డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఈ మధ్యనే తమ పుట్టిన రోజు పండుగ జరుపుకున్నారు. ( జూలై 29)
గత 52 సంవత్సరాలుగా ఆయన సినీ రంగానికి చేసిన సేవలు అమోఘం.
1962 లో "గులేభకావలి కథ" చిత్రం ద్వారా సినీ రంగానికి పరిచయ మయ్యారు. ఈ చిత్రం లోని
"నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని " పాటతో తెలుగు హృదయాలను దోచుకొన్నారు.
నేటికి ఈ పాట అజరామరమై శ్రోతల మనసులో నిలిచి ఉంది. ఈ చిత్రానికి సంగీతం: జోసెఫ్ అండ్ విజయా కృష్ణమూర్తి ఆ పాట విందాం
సినిమాకోసం ఆయన రాసిన మొదటి పాట ఇది. కాని ఆయన అంతకుముందెప్పుడో ‘రామప్ప’ నాటకంలో వ్రాసిన ‘ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో’ పాటను ఆ తరువాత ‘అమరశిల్పి జక్కన’ చిత్రంలో పెట్టారు. ఆ లెక్కన ఆయన మొదటి పాట ‘ఈ నల్లని రాలలో’
ReplyDeleteశంకరయ్య గారు, మీ ప్రశ్న లోనే జవాబు ఉంది.
ReplyDeleteఈ నల్లని రాళ్ళలో పాట సినిమా కోసం వ్రాయలేదు. రామప్ప నాటకం కోసం వ్రాసిన పాట.
సినీ రంగ ప్రవేశం మాత్రం 'నన్ను దోచుకుందు వటే" తోనే ప్రారంభం.
అమరశిల్పి జక్కన్న లో, దర్శకుడు బీ యస్ రంగా గారికి 'నల్లని రాళ్ళలో' పాట సన్నివేశ పరంగా
ఉందని పెట్టారు.
సినీమా కోసం వ్రాసింది నన్ను దోచు కుందువటే పాట ..గమనించగలరు
ధన్యవాదాలు
అమరశిల్పి జక్కన్న లో, దర్శకుడు బీ యస్ రంగా గారు 'నల్లని రాళ్ళలో' పాట సన్నివేశ పరంగా
ReplyDeleteకుదిరిందని పెట్టారు.
సినీమా కోసం వ్రాసింది నన్ను దోచు కుందువటే పాట ..గమనించగలరు
ధన్యవాదాలు