Tuesday, March 27, 2012

"కారులో షికారుకెళ్ళే"

అన్నపూర్ణ పిక్చర్స్ రెండవ చిత్రం "తోడికోడళ్ళు". ఈ చిత్రం 11-01-1957 లో విడుదలై బహుళ ప్రజాదరణ పొందింది. ఈ చిత్రానికి శ్రీ ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించగా, శ్రీ మాస్టర్ వేణు సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలోని పాటలు ఈనాటికి సజీవంగా ఉన్ నాయంటే, ఆ కీర్తి మాస్టర్ వేణు గారికే దక్కుతుంది. మాస్టర్ వేణు గారిది ఒక ప్రత్యెక శైలి. ఆయన పాటలను ట్యూన్ చేసేటప్పుడు, అందరిలా హార్మోనియం వాడకుండా, సందర్భానుబట్టి, పియానో, వేణువు లేక సితార్ మీద కంపోస్ చేస్తారని చెప్పుతారు. ఆత్రేయ విరచిత పాట  "కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడిదాన" ఎంత మధురంగా ట్యూన్ చేసారో,ఘంటసాల మాస్టారు అంత గొప్పగా పాడారు. నాటికీ, నేటికి ఎప్పటికి మరువలేని ఆణిముత్యం.  ఈ పాటను ఆత్రేయ గారు రాసారు అంటే ఇప్పటకి నమ్మని వారు ఉన్నారు. ఆ పాటను వీడియో క్లిప్పింగ్ ద్వారా చూడండి, పాటను ఆస్వాదించండి.

3 comments:

  1. పల్లవి:

    కారులో షికారు కెళ్ళే పాల బుగ్గల పసిడిదానా

    బుగ్గ మిద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా ?

    అనుపల్లవి:

    నిన్ను మించిన కన్నెలెందరో మండు టెండలో

    మాడుతుంటే .. వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి

    చేరెను తెలుసుకో.....

    కారులో షికారు కెళ్ళే పాల బుగ్గల పసిడిదానా ..

    నిలిచి విను ని బడాయి చాలు

    తెలుసుకో ఈ నిజా నిజాలు

    చరణం:

    చలువ రాతి మేడలోన కులుకుతావే కుర్రాదానా

    మేడకట్టిన చలువరాయి.. ఎలా వచ్చెనో చెప్పగలవా..

    కడుపుకలే కష్ట జీవులు.. ఓడలు విరిచి గనులు తొలచి

    చెమట చలువను చేర్చి రాళ్ళను పెర్చినారు తెలుసుకో..

    కారులో షికారు కెళ్ళే పాల బుగ్గల పసిడిదానా...

    గాలిలోన తేలిపోయే చీర కట్టిన చిన్నదానా

    జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా

    చిరుగుపాతల బరువు బ్రతుకుల నేత గాళ్ళే నేసినారు

    చాకిరొకరిది సౌఖ్యమోకరిది సాగదింక తెలుసుకో..

    కారులో షికారు కెళ్ళే పాల బుగ్గల పసిడిదానా...

    ReplyDelete
  2. నేనింకా శ్రీశ్రీ గారు రాసారు అనుకున్నానే!

    ReplyDelete
  3. ఈ పాట శైలి ని చూసి అందరూ శ్రీ శ్రీ గారు రాసారని అనుకొంటారు. ఇలాంటి పాట తను కూడా వ్రాయగల డని ఆత్రేయ గారు నిరూపించుకొన్నారు. అలాగే డాక్టర్ చక్రవర్తి చిత్రంలో "మనసున మనసై" వ్రాసింది శ్రీ శ్రీ గారు. దీనిని ఆత్రేయ గారు వ్రాసారని చాలామంది అనుకొంటారు. కాశి రావు (ఘంటసాల మాస్టారు)

    ReplyDelete