Thursday, May 7, 2015

" నీ సుఖమే నే కోరుకున్నా నిని వీడి అందుకే వెళుతున్న"

ఆచార్య ఆత్రేయ జయంతి నేడు. మనసు కవి గా, మన సుకవిగా పేరు తెచ్చుకొన్న మహా కవి ఆత్రేయ గారు; 
మనసు అనే చరణం తోనే దాదాపు 100 పాటలు వ్రాసిన ఘనత వారిది. మూగమనసులు చిత్రం లో ఆయన వ్రాసిన 
పాడుతా తీయగా పాటలో  వచ్చే "పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు  ఉన్నోళ్ళు పోయోనోల్ల తీపి గురుతులు" ఒక నగ్న సత్యం.  జీవితాన్ని వడ పోసి వ్రాసినట్టుగా ఉంది. ఎంత నిగూడమైన భావం. ఇలా వ్రాయడం ఆయనకే చె ల్లు. 
ఇలా ఎన్నో చిత్రాలకు మాటలు -పాటలు వ్రాసిన మహా మనిషి. అర్ధాంగి, మంచి మనసులు, మూగ మనసులు, తేనె మనసులు, మురళీకృష్ణ, వాగ్దానం ( ఈ చిత్రానికి దర్శక నిర్మాత), అంతులేని కథ, ఇది కథ కాదు  ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు ...... ఎన్నో ఎన్నెన్నొ............ 
.ఆయన వ్రాసిన  పాటలలో నాకు ఇష్తమైన పాట " నీ సుఖమే నే కోరుకున్నా నిని వీడి అందుకే వెళుతున్న" చిత్రం మురళీకృష్ణ , సంగీతం మాస్టర్ వేణు, చిత్ర దర్శకుడు P పుల్లయ్య గారు.  ఆ పాట విందాము



No comments:

Post a Comment