నేడు అంటే 07.. 05.. 2014.. ఆత్రేయ జయంతి
కిళాంబి వెంకట నరసింహాచార్యులు అంటే కొంత మందికే తెలుసు .
ఆచార్య ఆత్రేయ అంటే చాలా మందికి తెలుసు
మనసు కవి అంటే చాలా చాలా .మందికి ... మనందిరికి తెలుసు.
అంతలా అందరి మనసులో నిలిచి పోయిన మహా కవి ఆత్రేయ గారు.
వ్రాయక నిర్మాతను, రాసి ప్రేక్షకులను ఏడి పిస్తారని చెప్తారు.
"తోడి కోడళ్ళు" చిత్రం లో ఆత్రేయ గారు రాసిన " కారులో షికారు కెళ్ళే పాల బుగ్గల పసిడి తానా " పాట వింటే, ఆయన మనోభావాలు ఏమిటో తెలుస్తాయి. శ్రీ శ్రీ గారు రాసారా అన్న బ్రమ కలిగించి ఆశ్చర్య పరచారు.. ఇంక ఘంటసాల గారి గళం లో ఆ పాట ఎంతో మాధుర్యాన్ని పొందింది. మాస్టర్ వేణు చక్కటి సంగీతం అందించారు. అందుకే, ఈ నాటికీ ఈ పాట స్థిర స్థాయిగా నిలిచి పోయింది...
శ్రీ ఆత్రేయ గారికి జోహార్లు అందిస్తూ ..... ఈ పాట విందాము. ....
వెంకోబారావు గారు. నమస్కారం.చక్కని పాట. శ్రీశ్రీ సాహిత్యమా అని అనిపిస్తుంది. అలాగే ఆకలి రాజ్యం లోని సాపాటు ఎటూ లేదు కూడ. అయితే తోడికోడళ్ళ లోని ఈ పాటలో ఆత్రేయ గారు, "పాల బుగ్గల పసిడీ తానా" అన్నారు. "పసిడీ దానా" కాదు.'తాన' అంటే ఒక అర్ధం 'తీగె' లేక 'పోగు' అని అర్ధం. బహుశా ఆ అర్ధంలో 'పసిడి తీగె' అని అని వుంటారు. మరలా వినండి.
ReplyDeleteThanks for the correction. I do not have lyrics, of the song.... hence the mistake..
ReplyDeleteI have since made correction to the song....Thanks once again.
ReplyDelete