బాబు మూవీస్ చిత్రం "మంచి మనసులు" విడుదలై దాదాపు 50 సంవత్సరాలు అవుతోంది. ఈ చిత్రం 12-04 -1962 రోజున విడుదలై ప్రజల మనసును దోచుకొన్న చిత్రరాజం. ఈ చిత్రానికి మూలం తమిళంలో వచ్చిన "కుముదం" అయితే, హిందీలో "పూజాకే పూల్ " పేరుతో ధర్మేంద్ర, మాల సిన్హాలతో తీసారు. అయితే తెలుగులోనే ఈ చిత్రం బాగా కుదిరింది. ఈ చిత్రంలోని పాటలన్నీ బహుళ ప్రజాదరణ పొందినవే. మామ మహాదేవెన్ అద్భుత బాణీలు సమకూర్చి అన్ని పాటలు హిట్ చేసారు. అందులో ఘంటసాల గానం చేసిన "అహో ఆంధ్ర భోజా శ్రీ కృష్ణదేవ రాయ".......పాట ఈ చిత్రానికే వన్నె తెచ్చిన ఆణిముత్యం. ఇంకో విశేషం, ఈ పాటకి/చిత్రీకరణకు, చిత్రం చివర్లో న్యాయస్థానం లో పబ్లిక్ ప్రాసిక్యుటర్, ముద్దాయి భార్య జానకి ని అడిగే ప్రశ్నలకు, ఆమె చెప్పే సమాధానాలకు చక్కటి సంధానం సమకూర్చారు. ఆత్రేయ కలం నుండి జారి వారిన ఈ చక్కటి పాట వినండి.
No comments:
Post a Comment