అన్నపూర్ణ వారి ఆత్మగౌరం చిత్రం 1965 విడుదలైంది. శ్రీ విశ్వనాధ్ గారు తొలిసారి దర్సకత్వం వహించిన చిత్రం ఆత్మగౌరం. అన్నపూర్ణ సంస్థకు శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారు సంగీతం సమకూర్చడం "ఇద్దరు మిత్రులు" చిత్రంతోనే ప్రారంభం. ఈ చిత్రం లోని పాటలు ఎంత ప్రజాదరణ పొందిందో అందరికి తెలిసిన విషయమే.
ఆత్మగౌరం చిత్రం లోని పాటలు కూడా బహుళ ప్రాచూర్యం పొందినవే. ఘంటసాల మాస్టారు, సుశీల గారితో పడిన యుగళ గీతం "ఒక పూల బాణం తగిలింది మదిలో" చాల చక్కటి పాట. గీత రచన దాశరథి. ఆ పాట వినండి.
చాలా చక్కని గీతం...కాలం ముందుకెళ్ళే కొద్దీ మరింత తీపిగా అనిపించేవి పాత సంగీతం, పాత రచనలూ...
ReplyDelete