విజయా సంస్థ నిర్మించిన చిత్రం CID. చిత్ర నిర్మాతలు శ్రీయుతులు నాగిరెడ్డి, చక్రపాణి, దర్శకుడు చాణక్య. సంగీతం ఘంటసాల మాస్టారు. ఈ చిత్రంలో 8 పాటలు ఉన్నాయి. అన్ని మెలోడీ పాటలే. ఘంటసాల మాస్టారు విజయ సంస్థకు మంచి బాణీలు సమకూర్చి వారి చిత్రాలకు విజయం చేకూర్చారు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
పింగళి నాగేంద్ర రావు గీత రచన చేసిన పాట " నా సరి నీ వని నీ గురి నే నని ఇప్పుడే తెలిసెనులే" ఘంటసాల, సుశీల పాడారు. మంచి మెలోడీ పాట. ఆ పాట విందాము.video సహకారం యు ట్యూబ్.