ReplyDelete
    Replies


    1. శ్రీ J V రావు గారికి,

      మీ స్పందనకు నా ధన్యవాదాలు. నేను ఏ పాటలు దిజిట లైసె చేయ లేదు.. చేసే ప్రక్రియ కూడా నాకు తెలియదు. నాకు అందుబాటులో ఉన్న పాటలను తీసుకొని నా బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్నాను. నా ఈ బ్లాగ్, కేవలం ఘంటసాల గారి పాటలకే పరిమితం.


      నాది ఇంకొక బ్లాగ్ ఉంది .. "మెలోడీ పాట ". ఈ బ్లాగ్ లో మీరు కోరినట్లు సూర్యకుమారి గారి పాటలను వేయడానికి ప్రయత్నం చేస్తాను.

      Delete

  3. Thanks venkoba rao garuu.. meeruu hyderabad lone vuntaaru kadaa. Perhaps dec lo I will get that instrument .I have some old LP, EP AND 78 RPM records of famous singers ramanadha sastry, ramatilakam, rajeswara rao and ofcourse Ghantasala

    we can have great time with the old melodies

    ReplyDelete