అన్నపూర్ణ పిక్చర్స్ రెండవ చిత్రం "తోడికోడళ్ళు". ఈ చిత్రం 11-01-1957 లో విడుదలై బహుళ ప్రజాదరణ పొందింది. ఈ చిత్రానికి శ్రీ ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించగా, శ్రీ మాస్టర్ వేణు సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలోని పాటలు ఈనాటికి సజీవంగా ఉన్ నాయంటే, ఆ కీర్తి మాస్టర్ వేణు గారికే దక్కుతుంది. మాస్టర్ వేణు గారిది ఒక ప్రత్యెక శైలి. ఆయన పాటలను ట్యూన్ చేసేటప్పుడు, అందరిలా హార్మోనియం వాడకుండా, సందర్భానుబట్టి, పియానో, వేణువు లేక సితార్ మీద కంపోస్ చేస్తారని చెప్పుతారు. ఆత్రేయ విరచిత పాట "కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడిదాన" ఎంత మధురంగా ట్యూన్ చేసారో,ఘంటసాల మాస్టారు అంత గొప్పగా పాడారు. నాటికీ, నేటికి ఎప్పటికి మరువలేని ఆణిముత్యం. ఈ పాటను ఆత్రేయ గారు రాసారు అంటే ఇప్పటకి నమ్మని వారు ఉన్నారు. ఆ పాటను వీడియో క్లిప్పింగ్ ద్వారా చూడండి, పాటను ఆస్వాదించండి.