Wednesday, July 3, 2013

"అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం" P లీల, ఘంటసాల



ఘంటసాల మాస్టారు స్వర పరిచి పాడిన పాటలలో ముందు వరసలో నిలిచే పాట "అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం" 1953 లో విడుదలైన "బ్రతుకు తెరువు" చిత్రం లోని ఈ పాట అప్పటికి, ఇప్పటికి , ఎప్పటికి మరచి పోలేని మధుర మైన పాట గా చెప్పుకోవచ్చు.  ఇదే పాటను  P. లీల చే పాడించారు మాస్టారు. ఆమె కూడా అంతే అధ్భుతంగా పాడారు.  పాట రచన సముద్రాల జూనియర్.  ఇప్పుడు P లీల, ఘంటసాల పాడిన పాటను 
విందాము. 

 

4 comments:

  1. all time great పాట -అందమే ఆనందం ఆనందమే జీవిత makarandam!

    ReplyDelete
    Replies
    1. Yes Sir, A song whose age is 60 years (1953-2013) is still fresh in the minds of music lovers and in particular Ghantasala. Surely, its All Time Great Song. Equal praiase to P.Leela for singing so nicely on par with Ghantasala.

      Thanks for your compliment for the song

      Delete
  2. The lyric has given all the gist of life. The combination of Savithri and P. Leela have given wonderful songs. Thanks for posting the song -Subbarao

    ReplyDelete
  3. ఈ పాటకు ఒక చరిత్ర ఉంది. ఈ పాట స్థానంలో వేరొక పాట రాసారు రచయిత. ఆ పాట దర్శకుడు శ్రీ రామకృష్ణ గారికి నచ్చలేదు. ఇంకో పాట ప్రయత్నించండి అని చెప్పారట.
    రచయిత సముద్రాల జూనియర్ గారు, స్టూడియో నుండి బయటకు వచ్చారట. అది సంధ్యా సమయం. పడమట సూర్యుడు అస్తమిస్తున్నాడట. ఆ దృశ్యాన్ని చూడగానే, రచయిత మనస్సులో ఒక ఆలోచన వచ్చి పల్లవిగా "పడమట సంధ్యారాగం కుడి ఎడమల కుసుమ పరాగం" అని రాసుకొంటే, ఆ తరువాత చరణం తో పాటు పాటంతా ఒక వెల్లువలా వచ్చేసింది అని సగర్వంగా చెప్పుకొన్నారు.
    మరునాడు స్టూడియోకి వెళ్లి, దర్శకుడు రామకృష్ణ గారికి, చూపితే ఓకే అనడం, మాస్టారు గారు ట్యూన్ కట్టడం, పాట రికార్డింగ్ ముగించుకొని, మాస్టారు ఇంటికి వెళ్ళితే, ఏంటి అప్పుడే వచ్చేసారు అని శ్రీమతి సావిత్రమ్మ గారు అడిగితే, పాట రాయడం, ట్యూన్ కట్టడం, ఓకే కావడం, పాట రికార్డు చేయడం అంతా జరిగిపోయింది అని సంతోషంతో చెప్పారట.

    ReplyDelete