ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారు, పెంపుడు కొడుకు, ఇల్లరికం తరువాయి నిర్మించిన చిత్రం "భార్యా భర్తలు". చక్కటి కథతో, వినసొంపైన పాటలతో, ఇటు పండితులను, అటు పామరులను అలరించిన చిత్రం. ఈ చిత్రం 31-03-1961 లో విడుదలై విజయం సాదించటం తో పాటు ప్రభుత్వ ప్రసంశలు పొందిన చిత్రమ్. ( ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు పొందిన చిత్రం). శ్రీ K. ప్రత్యగాత్మ దర్సకత్వం వహించగా, శ్రీ అనుమోలు వెంకట సుబ్బారావు నిర్మించిన ఈ చిత్రానికి శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారు సంగీతం సమకూర్చారు. ఈ చిత్ర విజయానికి, సంగీతం కూడా తోడ్పడింది. ఘంటసాల మాస్టారు, సుశీల గారలు పాడిన పాటలు నేటికి శ్రోతలను అలరిస్తూనే ఉంది. ముఖ్యంగా, ఘంటసాల సుశీల పాడిన యుగళ గీతం "మధురం మధురం ఈసమయం, ఇక జీవితమే ఆనందమయం" మంచి మెలోడీ పాట. పాట వింటూ ఉంటె ఏదో లోకాలలో విహరించి నట్లు అనుభూతి కలగక మానదు. పాట అప్పుడే అయిపోయిందా అనే సందేహం రాక మానదు. అంత గొప్ప పాట , అందుకే నేటికి సజీవంగా ఉంది. ఆ పాట విందాము/ వీడియో క్లిప్పింగ్ చూద్దాము. వీడియో యు ట్యూబ్ సహకారంతో పోస్ట్ చేయడం జరిగింది. వారికి ధన్యవదాలు.
అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మించిన చిత్రం " ఆత్మగౌరం" 1965 లో విడుదలైంది. శ్రీ విశ్వనాధ్ గారు తొలిసారి దర్సకత్వం వహించిన చిత్రం ఆత్మగౌరం. కథ: యద్దనపూడి సులోచనా రాణి, గొల్లపూడి మారుతీ రావు. అన్నపూర్ణ సంస్థకు శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారు సంగీతం సమకూర్చడం "ఇద్దరు మిత్రులు" చిత్రంతోనే ప్రారంభం. ఈ చిత్రం లోని పాటలు ఎంత ప్రజాదరణ పొందిందో అందరికి తెలిసిన విషయమే. ఆత్మగౌరం చిత్రం లోని పాటలు కూడా అంతే ప్రజాదరణ పొందింది. ఈ చిత్రంలో దాదాపు 10 పాటలు ఉన్నాయి. అన్నీ మెలోడీ గీతలే. ఘంటసాల మాస్టారు, సుశీల గారితో పాడిన యుగళ గీతం "ప్రేమించ నిదెపెళ్ళాడనని తెగ కోతలు కోశావులే" చాల చక్కటి పాట. ఆ పాట వినండి. ఘంటసాల గారు ఎంతో చలాకీగా పాడారు. శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారు చక్కటి బాణీ సమకూర్చి పాటకు మరింత అందం తెచ్చారు. వీడియో సహకారం యూ ట్యూబ్ మరియు వోల్గా. వారికి ధన్యవాదాలు.
విజయా పిక్చర్స్ నిర్మించిన పూర్తి హాస్య భరిత చిత్ర రాజం " గుండమ్మ కథ". అగ్రశ్రేణి నటులు శ్రీ నందమూరి తారక రామా రావు. అక్కినేని నాగేశ్వర రావు, S. V. రంగా రావు, సావిత్రి, జమున, రమణా రెడ్డి, రాజనాల, సూర్యకాంతం, ఛాయా దేవి, నటించిన ఈ చిత్రానికి దర్శకుడు శ్రీ కమలాకర కామేశ్వర రావు. ఇదంతా ఒక ఎత్తైతే, ఘంటసాల మాస్టారు సమకూర్చిన సంగీతం ఒక ఎత్తు. అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్స్. ఈ చిత్రంలో పాట లేకుండా, L. విజయలక్ష్మి చేసిన నృత్యానికి, మాస్టారుకేవలం వాయిద్యాలతో సమకూర్చిన సంగీతం అద్భుతంగా కుదిరింది. "పాటల దేవుడు ఘంటసాల" అనే శీర్షికతో, ఘంటసాల మాస్టారు వాయిద్యాలతో సమకూర్చిన సంగీతంతో, ఫోటో ఆల్బం విడుదల చేసారు. ఈ ఆల్బం లో ఘంటసాల మాస్టారు, ఇతర గాయకులు, గాయని మణులు, సంగీత దర్శకులు, నటులు మొదలగు వారితో ఉన్న ఫోటోలు ఉన్నాయి. మాస్టారు అభిమానులు వీటిని చూసి ఆనందిస్తూ, ఆ సంగీతాన్ని వింటారని, విని ఆనందిస్తారని ఆశిస్తున్నాను. (యూ ట్యూబ్ వారికి కృతజ్ఞతలతో).నలుగురికి తెలియ చెప్పే ప్రయత్నమే కాని, కాపీ రైట్స్ ఉల్లంగన కాదని మనవి.
విజయా సంస్థ నిర్మించిన చిత్రం CID. చిత్ర నిర్మాతలు శ్రీయుతులు నాగిరెడ్డి, చక్రపాణి, దర్శకుడు చాణక్య. సంగీతం ఘంటసాల మాస్టారు. ఈ చిత్రంలో 8 పాటలు ఉన్నాయి. అన్ని మెలోడీ పాటలే. ఘంటసాల మాస్టారు విజయ సంస్థకు మంచి బాణీలు సమకూర్చి వారి చిత్రాలకు విజయం చేకూర్చారు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. పింగళి నాగేంద్ర రావు గీత రచన చేసిన పాట " నా సరి నీ వని నీ గురి నే ననిఇప్పుడే తెలిసెనులే" ఘంటసాల, సుశీల పాడారు. మంచి మెలోడీ పాట. ఆ పాట విందాము.video సహకారం యు ట్యూబ్.
శ్రీ కే.బి.తిలక్ నిర్మించి దర్సకత్వం వహించిన చిత్రం "ఉయ్యాలా జంపాల". ఈ చిత్రం 1965 లో విడుదలైంది. శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు గారు అద్భతమైన బాణీలు సమకూర్చి అన్ని పాటలు సూపర్ హిట్ చేసారు. ఈ చిత్రంలోని ఘంటసాల మాస్టారు, సుశీల పాడిన "కొండగాలి తిరిగింది గుండె ఊసు లాడింది గోదావరి వరద లాగ కోరిక చెల రేగింది".
ఘంటసాల మాస్టారు కన్నడ చిత్రాలలో కూడా చాలా పాటలు పాడారు. మాస్టారు గారి గొప్ప తనం ఏంటంటే , తనకు బాష రాక పోయీనా, పాటను తెలుగులో వ్రాసుకొని, ఇంట్లో పాడుకొనే వారట. బాష వచ్చిన వారితో, తన ఉచ్చారణలో లోపాలు ఉంటె సరిచేసుకొని, పాటను రికార్డు చెయ్య మనేవారని చెప్పుతారు. సంగీత దర్శకుడు, నిర్మాత, తన మీద అభిమానంతో పాడటానికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసే వారు. అలంటి ఒక పాటే "శ్రీ రామాంజనేయ యుద్ధ" చిత్రంలో ఘంటసాల గారు పాడిన ' హనుమాన ప్రాణ, .. ప్రభు రఘురామ'. చాలా చక్కగా భావయుక్తంగా పాడి రక్తి కట్టించారు.
చిత్ర విశేషాలు తెలియదు కాని, ఈ చిత్రంలో కన్నడ రాజ్ కుమార్, జయంతి, ఉదయ కుమార్ మొదలగు వారు నటించారు. సంగీత దర్శకుడు సత్యం (?) ఆ పాట విందాము. వీడియో యు ట్యూబ్ సహకరనతో. వారికి ధన్యవాదాలు.
చిత్రకల్పన సంస్థ నిర్మించిన చిత్రం 'బుద్ధిమంతుడు'. ఈ చిత్రం 20-09-1969 లో, అక్కినేని జన్మ దిన కానుకగా విడుదలై విజయం సాదించింది. కథా మాటలు శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ, దర్సకత్వం శ్రీ బాపు. సంగీతం శ్రీ K V మహదేవన్. ఘంటసాల గారు పాడిన సోలో గీతాలు, సుశీల తో పాడిన యుగళ గీతాలు ఎంతో బాగున్నాయి. భూమ్మీద సుఖ పడితే తప్పు లేదురా, టాటా వీడుకోలు, గుట్టమీద, వేయి వేణువులు మ్రోగే వేళ, బడిలో ఏముంది, మొదలగు అన్ని పాటలు బహుళ ప్రజాదరణ పొందినవే. ఘంటసాల మాస్టారు అన్ని పాటలకు జీవం పోసారు. అందుకే అలా నిలిచి పోయాయి. ఇప్పుడు ఘంటసాల మాస్టారు పాడిన " వేయి వేణువులు మ్రోగే వేళ, హాయి వెల్లువై పొంగే వేళ " పాట విందాము. వీడియో క్లిప్పింగ్ యు ట్యూబ్ సౌజన్యంతో.
గౌతమి ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం " మహామంత్రి తిమ్మరుసు ". ఇది చారిత్రాత్మిక చిత్రం, 1962 లో విడుదలై, ఆ సంవత్సరపు ఉత్తమ ప్రాంతీయచిత్రంగా రాష్ట్రపతి రజత పథకం పొందింది. చిత్ర నిర్మాత అట్లూరి పున్డరికాక్షయ్య, దర్శకుడు శ్రీ కమలాకర కామేశ్వర రావు. కథా-మాటలు-పాటలు శ్రీ పింగళి నాగేంద్ర రావు. సంగీతం శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు.
శ్రీ రామారావు, గుమ్మడి,దేవిక, యస్ వరలక్ష్మి నటీ నటులు. పాటలన్నీ మధురంగా ఉండి, మనసుకు ఎంతో హాయిని కలిగిస్తాయి. ఘంటసాల సుశీల యుగళ గీతం " మోహన రాగ మహా మూర్తి మంతమాయే ." ఒక చక్కటి మెలోడీ పాట. ఘంటసాల మాస్టారు ఎంతో రస రమ్యంగా పాడారు. పాటకు తగ్గట్టు చిత్రీకరణ ఎంతో హుందాగా ఉంది. ఆ పాట విందాము. వీడియో క్లిప్పింగ్ యూ ట్యూబ్ సహకారంతో.
మాయాబజార్ పేరు వినగానే మనసు నిండా ఒక తీయని అనుభూతి. నేటి తరం కాకుండా , నాటి తరం వాళ్ళు ఈ చిత్రాన్ని ఎన్ని సారులు చూసి ఉంటారో చెప్పడం కష్టం. ఈ మధ్యనే ఈ చిత్రాన్ని రంగుల్లో మార్చి విడుదల చేసారు. అప్పుడు, నేటి తరం కూడా చూసే ఉంటారు. 1957 లో విడుదల అయిన ఈ చిత్ర రాజం, ఇప్పటికి ప్రజల హృదయాలలో పదిలంగా ఉందంటే, అది ఎంత గొప్ప చిత్రమో తెలుస్తోంది.
విజయా వారి బ్యానర్ లో తీసిన ఈ చిత్రానికి శ్రీ K V రెడ్డి దర్సకత్వం వహిం చారు. ఘంటసాల మాస్టారు సంగీతం సమకూర్చారు. అన్ని పాటలు ఆణిముత్యాలే.
వందేళ్ళ భారతీయ సినీ చరిత్రలో అత్యద్భుత దృశ్య కావ్యంగా "మాయాబజార్" ఎన్నికయింది. జాతీయ వార్తా ఛానల్ సి యెన్ యెన్ మరియు ఐ బీ యెన్ ఇటీవల జరిపిన 'ఇండియన్ గ్రేటెస్ట్ ఫిలిం ఎవర్' ఓటింగ్లో, మన తెలుగు చిత్రం 'మాయాబజార్', దాదాపు 20,000 ఓట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇది తెలుగు వారందరూ గర్వించ తగ్గ విషయం.
ఈ చిత్రానికి ఆయువుపట్టు సంగీతం. ఘంటసాల మాస్టారు అందించిన బాణీలు అమోఘం. మల్లి మల్లి వినాలనే పాటలు, ఎన్ని సార్లు విన్నా విసుగు పుట్టని ఆ పాటలు కల కాలం నిలిచి పోయేలా చేసారు. ఇందులో రేలంగి గారికి మాస్టారు పాడిన పాట "సుందరి నీవంటి దివ్య స్వరూపము ఎందెందువెతికినా లేదు కదా" హాశ్యం తో కూడిన మెలోడీ పాట. గీత రచన పింగళి నాగేందర్ రావు. ఆ పాట విందాము. ఈ పాటలో సావిత్రి , రేలంగి ల నటన, హావ భావాలూ చూసి ఆనంద పడాల్సిందే.
నవశక్తి ప్రొడక్షన్స్ చిత్రం "జీవిత చక్రం". ఈ చిత్రం 1971 లో విదుదల. చిత్ర నిర్మాత శ్రీ P గంగాధర రావు, చిత్ర దర్శకుడు శ్రీ C S రావు. సంగీత దర్శకుడు శంకర్ - జైకిషన్. హిందీ చిత్ర రంగం లో ఎన్నో చిత్రాలకు ఉత్తమ సంగీతం అందించిన సంగీత దర్శకుల జోడి శంకర్-జైకిషన్. తెలుగు లో మొదటి సారి సంగీతం అందించి అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ చేసారు. ఘంటసాల మాస్టారు, బొంబాయి శారద కలిసి పాడిన పాటలు వెరైటీ గా ఉండి, శ్రోతలను అలరించాయి. ఈ చిత్రం లోని ఆరుద్ర గారి కలం నుండి జాలు వ్రాలిన పాట "కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు గుండెల్లో గుండె కలిపి చూడు" ఒక చక్కటి పాట. ఆ పాట విందాం.
ఘంటసాల మాస్టారు స్వీయ సంగీత దర్సకత్వం వహించన చిత్రం "శబాష్ రాముడు". ఈ చిత్రాన్ని రాజశ్రీ పిక్చర్స్ నిర్మించి 1959 లో విడుదల చేసారు. శ్రీ రామారావు, దేవిక, రమణమూర్తి, రేలంగి, గిరిజ నటించారు. దర్శకుడు శ్రీ సీ యస్ రావు. ఈ చిత్రంలో మాస్టారు రేలంగి కి ఒక పాట పాడారు. ఈ పాటను శ్రీ శ్రీ వ్రాసారు. " ఆశలే అలలాగా ఊగేనే సరదాగా". చాలా తక్కువగా వినిపించే పాట. బహుశ ఘంటసాల అభిమానులు కూడా విని ఉండరు.(?)
ఘంటసాల మాస్టారు స్వర పరిచి పాడిన పాటలలో ముందు వరసలో నిలిచే పాట "అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం" 1953 లో విడుదలైన "బ్రతుకు తెరువు" చిత్రం లోని ఈ పాట అప్పటికి, ఇప్పటికి , ఎప్పటికి మరచి పోలేని మధుర మైన పాట గా చెప్పుకోవచ్చు. ఇదే పాటను P. లీల చే పాడించారు మాస్టారు. ఆమె కూడా అంతే అధ్భుతంగా పాడారు. పాట రచన సముద్రాల జూనియర్. ఇప్పుడు P లీల, ఘంటసాల పాడిన పాటను విందాము.
ఘంటసాల మాస్టారు తమిళ్లో కొన్ని పాటలు పాడారు. పాడిన పాటకు న్యాయం చేకూర్చాలి అనే తపన మాస్టారు గారిది. అది తెలుగు అయినా, తమిళం అయినా సరే. అలంటి పాటే మన్ మగన్ తేవై చిత్రంలోనిది. ఈ చిత్ర వివరాలు చూడండి. భరణి పిక్చర్స్ నిర్మించిన చిత్రం "వరుడు కావాలి ". ఇదే చిత్రాన్ని తమిళంలో " మన్ మగన్ తేవై " గా తీసారు. ఈ చిత్రం 1957 లో విడుదలైంది. తెలుగు లో జగ్గయ్య, భానుమతి నటించగా, తమిళంలో శివాజీ గణేషన్ భానుమతి నటించారు. చిత్ర దర్శకుడు P రామకృష్ణ , సంగీత దర్శకుడు G రామనాథన్. తమిళంలో ఘంటసాల మాస్టారు, భానుమతి , పిఠాపురం నాగేశ్వర రావు కలిసి పాడిన పాట " వెన్నెలా జ్యోతి యై వీసుదే కన్ గలే కాదలై పేసుదే" ఒక చక్కని మెలోడీ పాట. ఈ పాటను తెర మీద శివాజీ గణేషన్, భానుమతి, T R రామచంద్రన్ పై చిత్రీక రించారు. తమిళ పాట క్లిప్పింగ్ చూద్దాము క్లిప్పింగ్ రాకపోతే యు ట్యూబ్ ద్వారా చూడండి.